హోం మంత్రిత్వ శాఖ
మహాముని పరమపూజ్య ఆచార్య శ్రీ విద్యాసాగర్ మహరాజ్(108) మృతిపట్ల కేంద్ర హోం శాఖ మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సంతాపం వ్యక్తంచేశారు. విద్యాసాగర్ మహారాజ్ మృతి దేశానికి , సమాజానికి పూడ్చలేని లోటు అనన్నారు. వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అమిత్ షా పేర్కొన్నారు.
ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్(108) తన చివరి శ్వాస వరకు మానవాళి సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు– - కేంద్ర హోం శాఖ మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ నిస్వార్థంగా విశ్వ సంక్షేమం మరియు ప్రతి వ్యక్తి సంక్షేమం కోసం తన సంకల్పానికి కట్టుబడి ఉన్నా– - కేంద్ర హోం శాఖ మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
విద్యాసాగర్ జీ మహారాజ్ ఆచార్య.. యోగి, ఆలోచనాపరుడు, తత్వవేత్త మరియు సామాజిక కార్యకర్తగా సమాజానికి మార్గనిర్దేశం చేశారు – - కేంద్ర హోం శాఖ మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ఆచార్య విద్యాసాగర్ జీ మహారాజ్ జీవితం ధృవ నక్షత్రం వంటిది. యుగయుగాలకు భవిష్యత్తు తరాలకు మార్గాన్ని చూపుతూనే ఉంటుంది – - కేంద్ర హోం శాఖ మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
Posted On:
18 FEB 2024 1:18PM by PIB Hyderabad
– - కేంద్ర హోం శాఖ మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
జైన మహాముని పరమ పూజ్య ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్(108) మృతి పట్ల కేంద్ర హోం శాఖ మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. ఇది దేశానికి మరియు సమాజానికి పూడ్చలేని లోటు అని అన్నారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని కేంద్ర హోం శాఖ మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
పరమ పూజ్య ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్(108) వంటి గొప్ప వ్యక్తి మరణం దేశానికి మరియు సమాజానికి పూడ్చలేని లోటని, పరమపూజ్య ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్(108) తన చివరి శ్వాస వరకు మానవాళి సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి అమిత్ షా సమాజిక మాధ్యమం Xలో చేసిన ఓ సందేశంలో పేర్కొన్నారు.
పరమపూజ్య ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్(108) జ్ఞాని సాంగత్యం, ఆప్యాయత, ఆశీస్సులు తనకు లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర హోంమంత్రి అన్నారు. నిజమైన మానవాళి భక్తుడైన ఆచార్య విద్యాసాగర్ జీ మహరాజ్ మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని అన్నారు. ఆచార్య విద్యాసాగర్ జీ మహారాజ్ విశ్వం మరియు ప్రతి వ్యక్తి సంక్షేమం కోసం తన సంకల్పానికి నిస్వార్థంగా కట్టుబడి ఉన్నారని అమిత్ షా తెలిపారు. ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్.. యోగి, ఆలోచనాపరుడు, తత్వవేత్త మరియు సామాజిక కార్యకర్తగా సమాజానికి మార్గనిర్దేశం చేశారని, ఆయన చూడ్డానికి అతి సామాన్యంగా , ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సౌమ్యంగా ఉండేవారని, కానీ అంతర్గతంగా ఆయనలో గొప్ప అన్వేషకుడు ఉన్నాడని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
విద్య, ఆరోగ్యం, పేదల సంక్షేమం వంటి కార్యక్రమాల ద్వారా ఆచార్య విద్యాసాగర్ జీ మహారాజ్ మానవాళికి మరియు సాంస్కృతిక అవగాహనకు ఏకకాలంలో ఎలా సేవ చేయవచ్చో చూపించారని శ్రీ అమిత్ షా అన్నారు. ఆచార్య విద్యాసాగర్ జీ మహారాజ్ జీవితం ధృవ నక్షత్రం లాంటిదని, యుగాలకు, భవిష్యత్తు తరాలకు మార్గాన్ని చూపుతూనే ఉంటుందన్నారు. ఆచార్య విద్యాసాగర్ జీ మహారాజ్ అనుచరులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
***
(Release ID: 2007021)
Visitor Counter : 93