ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బిహార్ లోని బెగుసరాయ్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన చేసిన ప్రధాని


సుమారు రూ.1.48 లక్షల కోట్ల విలువైన పలు చమురు, గ్యాస్ ప్రాజెక్టుల అంకితం, శంకుస్థాపన

బీహార్ లో రూ.13,400 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన చేసిన ప్రధాని

బరౌనీలో హిందుస్థాన్ ఉర్వారక్ అండ్ రసయాన్ లిమిటెడ్ (హెచ్ యు ఆర్ ఎల్ ) ఎరువుల కర్మాగారం ప్రారంభం
సుమారు రూ.3917 కోట్ల విలువైన పలు రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

దేశంలోని పశువుల డిజిటల్ డేటాబేస్- 'భారత్ పశుధన్' - జాతికి అంకితం
'1962 రైతు యాప్; ప్రారంభం

“డబుల్ ఇంజిన్ ప్రభుత్వ శక్తి కారణంగా బీహార్ ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో ఉంది”

“బీహార్ వికసిత్ గా మారితే భారత్ కూడా వికసిత్ గా మారుతుంది”

“బీహార్, తూర్పు భారతదేశం సుభిక్షంగా ఉన్నప్పుడు భారతదేశం సాధికారత సాధించిందనడానికి చరిత్రే నిదర్శనం”

“నిజమైన సామాజిక న్యాయం 'సంతుష్టికరణ్; ద్వారానే సాధ్యం - ;తుష్టికరణ్' ద్వారా కాదు; సంతృప్తతతోనే నిజమైన సామాజిక న్యాయం లభిస్తుంది”

“డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ద్వంద్వ ప్రయత్నాలతో బిహార్ వికసిత్ కావడం ఖాయం”

Posted On: 02 MAR 2024 6:27PM by PIB Hyderabad

దేశంలో సుమారు రూ.1.48 లక్షల కోట్ల విలువైన పలు చమురు, గ్యాస్ రంగ ప్రాజెక్టులకు, బీహార్ లో రూ.13,400 కోట్ల రూపాయలు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బీహార్ లోని బెగుసరాయ్ లో జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, వికసిత్ భారత్ ఏర్పాటు ద్వారా బిహార్ ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తాను ఈ రోజు బిహార్ లోని బెగుసరాయ్ కు చేరుకున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. భారీ జనసందోహాన్ని ఉద్దేశించి వారి ప్రేమ, ఆశీర్వాదాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

బెగుసరాయ్ ప్రతిభావంతులైన యువత భూమి అని, ఇది ఎల్లప్పుడూ దేశ రైతులు, కార్మికులను బలోపేతం చేస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. నేడు సుమారు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం లేదా వాటికి శంకుస్థాపనలు చేయడం వల్ల బెగుసరాయ్ కు పూర్వ వైభవం వస్తోందని ఆయన ఉద్ఘాటించారు. గతంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఇలాంటి కార్యక్రమాలు జరిగేవని, కానీ ఇప్పుడు మోదీ మోడీ ఢిల్లీని బెగుసరాయ్ కు తీసుకొచ్చారని ప్రధాని అన్నారు. రూ.30,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒక్క బీహార్ కు సంబంధించినవేనని చెప్పారు.

