వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీ సీ పీ ఏ) గ్రీన్‌వాషింగ్ నివారణ మరియు నియంత్రణ కోసం డ్రాఫ్ట్ మార్గదర్శకాలపై ప్రజల అభిప్రాయాలను కోరింది
సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీ సీ పీ ఏ) గ్రీన్‌వాషింగ్ నివారణ మరియు నియంత్రణ కోసం డ్రాఫ్ట్ మార్గదర్శకాలపై ప్రజల అభిప్రాయాలను కోరింది
అన్ని ప్రకటనలకు వర్తించేలా డ్రాఫ్ట్ మార్గదర్శకాలు. ఈ మార్గదర్శకాలు వర్తించే ఏ వ్యక్తి గ్రీన్‌వాషింగ్‌లో పాల్గొనకూడదు
తప్పుడు లేదా తప్పుదారి పట్టించే పర్యావరణ క్లెయిమ్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి మార్గదర్శకాలు
21 మార్చి, 2024 వరకు 30 రోజులలోపు మార్గదర్శకాలపై పబ్లిక్ వ్యాఖ్యలు/సూచనలను సీ సీ పీ ఏ అభ్యర్థిస్తుంది
Posted On:
20 FEB 2024 4:25PM by PIB Hyderabad
గ్రీన్‌వాషింగ్ నివారణ మరియు నియంత్రణ కోసం ముసాయిదా మార్గదర్శకాలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ప్రజల అభిప్రాయాలను కోరింది. ముసాయిదా మార్గదర్శకాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో ఉంచబడ్డాయి మరియు లింక్ ద్వారా అందుబాటులో ఉంటాయి.
ప్రజల అభిప్రాయాలు/సూచనలు/ఫీడ్‌బ్యాక్ అభ్యర్థించబడతాయి మరియు 30 రోజులలోపు (21 మార్చి 2024 వరకు) సెంట్రల్ అథారిటీకి అందించబడవచ్చు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ "గ్రీన్‌వాషింగ్"పై సంప్రదింపుల కోసం 2 నవంబర్ 2023 నాటి ఓ ఎం ప్రకారం వాటాదారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎన్ ఎల్ యూ లు, న్యాయ సంస్థలు, ప్రభుత్వం మరియు స్వచ్ఛంద వినియోగదారుల సంస్థలు (వీ సీ ఓ లు) పరిశ్రమ సంఘాలు మరియు అన్ని ప్రధాన సంస్థలకు ప్రాతినిధ్యం ఉంది.
గ్రీన్‌వాషింగ్ నివారణ మరియు నియంత్రణ కోసం ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేయడానికి మూడు కమిటీ సమావేశాలు జరిగాయి. చివరి సమావేశం 10 జనవరి 2024న జరిగింది, ఇందులో ప్రతిపాదిత మార్గదర్శకాల ముసాయిదాపై కమిటీ సభ్యులతో చర్చించారు. గ్రీన్‌వాషింగ్ నివారణ మరియు నియంత్రణ కోసం ముసాయిదా మార్గదర్శకాలు కమిటీ సభ్యులందరితో వివరణాత్మక చర్చల తర్వాత రూపొందించబడ్డాయి అవే ఇప్పుడు ప్రజల సంప్రదింపుల కోసం ఉంచబడ్డాయి. వినియోగదారుల రక్షణ చట్టం 2019లోని సెక్షన్ 18 (2) (ఎల్) ప్రకారం ప్రతిపాదిత మార్గదర్శకాలు జారీ చేయబడతాయి.
ముసాయిదా మార్గదర్శకాలు గ్రీన్‌వాషింగ్‌ను “ఏదైనా మోసపూరితమైన లేదా తప్పుదారి పట్టించే పద్ధతి లో సమాచారం ఇవ్వడం గా నిర్వచించాయి. ఇందులో హానికరమైన లక్షణాలను తగ్గించేవిధంగా లేదా దాచేలా సానుకూల పర్యావరణ అంశాలను అతిశయోక్తి చేయడం,సంబంధిత సమాచారాన్ని దాచడం, విస్మరించడం లేదా అస్పష్టమైన, తప్పుడు లేదా నిరాధారమైన పర్యావరణ క్లెయిమ్‌లు చేయడం మరియు తప్పుదారి పట్టించే పదాలు, చిహ్నాలు లేదా చిత్రాలను ఉపయోగించడం పై దృష్టి పెడుతుంది. .
