ప్రధాన మంత్రి కార్యాలయం

మార్చి నెల 7 వ తేదీ న శ్రీనగర్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; ‘వికసిత్ భారత్, వికసిత్  జమ్ము- కశ్మీర్’ కార్యక్రమం లో ఆయన పాలుపంచుకొంటారు


జమ్ము- కశ్మీర్ లో వ్యవసాయానికి-ఆర్థిక వ్యవస్థ కు ప్రోత్సాహాన్నిఇవ్వడం కోసం సుమారు 5,000 కోట్ల రూపాయల విలువైన కార్యక్రమాలను దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రధానమంత్రి

‘హోలిస్టిక్ ఎగ్రీకల్చర్డివెలప్‌మెంట్ ప్రోగ్రామ్’ జమ్ము-కశ్మీర్ లో సుమారురెండున్నర లక్షల మంది రైతుల కు నైపుణ్యాభివృద్ధి కి తోడ్పడనుంది; దీని కోసం దక్ష్ కిసాన్ అనే ఒక  పోర్టల్ ను రూపొందించడమైంది; కార్యక్రమం లో భాగం గా రమారమి 2,000 కిసాన్ ఖిద్‌మత్ ఘర్ లను కూడా ఏర్పాటు చేయడంజరుగుతుంది

పర్యటన రంగాని కి ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం, స్వదేశ్దర్శన్ లో మరియు పిఆర్ఎఎస్‌హెచ్‌ఎడి (‘ప్రసాద్’) స్కీము లో భాగం గా ఉండేటటువంటి 52 పర్యటన రంగ ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రిప్రారంభించి, దేశ ప్రజల కుఅంకితం చేయనున్నారు; ఈ ప్రాజెక్టుల విలువ 1400 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది

శ్రీనగర్ లో హజ్‌రత్‌ బల్ తీర్థస్థలం యొక్క సమగ్రఅభివృద్ధి కి ఉద్దేశించిన శ్రీనగర్ ప్రాజెక్టు ను దేశ ప్రజల కు అంకితం చేయనున్నప్రధాన మంత్రి

ప్రధానమైన ధార్మిక స్థలాలు, అనుభూతి కేంద్రాలు, ఇకోటూరిజమ్ సైట్స్ లతోపాటు యావత్తు దేశం లో టూరిస్ట్ సర్క్యూట్ లను అభివృద్ధి పరచడం జరుగుతుంది

ఛాలెంజ్ బేస్‌డ్ డెస్టినేశన్ డివెలప్‌ మెంట్ స్కీమ్లో భాగం గా ఎంపిక చేసినటువంటి పర్యటన స్థలాల ను ప్రకటించనున్న ప్రధాన మంత్రి

‘దేఖో అప్‌నా దేశ్పీపల్స్ చాయిస్ 2024’ ను మరియు ‘చలో ఇండియా గ్లోబల్ డాయస్పోరా కైంపేన్ నుప్రారంభించనున్న ప్రధాన మంత్రి

జమ్ము- కశ్మీర్ లో ప్రభుత్వం లో క్రొత్త గా భర్తీచేసుకొంటున్న వారి కి నియామక సంబంధి ఉత్తర్వుల ను పంపిణీ చేయనున్న ప్రధాన మంత్రి

Posted On: 06 MAR 2024 9:51AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి నెల 7 వ తేదీ నాడు జమ్ము- కశ్మీర్ లోని శ్రీనగర్ ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వేళ లో ప్రధాన మంత్రి శ్రీనగర్ లోని బఖ్శీ స్టేడియమ్ కు చేరుకొంటారు. అక్కడ ఆయన వికసిత్ భారత్, వికసిత్ జమ్ము కశ్మీర్కార్యక్రమం లో పాలుపంచుకొంటారు.

