మంత్రిమండలి
azadi ka amrit mahotsav

‘మహిళల భద్రత’ అనే అంశం పై ఒక సమగ్రపథకాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదన కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 21 FEB 2024 10:30PM by PIB Hyderabad

మహిళల యొక్క సురక్షఅంశం లో ఒక సమగ్ర పథకాన్ని 2021-22 నుండి 2025-26 మధ్య కాలం లో మొత్తం 1179.72 కోట్ల రూపాయల ఖర్చు తో అమలు చేయడాన్ని కొనసాగించాలంటూ దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్ హెచ్ ఎ) చేసిన ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది.

 

మొత్తం 1179.72 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయం లో నుండి, 885.49 కోట్ల రూపాయల ను దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సొంత బడ్జెటు నుండి సమకూర్చనుండగా మిగిలిన 294.23 కోట్ల రూపాయల ను నిర్భయ నిధి నుండి సమకూర్చడం జరుగుతుంది.

 

ఏదైనా దేశం లో మహిళల కు భద్రతఅనేది అనేక కారకాల ఫలితం గా సిద్ధిస్తుంది; ఆయా కారకాల లో కఠినమైన చట్టాల ద్వారా కఠోరమైన నివారక చర్యలు, ప్రభావ వంతమైన రీతి న న్యాయాన్ని అందించడం, ఫిర్యాదుల ను సకాలం లో పరిష్కరించడం మరియు బాధితుల కోసం సులభమైన సంస్థాగత సమర్థన యంత్రాంగాల ను నెలకొల్పడం వంటివి భాగం గా ఉంటాయి. ఇండియన్ పీనల్ కోడ్ లో, క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ లో మరియు భారతీయ సాక్ష్య చట్టం లో సవరణల ను చేయడం ద్వారా మహిళల కు వ్యతిరేకం గా చోటు చేసుకొనే అపరాదాల కు సంబంధించిన వ్యవహారాల లో కఠినతరమైన నివారక వ్యవస్థ ను సమకూర్చడం జరిగింది.

 

మహిళల కు భద్రత దిశ లో భారతదేశం ప్రభుత్వం రాష్ట్రాల మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సహకారం తో అనేక ప్రాజెక్టుల ను మొదలు పెట్టింది. ఈ ప్రాజెక్టుల యొక్క ఉద్దేశ్యాల లో, మహిళల కు వ్యతిరేకం గా అపరాధం జరిగిన పక్షం లో సకాలం లో జోక్యం చేసుకోవడం, పరిశోధన కు పూచీ పడడం మరియు ఈ విధమైన వ్యవహారాల లో దర్యాప్తు, ఇంకా అపరాధాల నిరోధం లో ఉన్నత స్థాయి దక్షత కు పూచీ పడడం కోసం రాష్ట్రాల లోను/ కేంద్ర పాలిత ప్రాంతాల లోను యంత్రాంగాన్ని బలోపేతం చేయడం వంటివి భాగాలు గా ఉన్నాయి.

 

‘‘మహిళల కు భద్రత’’ కల్పించడం కోసం ఉద్దేశించిన సమగ్ర పథకం లో భాగం గా ఈ క్రింది ప్రాజెక్టుల ను అమలు చేయడాన్ని కొనసాగించాలని భారతదేశం ప్రభుత్వం ప్రతిపాదించింది:

 

  1. 112 అత్యవసర ప్రతిస్పందన సహాయక వ్యవస్థ (ఇఆర్ఎస్ఎస్) 2.0;
  2. నేశనల్ ఫరెన్సిక్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడం సహా సెంట్రల్ ఫరెన్సిక్ సైన్సెస్ లబారటరిస్ ను ఉన్నతీకరించడం;
  3. రాష్ట్రాల లోని ఫరెన్సిక్ సైన్స్ లబారటరిస్ (ఎప్ఎస్ఎల్ స్) లో డిఎన్ఎ విశ్లేషణ ను, సైబర్ ఫరెన్సిక్ సంబంధి సామర్థ్యాల ను బలపరచడం;
  4. మహిళల కు మరియు బాలల కు వ్యతిరేకం గా సైబర్ మాధ్యం పరం గా అపరాధాలు జరుగకుండా అడ్డుకోవడం;
  5. మహిళల కు మరియు బాలల కు వ్యతిరేకం గా జరిగే లైంగిక దౌర్జన్యాల ను ఎదుర్కోవడం కోసం దర్యాప్తు అధికారులు మరియు విచారణ కర్తల సామర్థ్యాన్ని పెంపొందింప చేయడం, వారికి అవసరమైనటువంటి శిక్షణ ను ఇవ్వడం ; మరియు
  6. విమెన్ హెల్ప్ డెస్క్ ఎండ్ ఏంటి-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్టులను ఏర్పాటు చేయడం.

 

 

 

***

 


(Release ID: 2008021) Visitor Counter : 199