భారత ఎన్నికల సంఘం

బ్యాంకులు, పోస్టాఫీసుల సహకారంతో 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఓటర్లను చైతన్యవంతులను చేయడానికి కార్యక్రమం అమలు చేయనున్న కేంద్ర ఎన్నికల సంఘం


దేశవ్యాప్తంగా 1.6 లక్షల బ్యాంకు శాఖలు, 2 లక్షలకు పైగా ఏటీఎంలు, 1.55 లక్షల పోస్టాఫీసుల ద్వారా ప్రజలకు చేరనున్న ఎన్నికల సంఘం ప్రచారం

Posted On: 26 FEB 2024 2:21PM by PIB Hyderabad

రానున్న 2024  లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను చైతన్యవంతులను చేయడానికి  రూపొందించిన ప్రచార కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు రెండు ప్రముఖ సంస్థలు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) , డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (తపాలా శాఖ )తో అవగాహన ఒప్పందం పై సంతకం చేసింది.బ్యాంకులు, పోస్టాఫీసుల సహకారంతో  ఇటువంటి కార్యక్రమాన్ని  ఎన్నికల సంఘం అమలు చేయడం ఇదే తొలిసారి. 

 2024 లోక్‌సభకు జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని  చాటైన్య వంతులను చేయడానికి  కేంద్ర ఎన్నికల సంఘం కార్యక్రమాలు అమలు చేస్తోంది.  ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల విద్యా పాఠ్యాంశాలలో ఎన్నికల అక్షరాస్యతను అధికారికంగా చేర్చడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విద్యా మంత్రిత్వ శాఖ తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.  ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ శ్రీ అరుణ్ గోయెల్ సమక్షంలో బ్యాంకులు, పోస్టాఫీసులతో కుదిరిన అవగాహన ఒప్పందంపై  ఈరోజు సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తపాలా శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ మెహతా, ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ష్ వినీత్ పాండే, తపాలా శాఖ, ఐబీఏ, ఈసీఐ అధికారులు పాల్గొన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘంతో కుదిరిన అవగాహన ఒప్పందం కింద ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) , డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (తపాలా శాఖ) తమ అనుబంధ సంస్థలు/ యూనిట్ ద్వారా ఓటర్ల అవగాహన కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పిస్తాయి. తమ విస్తృతమైన నెట్‌వర్క్ ద్వారా ఓటర్లను చైతైన్యవంతులను చేయడానికి రూపొందించిన కార్యక్రమానికి సహకారం అందిస్తాయి.   ఎన్నికల హక్కులు, ప్రక్రియల గురించి అవగాహన కల్పించడానికి వివిధ జోక్యాలను ఉపయోగిస్తుంది. మరియు నమోదు, ఓటు హక్కు వినియోగించుకునే అంశాలపై ప్రచార కార్యక్రమాలు అమలు జరుగుతాయి. 

ఒప్పందం ముఖ్యాంశాలు:

* సభ్యులు, అనుబంధ సంస్థలు/యూనిట్‌లు తమ వెబ్‌సైట్‌లలో ఓటరు విద్యా సందేశాలను ప్రముఖంగా ప్రదర్శిస్తాయి, ఎన్నికల ప్రక్రియ గురించి మరింత తెలుసుకోవడానికి సందర్శకులకు అవకాశం కల్పిస్తాయి. 

* సోషల్ మీడియా,సభ్య సంస్థల కస్టమర్ ఔట్రీచ్ ప్లాట్‌ఫారమ్‌ల వంటి వివిధ ప్రచార మార్గాల ద్వారా ఓటరు విద్య కార్యక్రమాలు ప్రసారం చేస్తారు.ఖాతాదారులు, ప్రజలలో విస్తృతమైన అవగాహన కల్పించడానికి చర్యలు అమలు జరుగుతాయి. 

*ఓటర్లను చైతన్యవంతులను చేయడానికి రూపొందించిన  సందేశాలను  పోస్టర్లు, ఫ్లెక్స్ , హోర్డింగ్‌ల రూపంలో ప్రధాన ప్రదేశాలలో కార్యాలయ మౌలిక సదుపాయాలు/ప్రాంగణంలో ప్రదర్శిస్తారు. ఖాతాదారులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తారు. 

*బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా  ఓటరు విద్యకు సంబంధించిన చర్చలు, కార్యక్రమాలలో ఉద్యోగులు, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనే విధంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. 

* బ్యాంకులు, పోస్టాఫిసుల సిబ్బందికి  రెగ్యులర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లలో SVEEPపై శిక్షణ మాడ్యూల్ నిర్వహిస్తారు. 

* పోస్టల్ వస్తువులపై  తపాలా శాఖ ప్రత్యేక క్యాన్సిలేషన్ స్టాంప్ (ఓటర్ ఎడ్యుకేషన్ సందేశాలు) అతికిస్తుంది.

 నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది.దీనివల్ల ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే,   దాదాపు 30 కోట్ల మంది ఓటర్లు (91 కోట్ల మందిలో) తమ ఓటు హక్కును వినియోగించు కోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2019 లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలలో  ఓటింగ్ శాతం 67.4%గా నమోదయింది.  దీనిని మరింత మెరుగు పరచాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, తపాలా శాఖతో కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల ప్రజలకు  ఎన్నికల హక్కులు , బాధ్యతలపై మరింత అవగాహన కలుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న కృషికి  రెండు సంస్థలు పూర్తి సహకారం అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. 

నేపథ్యం: 

1946 సెప్టెంబర్ 26న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్  ఏర్పడింది.  22 మంది సభ్యులతో ప్రారంభమైన సంఘంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 247 మంది సభ్యులు ఉన్నారు. దేశంలో  బలమైన నెట్‌వర్క్‌ను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కలిగి ఉంది.  90,000కు పైగా  శాఖలు, 1.36 లక్షల ఏటీఎం లతో ప్రభుత్వ రంగ బ్యాంకులు అసోసియేషన్ లో కీలకంగా ఉన్నాయి.   79,000కి పైగా  ఏటీఎంలు, 40,000 పైగా ఉన్న   ప్రైవేటు రంగ బ్యాంకులు సభ్యత్వం కలిగి ఉన్నాయి. 22,400 కు పగిగా శాఖలు ఉన్న . ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, దాదాపు 7,000 శాఖలు, 1,158  ఏటీఎం లు నిర్వహిస్తున్న చిన్న ఫైనాన్స్, చెల్లింపు బ్యాంకులు . విదేశీ బ్యాంకులు 840 శాఖలు, 1,158  ఏటీఎం లను, స్థానిక ప్రాంత బ్యాంకులు 81 శాఖలు సంఘంలో సభ్త్వం  కలిగి ఉన్నాయి. మొత్తం మీద దేశవ్యాప్తంగా  1.63 లక్షల శాఖలు, .2.19 లక్షలకు పైగా ఏటీఎంలు ఉన్నాయి. 

 

150 సంవత్సరాలకు పైగా సేవలు అందిస్తున్న తపాలా శాఖ దేశ  కమ్యూనికేషన్‌ రంగానికి వెన్నెముకగా ఉంది.  దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. 1,55,000 కంటే ఎక్కువ పోస్టాఫీసులు నిర్వహిస్తున్న తపాలా శాఖ  ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా పని చేస్తున్న  పోస్టల్ వ్యవస్థ ను కలిగి ఉంది.

 

***



(Release ID: 2009163) Visitor Counter : 199