రక్షణ మంత్రిత్వ శాఖ
'అమ్యునిషన్ కమ్ టార్పెడో కమ్ మిస్సైల్ బార్జ్, ఎల్‌ఎస్‌ఏఎం19'ను భారత నౌకాదళానికి అప్పగించిన సూర్యదీప్త ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
Posted On:
05 MAR 2024 8:32AM by PIB Hyderabad
భారతీయ నౌకాదళం కోసం థానేలోని సూర్యదీప్త ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన 'అమ్యునిషన్ కమ్ టార్పెడో కమ్ మిస్సైల్ బార్జ్, ఎల్‌ఎస్‌ఏఎం19'ను, 04 మార్చి 2024న, ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో నావికాదళానికి అప్పగించారు.
11 ఏసీటీసీఎం బార్జ్ ప్రాజెక్టులో ఇది 5వ బార్జ్. కెప్టెన్ అశుతోష్ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది.
11 ఏసీటీసీఎం బార్జ్‌ల నిర్మాణానికి సంబంధించి, 05 మార్చి 2021న, రక్షణ మంత్రిత్వ శాఖ - సూర్యదీప్త ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ బార్జ్‌లు భారత నౌకాదళ నౌకలకు జెట్టీల పక్కన, బాహ్య హార్బర్ల వద్ద సహాయకారులుగా ఉంటాయి. వివిధ వస్తువులు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఎక్కించడం, దింపడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
భారతీయ నౌకాదళ నియమనిబంధనల ప్రకారం ఈ బార్జ్‌లను దేశీయంగా నిర్మించారు. నిర్మాణ దశలో బార్జ్ నమూనా పరీక్షను విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీలో నిర్వహించారు. ఈ బార్జ్‌లు 'భారత్‌లో తయారీ' చొరవకు నిదర్శనంగా నిలుస్తాయి.
___
(Release ID: 2011655)
Visitor Counter : 146