నీతి ఆయోగ్
'వృద్దుల సంరక్షణ .. భారతదేశంలో మారుతున్న దృక్పధం ' అనే అంశంపై నివేదిక విడుదల చేసిన నీతి ఆయోగ్
Posted On:
19 FEB 2024 11:26AM by PIB Hyderabad
'వృద్దుల సంరక్షణ .. భారతదేశంలో మారుతున్న దృక్పధం ' అనే అంశంపై 2024 ఫిబ్రవరి 16న నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది.నీతి ఆయోగ్ సభ్యుడు, సీఈఓ ( ఆరోగ్యం) డాక్టర్ వినోద్ కె పాల్, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి శ్రీ సౌరభ్ గార్డ్ సమక్షంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు శ్రీ సుమన్ భేరీ నివేదికను విడుదల చేశారు. కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి,ఎండీ ఎల్. ఎస్. చాంగ్ సన్,నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు రాజీబ్ సేన్, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సంయుక్త కార్యదర్శి మోనాలి పి ధాకటే,ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి కవిత గర్గ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వికసిత భారత్@2947 లక్ష్య సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా నివేదికను సిద్ధం చేశామని తెలిపారు. లక్ష్య సాధన కోసం నివేదిక ఉపయోగపడుతుందన్నారు. వృద్దుల సంరక్షణ అంశంలో కృత్రిమ మేధస్సు, సాంకేతిక అంశాలు కీలకంగా ఉంటాయన్నారు. వృద్ధుల సంరక్షణ అంశాన్ని కేవలం వైద్య, సామాజిక కోణంలో మాత్రమే కాకుండా ఇతర కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని పరిశీలించాల్సి ఉంటుందన్నారు.
' వృద్ధులు గౌరవంగా, సురక్షితంగా, ఉత్పాదకతకు తోడ్పడుతూ జీవించడానికి దోహదపడే అంశాలపై చర్చలు జరగాల్సిన సమయం ఆసన్నమయింది. వృద్దులకు సామాజిక భద్రత కల్పించే అంశంతో పాటు వారి సంక్షేమం, సంరక్షణ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి' అని నీతి ఆయోగ్ సభ్యుడు ( ఆరోగ్యం) డాక్టర్ వి.కే.పాల్ అన్నారు.
'వృద్దాప్యంలో ఆరోగ్యంగా జీవించడానికి కుటుంబం, కుటుంబ విలువలు కీలకంగా ఉంటాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నివేదిక రూపొందింది.'అని నీతి ఆయోగ్ సీఈఓ శ్రీ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం తెలిపారు
వృద్దుల సంరక్షణకు నివేదిక ఉపయోగపడుతుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి శ్రీ సౌరభ్ గార్డ్ పేర్కొన్నారు. గౌరవంతో వృద్ధాప్యం, ఇంట్లో వృద్ధాప్యం , ఉత్పాదక వృద్ధాప్యం అంశాలకు తమ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సామాజిక, ఆర్థిక , ఆరోగ్య అంశాలను దృష్టిలో ఉంచుకుని విధానాలు రూపొందిస్తామని ఆయన అన్నారు.
సాధికారత, సేవ పంపిణీ , వాటి చేరికల పరంగా ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక / ఆర్థిక,డిజిటల్ అనే నాలుగు ప్రధాన రంగాలను దృష్టిలో ఉంచుకుని నివేదిక రూపొందించారు. వృద్దులకు అవసరమైన వైద్య, వైద్యేతర అవసరాలను గుర్తించడం ద్వారా సంరక్షణ కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు, సమగ్ర బహుముఖ సంరక్షణ విధానం రూపకలాపనకు నివేదికలో సిఫార్సులు పొందుపరిచారు.
నివేదికను : https://niti.gov.in/report-and-publication. చూడవచ్చు.
****
(Release ID: 2007439)
Visitor Counter : 226