నీతి ఆయోగ్
భవిష్యత్ సాంకేతికత, ఆవిష్కరణలు పాఠశాలలో విద్యార్థులందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా, సమాచార అందుబాటును ప్రజాస్వామీకరించేందుకు చేతులు కలిపిన అటల్ ఇన్నొవేషన్ మిషన్, నీతి ఆయోగ్, మెటా
Posted On:
06 MAR 2024 3:14PM by PIB Hyderabad
భవిష్యత్ సాంకేతికతలను ప్రజాస్వామ్యీకరించేందుకు, ఆవిష్కరణల విషయంలో యువతకు సాధికారత కల్పించేందుకు అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎఐఎం), నీతి ఆయోగ్, మెటా సంస్థలు చేతులు కలిపాయి. ఇవి ఫ్రానిటీర్ టెక్నాలజీ ల్యాబ్‌లను(ఎఫ్.టి.ఎల్)లను పాఠశాలల్లో ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించాయి.
వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగిన పాఠశాలల్లో అటల్ ఇన్నొవేషన్ మిషన్, మెటా భాగస్వామ్యంతో ఇవి ఏర్పాటవుతాయి. దేశవ్యాప్తంగా వివిధ నేపథ్యాలు కలిగిన విద్యార్థులు అధునాతన సాంకేతికపరిజ్ఞానానికి సంబంధించిన ఫ్రానిటీర్ టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు, వాటిని నేర్చుకునేందుకు సమాన అవకాశాలు కల్పించేందుకు ,వాటిని సాధన చేసేందుకు ఈ ప్రయోగశాలలను ఏర్పాటుచేయనున్నాయి. ఇప్పటివరకు అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎఐఎం) దేశంలోని 722 జిల్లాలలో 10 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటుచేసింది. ఈ ఎటిఎల్‌ల లక్ష్యం, విద్యార్థులలో శాస్త్రవిజ్ఞాన ప్రయోగాల పట్ల ఆసక్తి, సృజనాత్మకత, ఆలోచనలను పెంపొందింప చేయడం. అలాగే డిజైన్ ఆలోచనలను, భౌతిక గణనను, గణన ఆలోచనలను పెంపొందించడం దీని ఉద్దేశం.
ఎఫ్.టి.ఎల్‌లు , అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల కన్నా అధునాతనమైనవి. ఇందులో అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానం , మౌలికసదుపాయాలు ఉంటాయి. ఇందులో విద్యార్థులు కృత్రిమ మేథ, ఆగ్‌మెంటెడ్ వర్చువల్ రియాలిటీ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, సైబర్‌సెక్యూరిటీ, రోబోటిక్స్, 3డి ప్రింటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటివి ఉన్నాయి. ఈ ల్యాబ్‌లు యువతకు డిజిటల్‌నైపుణ్యాలను అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయి. ఇవి ప్రపంచశ్రేణి సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావడానికి దోహదపడతాయి.
ఎఫ్.టి.ఎల్‌లకు మెటా నిధులు సమకూరుస్తుంది. అటల్ ఇన్నొవేషన్ మిషన్ నాలెడ్జ్‌పార్టనర్‌గా ఉంటుంది.
వర్క్‌షాప్‌లు , ముఖాముఖి కార్యక్రమాలు , ప్రాజెక్టు ఆధారిత అధ్యయనం ఇందులో ముఖ్యమైనవి. విద్యార్థులకు ఇందుకు అవసరమైన ఉపకరణాలు, వనరులను మెటా సమకూరుస్తుంది. వినూత్న ఆవిష్కరణలకు వీలుగా ఎల్‌ఎల్‌ఎఎంఎ, ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపకరణాలనుఇది అందిస్తుంది.
నీతి ఆయోగ్ కు చెందిన అటల్ ఇన్నొవేషన్ మిషన్ కు చెందిన మిషన్ డైరక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ మాట్లాడుతూ, ఎఐఎం, నీతి ఆయోగ్,మెటాలమధ్య సహకారం యువతను భవిష్యత్తుకు సన్నద్ధం చేసే బృహత్తర కార్యక్రమానికి ఉదాహరణ అని ఆయన అన్నారు. ఈ పరిశోధన కేంద్రాలు ఆవిష్కరణలకు, విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలు అందించడానికి, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి దోహదపడతాయన్నారు.
నీతి ఆయోగ్‌కు చెందిన ఎఐఎంతో భాగస్వాములై, ఫ్రానిటీర్ టెక్నాలజీ ల్యాబ్‌లు ఏర్పాటుచేయబోవడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని మెటా సంస్థకుచెందిన ఇండియా పబ్లిక్ పాలసీ విభాగం అధిపతి శివనాథ్ తుక్రల్ అన్నారు.కృత్రిమ మేథ, ఎ.ఆర్, వి.ఆర్, ఇతర సాంకేతికతలను ఉపయోగించి విద్యార్థులు వివిధ పరిష్కారాలను సాదించేందుకు ఈ ప్రయోగశాలలు వీలు కల్పిస్తాయన్నారు
ఎఫ్.టి.ఎల్ కార్యక్రమం మెటావారి ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ కార్యక్రమం. దీనిని 2023 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. భవిష్యత్ సాంకేతికతలు విద్యార్థులు, యువత, ఉద్యోగులు, సూక్ష్మ వ్యాపారులకు నిరంతరాయంగా అందుబాటులో ఉండేందుకు , డిజిటల్ నైపుణ్యాలను అట్టడుగుస్థాయికి తీసుకువెళ్లేందుకు దీనిని ప్రారంభించారు. యువతకు నైపుణ్యశిక్షణ అందించాలని, వారికి డిజిటల్ నైపుణ్యాలు కల్పించాలన్న లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది.
ఈ ల్యాబ్‌ల ఏర్పాటు అటల్ ఇన్నొవేషన్‌మిషన్ దార్శనికతకు అనుగుణంగా ఉంది.ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ నైపుణ్యాలను దేశవ్యాప్తంగా పాఠశాల స్థాయిలో కల్పించేందుకు ఇది దోహదపడుతుంది.భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ చర్య దోహదపడుతుంది. ఈ ప్రయోగశాలలను మెటా భాగస్వామి 1ఎం 1 బి(వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్) నిర్వహిస్తుంది.
***
(Release ID: 2012078)
Visitor Counter : 272