ఈ పెరుగుదల భారతదేశ సామర్థ్యాలను చూపుతుందని, బీహార్ యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, నేటి అభివృద్ధి ప్రాజెక్టులు భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చడానికి ఒక మాధ్యమంగా మారుతాయని, అదే సమయంలో బీహార్ లో సేవ , సౌభాగ్యాలకు మార్గం సుగమం చేస్తుందని ఆయన చెప్పారు. ఈ రోజు బిహార్ కు కొత్త రైలు సర్వీసులను ప్రారంభించడం గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేగవంతమైన అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మోదీ పునరుద్ఘాటించారు. "బీహార్, తూర్పు భారతదేశం సుభిక్షంగా ఉన్నప్పుడు భారతదేశం శక్తివంతంగా ఉందని చరిత్ర రుజువు చేస్తుంది" అని ప్రధాన మంత్రి అన్నారు, దేశంపై బీహార్ క్షీణిస్తున్న పరిస్థితుల ప్రతికూల ప్రభావాన్ని వివరించారు. బిహార్ అభివృద్ధి వికసిత్ భారత్ కు దోహదం చేస్తుందని ఆయన రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. "ఇది వాగ్దానం కాదు, ఇది ఒక మిషన్, ఒక సంకల్పం " అని ప్రధాన మంత్రి అన్నారు, ప్రధానంగా పెట్రోలియం, ఎరువులు , రైల్వేలకు సంబంధించిన నేటి ప్రాజెక్టులు ఈ దిశలో ఒక పెద్ద అడుగు అని చెప్పారు. 'ఇంధనం, ఎరువులు, కనెక్టివిటీ అభివృద్ధికి పునాది. వ్యవసాయం అయినా, పరిశ్రమ అయినా, ప్రతిదీ వాటిపైనే ఆధారపడి ఉంటుంది" అని ప్రధాన మంత్రి తన పేర్కొన్నారు. ఉపాధి, ఉపాధి అవకాశాల పెంపు ప్రభుత్వ ప్రాధాన్యాలు అని స్పష్టం చేశారు.

బరౌనీ ఎరువుల కర్మాగారం ప్రారంభం గురించి ప్రధాన మంత్రి గుర్తు చేశారు, ఆ హామీ ఈ రోజు నెరవేరింది. బీహార్ రైతులతో సహా దేశంలోని రైతులకు ఇది పెద్ద విజయమని ఆయన అన్నారు. గోరఖ్ పూర్, రామగుండం, సింద్రీ ప్లాంట్లు మూతపడ్డాయని, కానీ ఇప్పుడు అవి యూరియాలో భారత స్వావలంబనకు ప్రధానాధారంగా మారుతున్నాయని ఆయన అన్నారు. “అందుకే మోదీ హామీలు అంటే హామీ నెరవేరే గ్యారంటీ అని దేశం చెబుతోందని” ఆయన అన్నారు.

వేలాది మంది శ్రామికులకు నెలల తరబడి ఉపాధి కల్పిస్తున్న బరౌనీ రిఫైనరీ పనుల పరిధిని ఈ రోజు విస్తరించడం గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. బరౌనీ రిఫైనరీ బీహార్ లో పారిశ్రామికాభివృద్ధికి కొత్త శక్తిని ఇస్తుందని, భారతదేశాన్ని ఆత్మనిర్భర్ గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఉద్ఘాటించారు. బీహార్ లో రూ.65,000 కోట్లకు పైగా విలువైన పెట్రోలియం, సహజవాయువుకు సంబంధించిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి కావడం పట్ల ప్రధాన మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. గ్యాస్ పైప్ లైన్ నెట్ వర్క్ ల విస్తరణతో బీహార్ లోని మహిళలకు తక్కువ ధరకే గ్యాస్ ను సరఫరా చేసే సౌలభ్యం ఉందని, ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన సులభమవుతుందని ఆయన వివరించారు. కెజి బేసిన్ నుండి దేశానికి 'ఫస్ట్ ఆయిల్', ఒఎన్ జిసి కృష్ణా గోదావరి డీప్ వాటర్ ప్రాజెక్టు నుండి మొదటి ముడి చమురు ట్యాంకర్ లను ఈ రోజు జెండా ఊపి ప్రారంభించినట్టు, ఈ ముఖ్యమైన రంగంలో స్వావలంబనను మెరుగుపరచడంలో సహాయపడుతుందని ప్రధాన మంత్రి అన్నారు. జాతీయ ప్రయోజనాలకు ప్రభుత్వం అంకితమైందని అంటూ, స్వార్థపూరిత వారసత్వ రాజకీయాలను ఆయన విమర్శించారు. మునుపటి సంవత్సరాలకు భిన్నంగా, ఇప్పుడు భారతదేశ రైల్వే ఆధునీకరణ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. విద్యుదీకరణ, స్టేషన్ అప్ గ్రేడేషన్ గురించి ఆయన ప్రస్తావించారు. వారసత్వ రాజకీయాలకు, సామాజిక న్యాయానికి మధ్య ఉన్న తీవ్ర వ్యతిరేకతను ప్రధాని వివరించారు. ముఖ్యంగా వారసత్వ రాజకీయాలు ప్రతిభకు, యువత సంక్షేమానికి హానికరం అన్నారు.

