బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు ఆధారిత సమాజాల ప్రయోజనం కోసం ప్రకృతికి సాధికారత, వృద్ధిని పెంపొందించడం, సుస్థిర హరిత చొరవల ద్వారా బొగ్గు రంగ ముఖచిత్రాన్ని మారుస్తుంది
Posted On:
22 FEB 2024 12:48PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వం మరియు పర్యవేక్షణలో బొగ్గు/లిగ్నైట్ పీ ఎస్ యూ లు దేశం యొక్క పెరుగుతున్న ఇంధన డిమాండ్‌లను తీర్చడానికి కాలక్రమేణా తమ ఉత్పత్తి స్థాయిలను పెంచుకోవడమే కాకుండా అనేక రకాల ఉపశమన మరియు సుస్థిరమైన చర్యలను అమలు చేయడం ద్వారా స్థానిక పర్యావరణానికి తమ నిబద్ధతను ప్రదర్శించాయి. సుస్థిర హరితీకరణ చొరవలో భాగంగా బొగ్గు/లిగ్నైట్ పీ ఎస్ యూ ల ద్వారా ఓవర్‌బర్డెన్ (ఓ బీ) డంప్‌లు, హాల్ రోడ్లు, గని పరిసరాలు, రెసిడెన్షియల్ కాలనీలు మరియు లీజు ప్రాంతం వెలుపల స్థానిక ప్రజలతో విస్తృతమైన చెట్లు నాటే కార్యక్రమాలు అందుబాటులో ఉన్న భూమితో సహా వివిధ ప్రదేశాలలో చేపట్టబడ్డాయి. శాస్త్రీయ సంస్థల సహకారంతో తోటల పెంపకం ప్రయత్నాలకు నైపుణ్యంతో మద్దతునిస్తాయి. పర్యావరణ పునరుద్ధరణ స్థలాల అభివృద్ధికి మరియు బహుళ-స్థాయి ప్లాంటేషన్ పథకాల అమలును సులభతరం చేస్తాయి.
మొక్కల పెంపకం కార్యక్రమం వైవిధ్యమైన విధానాన్ని అవలంబిస్తుంది, నీడనిచ్చే చెట్లు, అటవీ ప్రయోజనాల కోసం జాతులు, ఔషధ మరియు మూలికా మొక్కలు, ఫలాలను ఇచ్చే చెట్లు, కలప చెట్లు మరియు అలంకారమైన/రహదారులకు ఇరువైపులా మొక్కలు ఉన్నాయి. ఔషధ మొక్కలతో పాటు పండ్ల జాతులు జీవవైవిధ్య పరిరక్షణకు దోహదపడటమే కాకుండా స్థానిక సమాజాలకు అదనపు సామాజిక-ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి. జామున్, ఇమ్లీ, గంగా ఇమ్లీ, బెల్, మామిడి, సీతాఫల్ మొదలైన పండ్ల జాతులు, వేప, కరంజ్, అయోన్లా (ఉసిరి), అర్జున్ మొదలైన ఔషధ/మూలికా మొక్కలు, సాల్, టేకు, శివన్ వంటి కలప చెట్లు, ఘమర్, సిస్సూ, కాలా సిరస్, సఫేద్ సిరస్, వెదురు, పెల్టోఫోరమ్, బబూల్, మొదలైనవి, అలంకారమైన / గుల్మోహర్, కచ్నార్, అమల్టాస్, పీపాల్, ఝరుల్ వంటి అలంకారమైన / అవెన్యూ మొక్కలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా వీటికి రాష్ట్ర అటవీ శాఖలు మరియు కార్పొరేషన్‌లతో సన్నిహిత సహకారం ఉంటుంది. తోటల పెంపకం కోసం సరిపోయే ఉత్తమ జాతులు ఎంపిక చేయబడతాయి. హరిత పునరుద్ధరణ ప్రయత్నాల విజయం సుస్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది.
గత ఐదేళ్లలో ( ఎఫ్ వై 2019-20 నుండి ఎఫ్ వై 2023-24 జనవరి వరకు), బొగ్గు/లిగ్నైట్ పీ ఎస్ యూ లు 10,784 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 235 లక్షల మొక్కలను నాటాయి, తద్వారా కార్బన్ సింక్ గణనీయంగా పెరిగింది. హరిత పునరుద్ధరణ పనితీరును పర్యవేక్షించడానికి, బొగ్గు/లిగ్నైట్ పీ ఎస్ యూ లు ఉపగ్రహ నిఘాను ఉపయోగిస్తాయి.