మార్గదర్శకాలు అన్ని ప్రకటనలు మరియు సర్వీస్ ప్రొవైడర్, ఉత్పత్తి విక్రేత, అడ్వర్టైజర్ లేదా అడ్వర్టైజింగ్ ఏజన్సీ లేదా ఎండోర్సర్‌కి వర్తిస్తాయి. మార్గదర్శకం కూడా 'ఆకుపచ్చ', 'పర్యావరణ అనుకూలమైనది', 'పర్యావరణ స్పృహ', ' భూమి హితం', 'క్రూరత్వం లేని' వంటి అస్పష్టమైన పదాలను తగిన ప్రకటనలతో మాత్రమే ఉపయోగించాలనే నిబంధనను అందిస్తుంది.
మార్గదర్శకాలు గ్రీన్ క్లెయిమ్‌లు చేసే కంపెనీ ద్వారా చేయవలసిన వివిధ బహిర్గతాలను సూచిస్తాయి. వివిధ ప్రకటనలు:-
ఏ. ప్రకటనలు లేదా కమ్యూనికేషన్‌లలోని అన్ని పర్యావరణ క్లెయిమ్‌లు నేరుగా లేదా క్యూ ఆర్ కోడ్‌లు లేదా వెబ్ లింక్‌ల వంటి సాంకేతికత ద్వారా పూర్తిగా బహిర్గతం చేయబడిందని నిర్ధారించుకోండి.
బీ. అననుకూలమైన అంశాలను దాచిపెట్టేటప్పుడు పర్యావరణ క్లెయిమ్‌లను అనుకూలంగా హైలైట్ చేయడానికి డేటాను ఎంపిక చేసి ప్రదర్శించడం మానుకోండి.
సి. పర్యావరణ క్లెయిమ్‌ల పరిధిని స్పష్టంగా నిర్వచించండి, అవి ఉత్పత్తులు, తయారీ ప్రక్రియలు, ప్యాకేజింగ్, ఉత్పత్తి వినియోగం, పారవేయడం, సేవలు లేదా సర్వీస్ ప్రొవిజన్ ప్రాసెస్‌లకు సంబంధించినవా అని పేర్కొనండి.
డి. అన్ని పర్యావరణ క్లెయిమ్‌లు ధృవీకరించదగిన సాక్ష్యాల ద్వారా మద్దతు ఇవ్వబడతాయి.
ఇ. ఒక ఉత్పత్తి లేదా సేవను మరొక దానితో పోల్చిన తులనాత్మక పర్యావరణ దావాలు తప్పనిసరిగా ధృవీకరించదగిన మరియు సంబంధిత డేటాపై ఆధారపడి ఉండాలి.
ఎఫ్. విశ్వసనీయమైన ధృవీకరణ, విశ్వసనీయమైన శాస్త్రీయ ఆధారాలు మరియు ప్రామాణికత కోసం స్వతంత్ర మూడవ-పక్ష ధృవీకరణతో నిర్దిష్ట పర్యావరణ క్లెయిమ్‌లను ధృవీకరించండి.
ఆ లక్ష్యాలు ఎలా సాధించబడతాయో వివరించే స్పష్టమైన మరియు కార్యాచరణ ప్రణాళికలు అభివృద్ధి చేయబడినప్పుడు మాత్రమే ఆకాంక్షాత్మక లేదా భవిష్యత్ పర్యావరణ క్లెయిమ్‌లు చేయవచ్చని మార్గదర్శకాలు అందిస్తుంది.
కొత్త మార్గదర్శకాలపై మరింత సమాచారం కోసం, లింక్‌ని సందర్శించండి:
https://consumeraffairs.nic.in/sites/default/files/fileuploads/latestnews/Draft%20Guidline%20with%20approval.pdf
***
(Release ID: 2007540)
Visitor Counter : 122