“నిజమైన సామాజిక న్యాయం 'సంతుష్టికరణ్' ద్వారానే లభిస్తుందని, 'తుష్టికరణ్' ద్వారా కాదని, అది సంతృప్తత ద్వారా సాధించబడుతుందని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని మాత్రమే తాను గుర్తిస్తానని” ప్రధాని వ్యాఖ్యానించారు. రైతులకు ఉచిత రేషన్, పక్కా గృహాలు, గ్యాస్ కనెక్షన్లు, మంచినీటి సరఫరా, మరుగుదొడ్లు, ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలు, కిసాన్ సమ్మాన్ నిధితో నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. గడచిన పదేళ్లలో ప్రభుత్వ పథకాల ద్వారా అత్యధికంగా లబ్దిపొందినది దళిత, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాలేనని ప్రధాని అన్నారు. తమకు సామాజిక న్యాయం అంటే నారీ శక్తి సాధికారత అని ఆయన అన్నారు. కోటి మంది మహిళలను 'లఖ్పతి దీదీలు'గా మార్చడం, మూడు కోట్ల మంది 'లఖ్పతి దీదీ'లను సృష్టించాలనే తన సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు, వారిలో చాలా మంది బీహార్ కు చెందిన వారేనని ఆయన తెలిపారు. విద్యుత్ బిల్లులను తగ్గించడంతో పాటు అదనపు ఆదాయాన్ని అందించే పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ఆయన ప్రస్తావించారు. బీహార్ లోని ఎన్ డిఎ ప్రభుత్వం పేదలు, మహిళలు, రైతులు, చేతివృత్తులు, వెనుకబడినవారు, అణగారిన వర్గాల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోందన్నారు. "డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ద్వంద్వ ప్రయత్నాలతో బీహార్ వికసిత్ గా మారడం ఖాయం" అని ప్రధాన మంత్రి తన పేర్కొన్నారు.

ప్రసంగాన్ని ముగిస్తూ ప్రధాన మంత్రి, వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీహార్ గవర్నర్ శ్రీ రాజేంద్ర వి ఆర్లేకర్, బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, బీహార్ ఉప ముఖ్యమంత్రులు శ్రీ సామ్రాట్ చౌదరి, శ్రీ విజయ్ కుమార్ సిన్హా, కేంద్ర పెట్రోలియం , సహజవాయువు మంత్రి శ్రీ హర్దీప్ పూరి, పార్లమెంటు సభ్యుడు శ్రీ గిరిరాజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

సుమారు రూ.1.48 లక్షల కోట్ల విలువైన పలు చమురు, గ్యాస్ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి, జాతికి అంకితం చేసి, శంకుస్థాపన చేశారు. కేజీ బేసిన్ తో పాటు బీహార్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక వంటి వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టులు విస్తరించి ఉన్నాయి.

కేజీ బేసిన్ నుంచి 'ఫస్ట్ ఆయిల్'ను జాతికి అంకితం చేసిన ప్రధాని ఓఎన్జీసీ కృష్ణాగోదావరి డీప్ వాటర్ ప్రాజెక్టు నుంచి తొలి క్రూడాయిల్ ట్యాంకర్ ను జెండా ఊపి ప్రారంభించారు. కెజి బేసిన్ నుండి 'ఫస్ట్ ఆయిల్' వెలికితీత భారతదేశ ఇంధన రంగంలో ఒక చారిత్రాత్మక విజయాన్ని సూచిస్తుంది, ఇది ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుందని భరోసా ఇస్తోంది. ఈ ప్రాజెక్టు భారతదేశ ఇంధన రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుంది, ఇంధన భద్రతను పెంచుతుందని, ఆర్థిక స్థితిస్థాపకతను పెంపొందిస్తుందని వాగ్దానం చేస్తుంది.