ఎఫ్ వై 2019-20 నుండి బొగ్గు/లిగ్నైట్ పీ ఎస్ యూ ల ద్వారా ప్లాంటేషన్
ఇటీవల, బొగ్గు/లిగ్నైట్ పీ ఎస్ యూ లు దాని అనువైన కమాండ్ ఏరియాలలో మియావాకీ ప్లాంటేషన్ పద్ధతిని అవలంబించాయి. మియావాకీ సాంకేతికత అటవీ పెంపకం మరియు పర్యావరణ పునరుద్ధరణకు ఒక విలక్షణమైన విధానం, దీనిని జపాన్ వృక్షశాస్త్రజ్ఞుడు డా. అకిరా మియావాకీ ప్రారంభించారు. పరిమిత ప్రాంతంలో హరితను పెంచడం దీని ప్రాథమిక లక్ష్యం. ఈ వినూత్న పద్ధతి కేవలం 10 సంవత్సరాలలో దట్టమైన అడవిని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఈ ప్రక్రియకు సాధారణంగా ఒక శతాబ్దం అవసరం. వేగవంతమైన వృద్ధిని ప్రదర్శించే మరియు స్థానిక అడవులలో కనిపించే సహజ జీవవైవిధ్యాన్ని ప్రతిబింబించే బహుళ-దొంతరల అడవులను పెంపొందించడం ఇందులో ఉంటుంది. మియావాకీ పద్ధతిని అమలు చేయడం ద్వారా చదరపు మీటరుకు రెండు నుండి నాలుగు రకాల దేశీయ చెట్లను నాటాలి. ముఖ్యంగా, ఎంచుకున్న వృక్ష జాతులు ఎక్కువగా స్వీయప్రగతి ని కలిగి ఉంటాయి. ఫలదీకరణం మరియు నీరు వంటి సాధారణ నిర్వహణ అవసరాన్ని తొలగిస్తాయి. ఈ పద్ధతిలో, చెట్లు స్వయం-సుస్థిరత్వాన్ని సాధిస్తాయి, మూడు సంవత్సరాల వ్యవధిలో వాటి పూర్తి ఎత్తును చేరుకుంటాయి. మొక్కల మధ్య ఒకదానికొకటి పరస్పర ఆధారపడటం పెరుగుదలకు మద్దతు ఇస్తుంది, ఇది మొత్తం వృక్ష ఆరోగ్యం మరియు శక్తిని ప్రోత్సహిస్తుంది. ఫలితంగా, చెట్లు సంప్రదాయ పద్ధతుల కంటే చాలా వేగంగా వృద్ధి రేటును ప్రదర్శిస్తాయి మరియు అధిక కార్బన్ సింక్‌ను సృష్టించేందుకు దోహదం చేస్తాయి.
సుందర్‌గఢ్ పరిధిలోని సుబలయ గ్రామంలో ఎం సీ ఎల్ కుల్దా ఓ సీ పీ లో ఎం సీ ఎల్ మియావాకీ పద్ధతిని అవలంబించింది. డీ ఎఫ్ ఓ , సుందర్‌ఘర్ హెక్టారుకు 8000 మొక్కల సాంద్రతతో 10 హెక్టార్లలో 2 విభాగాలుగా లో మియావాకి ప్లాంటేషన్ సాంకేతికతను చేపట్టారు. కుల్దా ఓ సీ పీ లోని మియావాకీ అడవుల్లో నాటిన జాతులు అర్జున్, అసన్, ఫాసి, సాల్, బీజా, కరంజ్, ధౌదా, గంహర్, మహోగని, అశోక్, పాటలీ, ఛతియన్, ధురంజ్, హర్రా, బహెరా, ఆమ్లా, జామ, మామిడి, జాక్‌ఫ్రూట్ మొదలైనవి ఉన్నాయి. ఇంకా బొగ్గు/లిగ్నైట్ పీ ఎస్ యూ లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు గనులలో మరియు చుట్టుపక్కల ఉన్న సుమారు 15 హెక్టార్లలో మియావాకీ ప్లాంటేషన్ నాటారు.
ఎం సీ ఎల్ లో మియావాకి ప్లాంటేషన్
ప్లాంటేషన్ కార్యక్రమాలు మైనింగ్ కార్యకలాపాల యొక్క పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా జీవవైవిధ్య పునరుద్ధరణ, పర్యావరణ వ్యవస్థ సేవలను మెరుగుపరచడం, కార్బన్ సింక్‌లను సృష్టించడం, స్థానిక సమాజాలకు జీవనోపాధి అవకాశాలను అందించడం మరియు సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో కూడా దోహదపడతాయి. శాస్త్రీయ నైపుణ్యం, ప్రజల భాగస్వామ్యం మరియు మియావాకీ ప్లాంటేషన్ వంటి వినూత్న పద్ధతులను ఉపయోగించడం ద్వారా బొగ్గు/లిగ్నైట్ పిఎస్‌యు భవిష్యత్ తరాలకు పచ్చని నిలకడైన ప్రకృతి వారసత్వాన్ని సృష్టిస్తున్నాయి.
****
(Release ID: 2008075)
Visitor Counter : 98