గనుల మంత్రిత్వ శాఖ

‘‘ గనులు, ఖనిజ రంగంలో ఆవిష్కరణలకు చేదోడుగా నిలిచేందుకు ఐదు అంకుర సంస్థలకు ఆర్థిక సహాయానికి సంబంధించిన లేఖలు అందజేసిన కేంద్ర గనుల శాఖ మంత్రి శ్రీ ప్లహ్లాద్‌ జోషి.

Posted On: 01 MAR 2024 12:52PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వశాఖ, పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులకు (ఆర్‌అండ్‌ డి) 1978 నుంచి ఎన్నో పరిశోధన సంస్థలకు, ఈ రంగంలో పరిశోధనలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆర్థిక సహాయం అందజేస్తూ వస్తోంది.  ఈరంగంలో భద్రత, ఆర్థికత, వేగం, సామర్ధ్యానికి సంబంధించి   శాస్త్ర విజ్ఞాన కార్యక్రమం (ఎస్‌ అండ్‌ టి) కింద నిధులు అందజేస్తోంది.
ఇటీవల కేంద గనుల శాఖ శాస్త్ర విజ్ఞాన కార్యక్రమాన్ని మరింత విస్తరింప చేసింది. 2023 నవంబర్‌ లో ఎస్‌అండ్‌ టి`పిఆర్‌ఐఎస్‌ఎం కార్యక్రమాన్ని కేంద్ర గనుల మంత్రిత్వశాఖ ప్రారంభించింది. స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఇలు , ఈ రంగంలో పనిచేస్తున్న సంస్థల విషయంలో పరిశోధన అభివృద్ధి, వాణిజ్యస్థాయికి తీసుకువెళ్లేందుకు వాటి మధ్యగల అంతరాన్ని తొలగించి మైనింగ్‌, మినరల్‌ రంగంలో పూర్తి వాల్యూ చెయిన్‌కు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆర్థిక సహాయం కోసం ఎంఎస్‌ఎంఇలు, స్టార్టప్‌లు 56 వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనగా అందులో 5 సంస్థలను ఆర్థిక సహాయానికి ఎంపిక చేశారు. ఈ ఆర్థిక సహాయం విలువ సుమారు 6 కోట్ల రూపాయలవరకు ఉంటుంది.అవి సాధించిన విజయాల ఆధారంగా ఈ మొత్తాన్ని అందజేస్తారు. ఆర్థిక సహాయంతోపాటు ఎంపిక చేసిన ఎం.ఎస్‌.ఎం.ఇలు, స్టార్టప్‌లకు మెంటార్‌షిప్‌ లేదా ఇంక్యుబేషన్‌ మద్దతు, సాంకేతిక సలహాను ప్రాజెక్టు అమలు కాలంలో అందజేస్తారు. ఇందుకు ఫెసిలిటేషన్‌ , మెంటార్‌షిప్‌ టీమ్‌ , అమలు ఏజెన్సీ కింద పనిచేస్తుంది.
నాగపూర్‌లోని,జవహర్‌ లాల్‌ నెహ్రూ అల్యూమినియం రిసెర్చ్‌ డవలప్‌మెంట్‌, డిజైన్‌ సెంటర్‌్‌ ఒక స్వతంత్ర సంస్థ. దీనిపాలనాపరమైన నియంత్రణ కేంద్ర గనుల శాఖ అధీనంలో ఉంటుంది. శాస్త్ర సాంకేతిక`ప్రిసమ్‌ కార్యక్రమ అమలు ఏజెన్సీగా దీనిని నిర్ణయించారు.
ఐదు స్టార్టప్‌ సంస్థలు ఒక ఎం.ఎస్‌.ఎం.ఇకి గ్రాంటు మంజూరుకు సంబంధించిన లేఖలను కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి 2024 ఫిబ్రవరి 29న అందజేశారు. ఈ ఐదు స్టార్టప్‌లు, ఒక ఎం.ఎస్‌.ఎం.ఇ కి సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
1. మెస్సర్స్‌ అశ్విని రేర్‌ ఎర్త్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పూణె, మహారాష్ట్ర. ఈ సంస్థకు పైలట్‌ప్రాజెక్టు కింద నియోడైమియం, ప్రెసోడైమియం ఖనిజాన్ని నియోడైమియం` ప్రెసోడైమియంన ఆక్సైడ్‌నుంచి కాల్సియో`థర్మెక్‌ తగ్గింపు మార్గంలో ఎన్‌.డి.ఎఫ్‌ఇబి బేస్‌ పర్మినెంట్‌ మాగ్నట్‌ అప్లికేషన్‌ద్వారా వెలికీతసేందుకు దీనిని మంజూరు చేశారు.
2.మెస్సర్స్‌ సారు స్మెల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మీరట్‌, ఉత్తరప్రదేశ్‌. ఈ సంస్థకు రూ 1.16 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. లిథియం అయాన్‌  ఎలక్ట్రో ఫ్యుసన్‌రియాక్టర్‌ ను ఆల్కలీ మెటల్స్‌ పైలట్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు దీనిని మంజూరు చేశారు.

3. మెస్సర్స్‌ ఎల్‌.ఎన్‌.ఇండ్‌ టెక్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, భువనేశ్వర్‌. ఒడిషా. ఈసంస్థకు 0.40 కోట్ల రూపాయలు మంజూరు చేశృారు. సోడియం కార్పొనేట్‌ ఎలక్ట్రాలసిస్‌ద్వారా సమర్ధమైన నిరంతరాయ అల్యూమినియం హైడ్రేట్‌ ఉత్పత్తికి , హైడ్రోజన్‌ఉత్పత్తికి ఈ మొత్తాన్ని మంజూరు చేశారు.
4. మెస్సర్స్‌ సెల్లార్క్‌ పవర్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కటక్‌, ఒరిస్సా వారికి రూ 1.7 కోట్లరూపాయలు మంజూరుచేశారు. లిథియం` అయాన్‌ బ్యాటరీ అనోడ్‌ కు , రోజుకు 25 కేజీల అత్యున్నత శుద్ధితో కూడిన బ్యాటరీ గ్రేడ్‌ సిలికాన్‌ మెటీరియల్‌ ఉత్పత్తికి  ఈ మొత్తాన్ని మంజూరు చేశారు.
5. మెస్సర్స్‌ కాలిచెప్రైవేట్‌ లిమిటెడ్‌, షిల్లాంగ్‌, మేఘాలయ వారికి 1.2 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అరుదైన భూమి మూలకాల అణ్వేషణకు సంబంధించిన సాఫ్ట్‌వేఱ్‌ గర్భ్‌ అభివృద్ధికి ఈ నిధులు మంజూరు చేశారు.
కేంద్ర గనుల శాఖ , తదుపరి రౌండ్‌ ఎస్‌అండ్‌ టి ప్రిజమ్‌కు సంబంధిచి ప్రతిపాదనలను 2024 మార్చి 1 నుంచి స్వీకరిస్తుంది. ప్రతిపాదనలు సమర్పించడానికి చివరి తేదీ 2024 ఏప్రిల్‌ 30

 

***



(Release ID: 2010889) Visitor Counter : 63