శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

మెరుగైన సమాజానికి సైన్స్ కమ్యూనికేషన్ అవసరం..


- ఇన్యాస్ తొమ్మిదవ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో ఉద్ఘాటించిన సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్సీపీఆర్

డైరెక్టర్ ప్రొఫెసర్ రంజన అగర్వాల్

Posted On: 19 FEB 2024 11:06AM by PIB Hyderabad

'ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్' (ఇన్యాస్) తొమ్మిదవ వార్షిక జనరల్ బాడీ సమావేశం ఫిబ్రవరి 17న జరిగింది. సీఎస్ఐఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్సీపీఆర్) డైరెక్టర్ ప్రొఫెసర్ రంజన అగర్వాల్ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, ప్రొఫెసర్ అగర్వాల్ అంతర్దృష్టితో కూడిన ప్రసంగం చేశారు. సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్సీపీఆర్ యొక్క ముఖ్య లక్ష్యాలు మరియు కార్యకలాపాల గురించి చర్చించారు. సమాజంలో శాస్త్రీయ స్వభావాన్ని పెంపొందించడానికి సైన్స్ కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమో తన ప్రసంగంలో వివరించారు. ఈ సందర్భంగా ఇన్యాస్ వార్షిక న్యూస్ లెటjరును కూడా విడుదల చేశారు. ఇన్యాస్ భారతదేశంలోని యువ శాస్త్రవేత్తల ఏకైక గుర్తింపు పొందిన అకాడమీ, ఇది యువ శాస్త్రవేత్తలలో సైన్స్ విద్య మరియు నెట్‌వర్కింగ్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో 2014లో స్థాపించబడింది. ఐదేళ్ల ఇన్క్యూబేషన్ వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ఇన్యాస్ 2020 నుండి కొత్త దశలోకి ప్రవేశించింది. సీఎస్ఐఆర్ -నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్సీపీఆర్) అనేది భారత ప్రభుత్వంలోని సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)  ప్రయోగశాల విభాగంలో ఒకటి.  ఇది సైన్స్ కమ్యూనికేషన్ రంగాలలో ప్రత్యేకత కలిగి ఉంది; ఎస్టీఐ దృష్టి సాక్ష్యం-ఆధారిత విధాన పరిశోధన మరియు అధ్యయనాలు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీపై వివిధ పత్రికలు, పుస్తకాలు, మ్యాగజైన్‌లు, వార్తాలేఖలు మరియు నివేదికలను ప్రచురిస్తుంది. ఇది సైన్స్ కమ్యూనికేషన్, సైన్స్ పాలసీ, ఇన్నోవేషన్ సిస్టమ్స్, సైన్స్-సొసైటీ ఇంటర్‌ఫేస్ మరియు సైన్స్ డిప్లమసీపై పరిశోధనలను కూడా నిర్వహిస్తుంది. మరింత సమాచారం కోసం, దయచేసి https://niscpr.res.in/ని సందర్శించండి లేదా Twitterలో (Xలో)మమ్మల్ని అనుసరించండి: @CSIR_NIScPR ఫేస్బుక్: CSIR NISCPR-OFFICIAL PAGE ఇన్స్టాగ్రామ్: csr_niscpr

<><><>



(Release ID: 2007437) Visitor Counter : 57