బీహార్ లో సుమారు రూ.14,000 కోట్ల విలువైన చమురు, గ్యాస్ రంగ ప్రాజెక్టులు చేపట్టారు. ఇందులో రూ.11,400 కోట్లకు పైగా ప్రాజెక్టు వ్యయంతో బరౌనీ రిఫైనరీ విస్తరణకు శంకుస్థాపన, బరౌనీ రిఫైనరీలో గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ప్రాజెక్టులు; పాట్నా , ముజఫర్పూర్ వరకు పారాదీప్ - హల్దియా - దుర్గాపూర్ ఎల్పిజి పైప్ లైన్ పొడిగింపు వంటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా చేపట్టిన ఇతర ముఖ్యమైన చమురు, గ్యాస్ ప్రాజెక్టులలో- హర్యానాలోని పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ విస్తరణ; పానిపట్ రిఫైనరీలో 3జీ ఇథనాల్ ప్లాంట్, క్యాటలిస్ట్ ప్లాంట్; ఆంధ్రప్రదేశ్ లో విశాఖ రిఫైనరీ ఆధునీకరణ ప్రాజెక్టు (వీఆర్ ఎంపీ); సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ప్రాజెక్టు (పంజాబ్ లోని ఫజిల్కా, గంగానగర్, హనుమాన్ గఢ్ జిల్లాలను కలిగి ఉంది); కర్ణాటకలోని గుల్బర్గా వద్ద కొత్త పిఒఎల్ డిపో, మహారాష్ట్రలో ముంబై హై నార్త్ రీడెవలప్మెంట్ ఫేజ్ -4 మొదలైనవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ)కు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు.

ప్రధాన మంత్రి బరౌనీలో హిందుస్తాన్ ఉర్వార క్ అండ్ రసయాన్ లిమిటెడ్ (హెచ్ యు ఆర్ ఎల్ ) ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించారు. రూ.9500 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ ప్లాంట్ రైతులకు సరసమైన యూరియాను అందించడంతో పాటు వారి ఉత్పాదకతను, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. దేశంలో పునరుద్ధరించిన నాలుగో ఎరువుల కర్మాగారం ఇది.

సుమారు రూ.3917 కోట్ల విలువైన పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. వీటిలో రఘోపూర్ - ఫోర్బ్స్ గంజ్ గేజ్ కన్వర్షన్ ప్రాజెక్టు; ముకురియా-కతిహార్-కుమేద్ పూర్ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడం; బరౌని-బచ్వారా 3, 4 వ లైన్ల ప్రాజెక్టు, కతిహార్-జోగ్బానీ రైలు విభాగం విద్యుదీకరణ మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి. ఈ ప్రాంతం సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దారితీస్తాయి. దానాపూర్ - జోగ్బానీ ఎక్స్ప్రెస్ (దర్భంగా - సక్రీ మీదుగా) జోగ్బానీ - సహర్సా ఎక్స్ప్రెస్; సోన్పూర్-వైశాలి ఎక్స్ప్రెస్; జోగ్బాని - సిలిగురి ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.

దేశంలో పశుసంపదకు సంబంధించిన డిజిటల్ డేటాబేస్ 'భారత్ పశుధన్'ను ప్రధాని జాతికి అంకితం చేశారు. నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ (ఎన్డీఎల్ఎం) కింద అభివృద్ధి చేసిన 'భారత్ పశుధన్' ప్రతి పశువుకు కేటాయించిన 12 అంకెల ట్యాగ్ ఐడీని ఉపయోగిస్తుంది. ఈ పథకం కింద 30.5 కోట్ల గోవులకు గాను ఇప్పటికే 29.6 కోట్ల పశువులను ట్యాగ్ చేసి వాటి వివరాలు డేటాబేస్ లో అందుబాటులో ఉంచారు. 'భారత్ పశుధన్' గోవులకు ట్రేసబిలిటీ వ్యవస్థను అందించడం ద్వారా రైతులకు సాధికారత కల్పిస్తుంది. వ్యాధి పర్యవేక్షణ, నియంత్రణకు సహాయపడుతుంది.

'భారత్ పశుధన్' డేటాబేస్ కింద ఉన్న మొత్తం డేటా, సమాచారాన్ని నమోదు చేసే '1962 ఫార్మర్స్ యాప్' ను కూడా ప్రధాని ఆవిష్కరించారు.

 

****

 


(Release ID: 2011444) Visitor Counter : 94