మంత్రిమండలి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు & పింఛనుదార్లకు డియర్‌నెస్ అలవెన్స్ & డియర్‌నెస్ రిలీఫ్‌ పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం


49.18 లక్షల మంది ఉద్యోగులు, 67.95 లక్షల మంది పింఛనుదార్లకు లబ్ధి

ఖజానాపై సంవత్సరానికి రూ.12,868.72 కోట్ల అదనపు భారం

Posted On: 07 MAR 2024 7:55PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు & పింఛనుదార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షతన స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల‌కు డియ‌ర్‌నెస్ అలవెన్స్ (డీఏ), పింఛనుదార్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) 4% పెంచడానికి ఆమోదం తెలిపింది. దీంతో, ప్రస్తుతమున్న 46% మూల వేతనం/పెన్షన్‌కు ఈ 4% కలుస్తుంది, మొత్తం 50% అవుతుంది. 01.01.2024 నుంచే ఇది అమల్లోకి వస్తుంది.

డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంపు కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాపై సంవత్సరానికి రూ.12,868.72 కోట్ల అదనపు భారం పడుతుంది. దీనివల్ల దాదాపు 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పింఛనుదార్లు లబ్ధి పొందుతారు.

7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించిన సూత్రానికి అనుగుణంగా ఈ పెంపు జరిగింది.

***



(Release ID: 2012484) Visitor Counter : 239