 

 

ఈ కార్యక్రమం లో భాగం గా, జమ్ము- కశ్మీర్ లో వ్యవసాయాని కి మరియు ఆర్థిక వ్వవస్థ కు దన్ను గా నిలచేందుకు రూపొందించినటువంటి దాదాపు గా 5,000 కోట్ల రూపాయల విలువైన హోలిస్టిక్ ఎగ్రీకల్చర్ డివెలప్‌ మెంట్ ప్రోగ్రామును ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఆయన స్వదేశ్ దర్శన్ మరియు పిలిగ్రిమేజ్ రిజూవెనేశన్ ఎండ్ స్పిరిచ్యువల్, హెరిటేజ్ ఆగ్‌మెంటేశన్ డ్రైవ్ (పిఆర్ఎఎస్‌హెచ్ఎడి) ప్రాజెక్టుల లో భాగం గా 1400 కోట్ల రూపాయల కు పైగా విలువైన పర్యటన రంగాని కి సంబంధించిన అనేక ప్రాజెక్టుల ను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల లో శ్రీనగర్ లో హజ్‌రత్‌బల్ తీర్థ స్థలం యొక్క సమగ్ర అభివృద్ధి కి ఉద్దేశించినటువంటి ఒక ప్రాజెక్టు కూడా భాగం గా ఉంది. ప్రధాన మంత్రి దేఖో అప్‌నా దేశ్ పీపల్స్ చాయిస్ టూరిస్ట్ డెస్టినేశన్ పోల్ను మరియు చలో ఇండియా గ్లోబల్ డాయస్పోరా కైంపేన్ను కూడా ప్రారంభించనున్నారు. చాలెంజ్ బేస్‌డ్ డెస్టినేశన్ డివెలప్‌ మెంట్ (సిబిడిడి) పథకం లో భాగం ఎంపిక చేసినటువంటి పర్యటన స్థలాల ను కూడా ఆయన ప్రకటించనున్నారు. దీనికి అదనం గా, ప్రధాన మంత్రి జమ్ము- కశ్మీర్ లో సుమారు ఒక వేయి మంది క్రొత్త గా ప్రభుత్వం లో చేర్చుకొంటున్న వారి కి నియామకపు ఉత్తర్వుల ను పంపిణీ చేయనున్నారు. విభిన్న ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి మాట్లాడుతారు. వారి లో- లబ్ధి ని అందుకొన్న మహిళలు, లఖ్ పతి దీదీ లు (లక్షాధికారి సోదరీమణులు), రైతులు , నవపారిశ్రమికవేత్తలు మొదలైన వారు- ఉంటారు.

 

 

జమ్ము- కశ్మీర్ యొక్క వ్యవసాయం మరియు ఆర్థిక వ్వవస్థ కు పూర్తి స్థాయి లో ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం ‘హోలిస్టిక్ ఎగ్రీకల్చర్ డివెలప్‌ మెంట్ ప్రోగ్రామ్’ (హెచ్ఎడిపి) ని దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. హెచ్ఎడిపి అనేది ఒక ఏకీకృత కార్యక్రమం. దీనిలో భాగం గా జమ్ము- కశ్మీర్ లో వ్యవసాయం మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క మూడు క్షేత్రాలు అయినటువంటి తోటల పెంపకం, వ్యవసాయం మరియు పశుగణం పాలన లలో కార్యకలాపాల ను ఏకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేకమైన దక్ష్ కిసాన్ పోర్టల్ మాధ్యం తో రమారమి 2.5 లక్షల మంతది రైతుల కు నైపుణ్యాల అభివృద్ధి తాలూకు శిక్షణ ను ఇస్తారన్న అంచనా ఉంది. కార్యక్రమం లో భాగం గా, సుమారు 2000 కిసాన్ ఖిద్ మత్ ఘర్ లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి కర్షక సముదాయం యొక్క సంక్షేమం కోసం బలమైనటువంటి వేల్యూ చైన్ లను స్థాపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగాల కల్పన వీలుపడుతుంది. దీనితో జమ్ము కశ్మీర్ లో లక్షల కొద్దీ సీమాంత కుటుంబాలు లబ్ధి ని పొందగలవు.

