ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అమలు చేయనున్న కార్యక్రమం ( జిఐడిహెచ్ ) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
గత ఏడాది గాంధీనగర్ లో జరిగిన జీ-20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో జిఐడిహెచ్ ను ప్రారంభించిన డబ్ల్యూహెచ్ఓ, భారత ప్రభుత్వం
డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించిన జిఐడిహెచ్ నిదర్శనం: డాక్టర్ మాండవీయ
' ప్రపంచ దేశాల ముఖ్యంగా దక్షిణాది దేశాల ఆరోగ్య వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు రావడంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ కీలకంగా ఉంటుంది"
Posted On:
21 FEB 2024 4:41PM by PIB Hyderabad
డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అమలు చేయనున్న కార్యక్రమం ( జిఐడిహెచ్) ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు.
ప్రపంచవ్యాప్తంగా జిఐడిహెచ్ వ్యవస్థను డబ్ల్యూహెచ్ఓ నిర్వహిస్తుంది. భారతదేశం అధ్యక్షతన గాంధీనగర్ లో 2023 ఆగస్టు 19 న జరిగిన జీ-20 దేశాల ఆరోగ్య శాఖల మంత్రుల సమావేశంలో భారతదేశం జిఐడిహెచ్ ను ప్రతిపాదించింది. భారతదేశం ప్రతిపాదనను అన్ని జీ-20 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి.జిఐడిహెచ్ అమలుకు అన్ని దేశాలు, అన్ని అంతర్జాతీయ సంస్థలు సహకారం అందించాలని జీ-20 సమావేశం కోరింది. జిఐడిహెచ్ ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన డాక్టర్ మాండవీయ " డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ నిర్మాణానికి భారతదేశం చేస్తున్న కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.జిఐడిహెచ్ ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంలో భారతదేశం చేస్తున్న కృషిని గుర్తించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో జిఐడిహెచ్ అమలు జరగాలని తీర్మానించింది." అని అన్నారు.
' ప్రపంచ దేశాల ముఖ్యంగా దక్షిణాది దేశాల ఆరోగ్య వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు రావడంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ కీలకంగా ఉంటుంది. జిఐడిహెచ్ విజయవంతంగా అమలు జరగడానికి దేశాల మధ్య సహకారం అవసరం." అని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు. ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో జిఐడిహెచ్ ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆఆఆరోగ్య సంస్థ - ఆగ్నేయ ఆసియా డైరెక్టర్ కు డాక్టర్ మాండవీయ విజ్ఞప్తి చేశారు.
డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ నిర్మాణానికి భారతదేశం అమలు జరుగుతున్న కార్యక్రమాలను డాక్టర్ మాండవీయ వివరించారు. ' డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ నిర్మాణానికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం జరుగుతోంది" అని డాక్టర్ మాండవీయ తెలిపారు.
జిఐడిహెచ్ అమలుకు భారతదేశం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని డాక్టర్ మాండవీయ హామీ ఇచ్చారు. జిఐడిహెచ్ అమలు, అభివృద్ధి, సుస్థిరత కు భారతదేశం కట్టుబడి ఉందన్నారు. ప్రపంచ స్థాయిలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రయత్నాలకు సభ్య దేశాలు సహకరించాలని ఆయన కోరారు. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అందించడానికి డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ వీలు కల్పిస్తుందన్నారు.
నేపథ్యం:
2023 ఆగస్టు 19న గాంధీనగర్ లో జరిగిన జీ-20 ఆరోగ్య శాఖల మంత్రుల సమావేశంలో జిఐడిహెచ్ ని భారతదేశం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షణలో జిఐడిహెచ్ అమలు జరుగుతుంది. డిజిటల్ ఆరోగ్య రంగంలో ఇటీవల సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని 2020-2025 డిజిటల్ ఆరోగ్య లక్ష్యాలను సాధించడానికి పారదర్శకంగా,జవాబుదారీతనంతో జిఐడిహెచ్ ను అమలు చేస్తారు. ఆరోగ్య రంగంలో పెట్టుబడులు ఎక్కువ చేయడానికి జిఐడిహెచ్ కృషి చేస్తుంది. ప్రజారోగ్యం కోసం ఒక వేదికగా జిఐడిహెచ్ పనిచేస్తుంది. నిధులు, వనరుల సమీకరణ కోసం జిఐడిహెచ్ ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమాలు అమలు చేస్తుంది. ఆరోగ్య రంగంలో సంపూర్ణ మార్పులు తీసుకు రావడానికి జరుగుతున్న ప్రయత్నాలకు జిఐడిహెచ్ సహకారం అందిస్తుంది.
***
(Release ID: 2007863)
Visitor Counter : 203