సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
రేపు ‘పర్పుల్ ఫెస్ట్’ను ప్రారంభించనున్న రాష్ట్రపతి
Posted On:
25 FEB 2024 10:22AM by PIB Hyderabad
2024 జనవరి 8 నుండి 13 వరకు గోవాలో జరిగిన 'ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్, 2024' విజయవంతం అయిన తర్వాత, సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వికలాంగుల సాధికారత విభాగం రాష్ట్రపతి భవన్‌లో ఉద్యానవనం అమృత్‌లో రోజంతా 26 ఫిబ్రవరి, 2024న 'పర్పుల్ ఫెస్ట్'ని ఉల్లాసభరితం గా నిర్వహిస్తోంది.
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పర్పుల్ ఫెస్ట్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయం & సాధికారత మంత్రులు మరియు సెక్రటరీ, డీ ఈ పి డబ్ల్యూ డీ హాజరవుతారు. 10 వేల మందికి పైగా దివ్యాంగులు, వారి సహాయకులతో ఈ వేదిక వద్ద కలుస్తారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ ఈ ఫెస్ట్‌కు నోడల్ ఏజెన్సీ.
‘పర్పుల్ ఫెస్ట్’లో అందుబాటు, సమ్మిళితం మరియు వికలాంగుల హక్కు ల కోసం పనిచేస్తున్న సంస్థల ఇంటరాక్టివ్ స్టాల్స్ ఉంటాయి. అమృత్ ఉద్యాన్ సందర్శన, మీ వైకల్యాలను తెలుసుకోవడం, పర్పుల్ కేఫ్, పర్పుల్ కాలిడోస్కోప్, పర్పుల్ లైవ్ ఎక్స్‌పీరియన్స్ జోన్, పర్పుల్ స్పోర్ట్స్ మొదలైనవి ‘పర్పుల్ ఫెస్ట్’లో ముఖ్య కార్యకలాపాలు.
ఉత్సవాలకు అతీతంగా సందర్శకులు రాష్ట్రపతి భవన్ మ్యూజియం అన్వేషణ యాత్ర ద్వారా వారి మనస్సులను సుసంపన్నం చేసుకుంటూ కలుపుకుపోవాలనే తత్వాన్ని స్వీకరించే విధంగా కూడా ఆహ్వానించబడ్డారు.
ఈ ఫెస్ట్ ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలు మరియు అంతర్దృష్టులను మరింత సమ్మిళితం గా మరియు అందుబాటులో ఉండే సమాజాన్ని క్యూరేట్ చేయడానికి ఒక వేదిక. వివిధ వైకల్యాలు మరియు ప్రజల జీవనంపై వాటి ప్రభావం గురించి అవగాహన పెంచడం మరియు వైకల్యాల చుట్టూ తిరుగుతున్న దురభిప్రాయాలు, కళంకం మరియు మూస పద్ధతులను సవాలు చేయడం మరియు వికలాంగులను సమాజంలో అవగాహన, అంగీకారం మరియు సమ్మిళితం ప్రోత్సహించడం ఈ ఫెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
***
(Release ID: 2009027)
Visitor Counter : 116