 

 

దేశవ్యాప్తం గా ఉన్న ప్రధానమైన తీర్థయాత్ర స్థలాల లో మరియు పర్యటక క్షేత్రాల లో ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయల ను మరియు సౌకర్యాల ను అందించడం ద్వారా ఆ ప్రాంతాల ను సందర్శించేటటువంటి పర్యటకుల కు, తీర్థ యాత్రికుల కు వారు పొందే అనుభూతి లో నాణ్యత ను పెంచాలనేది ప్రధాన మంత్రి యొక్క దృష్టికోణం గా ఉంది. దీనికి అనుగుణం గా, ప్రధాన మంత్రి 1400 కోట్ల రూపాలయ కు పైగా విలువ కలిగిన అనేక కార్యక్రమాల ను స్వదేశ్ దర్శన్, ఇంకా పిఆర్ఎఎస్‌హెచ్ఎడి పథకాల లో భాగం గా ఆరంభించడం తో పాటు దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్న ప్రాజెక్టుల లో శ్రీ నగర్ లోని ఇంటిగ్రేటెడ్ డివెలప్‌ మెంట్ ఆఫ్ హజ్‌రత్‌ బల్ శ్రైన్’; మేఘాలయ లో నార్థ్ ఈస్ట్ సర్క్యూట్ లో అభివృద్ధి పరచిన పర్యటన సదుపాయాలు; బిహార్ మరియు రాజస్థాన్ లలో స్పిరిచ్యువల్ సర్క్యూట్; బిహార్ లోని రూరల్ ఎండ్ తీర్థంకర్ సర్క్యూట్; తెలంగాణ లోని జోగులాంబ గద్వాల్ జిల్లా లో నెలకొన్న జోగులాంబ దేవి ఆలయం అభివృద్ధి పనులు; ఇంకా మధ్య ప్రదేశ్ లోని అన్నుపుర్ జిల్లా లో గల అమర్‌ కంటక్ దేవాలయం యొక్క అభివృద్ధి పనులు కలసి ఉన్నాయి.

 

 

హజరత్‌ బల్ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించే యాత్రికులు మరియు పర్యటకుల కు ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయల ను మరియు సౌకర్యాల ను నిర్మించే ప్రయాస లో మరియు వారి కి సంపూర్ణ ఆధ్యాత్మిక అనుభూతి ని కలిగేటట్లు చేయడం కోసం ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హజ్‌రత్‌ బల్ శ్రైన్ప్రాజెక్టు ను అమలు పరచడమైంది. ఈ ప్రాజెక్టు లో - ఆ పవిత్ర క్షేత్రం చుట్టూ సరిహద్దు గోడ ను నిర్మించడం తో పాటు, ఆ ప్రాంతం అంతటినీ అభివృద్ధి పరచడం హజ్‌రత్‌ బల్ పవిత్ర క్షేత్రం పరిసరాల లో వెలుగుల ను నింపే విధం గా ఏర్పాటులు చేయడం; ఆ క్షేత్రం చుట్టుప్రక్కల ఘాట్ లు మరియు దేవ్ రీ మార్గాల ను మెరుగు పరచడం; సూఫీ వ్యాఖ్య కేంద్రాన్ని నిర్మించడం; యాత్రికుల కు సౌకర్య కేంద్రం నిర్మాణం; ఏ యే వసతులు ఎక్కడెక్కడ ఉన్నాయో సూచించే బోర్డు లను ఏర్పాటు చేయడం; బహుళ అంతస్తుల తో కూడి ఉండేటటువంటి కారు లను నిలిపి ఉంచే చోటు లు; పబ్లిక్ కన్వీనియన్స్ బ్లాక్ యొక్క నిర్మాణం, పవిత్ర క్షేత్రం లోకి ప్రవేశించేందుకు ఒక శ ద్వారాన్ని నిర్మించడం ఇంకా ఇతర పనులు - భాగం గా ఉన్నాయి.

