గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

డిసెంబర్ 2023 మాసంలో దేశంలో 5.1% మేర పెరిగిన ఖనిజ ఉత్పత్తి


- ముఖ్య ఖనిజాలు ఉత్పత్తిలో సానుకూల వృద్ధి

Posted On: 22 FEB 2024 2:06PM by PIB Hyderabad

డిసెంబర్, 2023 (ఆధారం: 2011-12=100)లో మైనింగ్ మరియు క్వారీ రంగం యొక్క ఖనిజ ఉత్పత్తి సూచి 139.4 వద్ద నిలిచింది.  డిసెంబర్, 2022 నెల స్థాయితో పోలిస్తే ఇది 5.1 శాతం మేర అధికం. ఏప్రిల్-డిసెంబర్, 2023-24 మధ్య కాలానికి సంచిత వృద్ధి అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 8.5 శాతం పెరిగింది.  డిసెంబర్, 2023లో ముఖ్యమైన ఖనిజాల ఉత్పత్తి స్థాయి: బొగ్గు 929 లక్షల టన్నులు, లిగ్నైట్ 40 లక్షలు, పెట్రోలియం (ముడి చమురు) 25 లక్షలు, ఇనుప ఖనిజం 255 లక్షలు, సున్నపురాయి ఒక్కొక్కటి 372 లక్షల టన్నులు, సహజ వాయువు (ఉపయోగించబడింది) 3078 మిలియన్ కమ్., బాక్సైట్ 2429 వేల , క్రోమైట్ 235 వేలు, కాపర్ కాంక్ 11 వేలు, లీడ్ కాంక్ 35 వేలు, మాంగనీస్ ధాతువు 319 వేలు, జింక్ కాంక్, 148 వేలు, ఫాస్ఫోరైట్ 117 వేలు, మాగ్నసైట్ ఒక్కొక్కటి 16 వేల టన్నులు, బంగారం 122 కిలోల మేర ఉత్పత్తి చేయడమైంది. డిసెంబర్ 2022తో పోలిస్తే  2023 డిసెంబరులో సానుకూల వృద్ధిని చూపిన  ముఖ్యమైన ఖనిజాలు: మాగ్నసైట్ (83.7%), లీడ్ కాంక్.(16.5%), లిగ్నైట్ (14.6%), కాపర్ కాంక్(13.7%), సున్నపురాయి(12.5%), బొగ్గు (10.8%), జింక్ కాంక్.(7.8%), బాక్సైట్ (6.6%), సహజ వాయువు (U) (6.6%), మాంగనీస్ ఓర్ (4.0%) మరియు ఇనుప ఖనిజం (1.3%), మరియు ఇతర ముఖ్యమైన ఖనిజాలు ప్రతికూల వృద్ధిని చూపుతున్నాయి. వీటిలో: పెట్రోలియం(ముడి) (-1.0%),  బంగారం (-29.9%), క్రోమైట్ (-30.8%), ఫాస్ఫోరైట్ (-31.2%) మరియు డైమండ్ (-74.4%) తదితరాలు ఉన్నాయి. 

***



(Release ID: 2008240) Visitor Counter : 94