 

 

దేశం లో వివిధ ప్రాంతాల లో గల తీర్థయాత్ర క్షేత్రాలు మరియు పర్యటక స్థలాల లో విస్తృత శ్రేణి అభివృద్ధి పనుల ను చేపట్టేందుకు ఉద్దేశించినటువంటి దాదాపు 43 ప్రాజెక్టుల ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. వీటిలో ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ జిల్లా లో కొలువైన అన్నవరం దేవాలయం; తమిళ నాడు లో తంజావూరు మరియు మయిలాడుతురై జిల్లా, ఇంకా పుదుచ్చేరి లోని కరైకల్ జిల్లా లో నెలకొన్న నవగ్రహ దేవాలయాలు; కర్ణాటక లోని మైసూరు జిల్లా లో గల శ్రీ చాముండేశ్వరి దేవి దేవాలయం; రాజస్థాన్ లోని బీకానెర్ జిల్లా లో కరణీ మాత మందిరం; హిమాచల్ ప్రదేశ్ లోని ఊనా జిల్లా లో ఉన్న మాత చింత్‌పూర్ణి దేవాలయం; గోవా లోని బేసిలికా ఆఫ్ బాఁమ్ జీసస్ చర్చ్ తదితర ముఖ్య ధార్మిక స్థలాలు కూడా ఉన్నాయి. ఇతర స్థలాలు మరియు అనుభవ కేంద్రాల ను పరిశీలించినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ లో మెచుక అడ్ వెన్చర్ పార్కు; ఉత్తరా ఖండ్ లో ని పిథౌరాగఢ్ లో గుంజీ వద్ద ఉన్న రూరల్ టూరిజమ్ క్లస్టర్ ఎక్స్‌ పీరియన్స్; తెలంగాణ లోని అనంతగిరి అటవీ ప్రాంతం లో ఇకోటూరిజమ్ జోన్; మేఘాలయ లోని సోహ్‌రా క్షేత్రం లో గల మేఘాలయ యుగం నాటి గుహలు మరియు జలపాతం సంబంధి అనుభూతులు; అసమ్ లోని జోర్‌ హాట్ లో సినామారా తేయాకు క్షేత్రం; పంజాబ్ లోని కపూర్‌ థలా లో కాంజ్‌లీ వెట్ లేండ్; లెహ్ లో జూలీ లెహ్ బయోడైవర్సిటీ పార్కు వంటి విభిన్నమైన ఇతర స్థలాలు మరియు అనుభూతి కేంద్రాల అభివృద్ధి కూడా చేరి ఉంది.

 

 

ఈ కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి చాలెంజ్ బెస్డ్ డెస్టినేశన్ డివెలప్‌ మెంట్ (సిబిడిడి) స్కీమ్ లో ఎంపిక చేసిన 42 పర్యటక ప్రాంతాల ను గురించి ప్రకటన చేయనున్నారు. ఇది ఒక వినూత్నమైన పథకం, దీనిని 2023-24 కేంద్ర బడ్జెటు సమర్పణ వేళ లో వెల్లడించడమైంది; పర్యటకులు సందర్శించే ప్రాంతాల ను అభివృద్ధి పరచడం లో ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవడం, అలాగే పర్యటన రంగం లో నాలుగు కాలాల పాటు నిలచి ఉండే విధం గాను మరియు పర్యటన స్థలాల లో పోటీతత్వాన్ని పరిచయం చేసే తరహా పథకాల ను ప్రోత్సహించాలనేది దీని ఉద్దేశ్యం గా ఉంది. నాలుగు కేటగిరీ ల వారీగా 42 క్షేత్రాల ను గుర్తించడం జరిగింది. వాటిలో (సంస్కృతి మరియు వారసత్వ గమ్యస్థానాలు 16; ఆధ్యాత్మిక స్థలాలు 11; ఇకోటూరిజమ్ మరియు అమృత్ ధరోహర్ కేటగిరీ లో 10 ప్రాంతాలు మరియు వైబ్రంట్ విలేజ్ కేటగిరీ లో 5 ప్రాంతాలు ఉన్నాయి.)

 

 

దేఖో అప్‌ నా దేశ్ పీపల్స్ చాయిస్ 2024’ లో భాగం గా పర్యటన రంగం లో దేశ ప్రజల నాడి ని పసిగట్టడం కోసం తలపెట్టినటువంటి మొట్ట మొదటి దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. పర్యటకులతో కలసి అన్నింటి కంటే అభిమానపాత్రం అయినటువంటి పర్యటక ఆకర్షణ లను గుర్తించడం, అలాగే అయిదు పర్యటన శ్రేణులు- స్పిరిచ్యువల్, కల్చరల్ & హెరిటేజ్, నేచర్ & వైల్డ్ లైఫ్, అడ్వంచర్ మరియు ఇతర శ్రేణుల లో- పర్యటకుల అంతరంగాన్ని గురించి అర్థం చేసుకోవడం ఈ దేశవ్యాప్త అభిప్రాయ సేకరణ యొక్క ఉద్దేశ్యం గా ఉంది. నాలుగు ముఖ్య శ్రేణుల కు అదనం గా , ఇతర శ్రేణి ఏది అంటే అందులో ఎవరైనా తన కు వ్యక్తిగతం గా నచ్చిన పర్యటన ప్రధాన స్థలాన్ని గురించి న వోటు ను వేయవచ్చును అనేదే. అంతేకాక, వెలుగు లోకి రానటువంటి పర్యటన ఆకర్షణ కలిగిన మరియు వైబ్రంట్ బార్డర్ విలేజెస్, వెల్‌నెస్ టూరిజమ్, వెడింగ్ టూరిజమ్ మొదలైన ఇంతవరకు వెలుగు లోకి రానటువంటి ప్రాంతాల ను పర్యటన ప్రాధాన్యం కలిగినటువంటి స్థలాల ను ఇక మీదట వెలుగు లోకి తీసుకు రావడం కూడాను. ఈ అభిప్రాయ సేకరణ ను భారతదేశం ప్రభుత్వ పౌరుల భాగస్వామ్య పోర్టల్ అయిన మైగవ్ (MyGov) ప్లాట్ ఫార్మ్ లో నిర్వహించడం జరుగుతోంది.

 

 

ప్రధాన మంత్రి చలో ఇండియా గ్లోబల్ డాయస్పోరా కైంపేన్ను కూడా ప్రారంభించనున్నారు. విదేశాల లో ఉంటున్న భారతదేశీయులు ఇన్‌క్రెడిబుల్ ఇండియా కు ప్రచారకర్తలు గా మారి, భారతదేశం లో పర్యటన ను ప్రోత్సహించే దిశ లో చేయూత ను అందించే విధం గా వారి లో ప్రేరణ ను కలిగించాలి అనేది ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం గా ఉంది. విదేశాల లో ఉంటున్న భారతీయులు వారి పరిచయస్తుల లో కనీసం అయిదుగురు భారతీయులు కాని అటువంటి మిత్రుల ను భారతదేశం లో పర్యటించేందుకు ప్రోత్సహించాలి అంటూ ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు ఆధారం గా ఈ ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మూడు కోట్ల సంఖ్య కు మించిన ప్రవాసీ భారతీయులు ఉంటే, వారు సాంస్కృతిక రాయబారుల వలె వ్యవహరిస్తూ భారతీయ పర్యటక రంగానికి ఊతం ఇవ్వడం కోసం ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకం వంటి పాత్ర ను పోషించేందుకు ఆస్కారం ఉంది.

 

 

 

***



(Release ID: 2011975) Visitor Counter : 127