హోం మంత్రిత్వ శాఖ
శ్రీ కర్పూరి ఠాకూర్ జీjజయం సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా
కర్పూరి జీ తన సామాజిక జీవితంలో నిజాయితీ, త్యాగం యొక్క అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పాడు - శ్రీ అమిత్ షా
-ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కర్పూరి ఠాకూర్ జీని భారతరత్నతో సత్కరించడం ద్వారా ఆయన కృషిని వెలుగులోకి తెచ్చారు
- జీవితాంతం వెనుకబడిన ప్రజలు మరియు మహిళల హక్కుల కోసం అంకితం చేసిన ఠాకూర్ జీ.. విద్యా వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యంగా పని చేశారు.
प्रविष्टि तिथि:
17 FEB 2024 2:38PM by PIB Hyderabad
స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సామాజిక మార్పు నాయకుడు శ్రీ కర్పూరి ఠాకూర్ జీ జయంతి సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఆయనకు నివాళులు అర్పించారు. ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో శ్రీ అమిత్ షా తన పోస్ట్‌లో, కర్పూరి జీ తన సామాజిక జీవితంలో నిజాయితీ, త్యాగం యొక్క అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పారని అన్నారు. జీవితాంతం వెనుకబడిన ప్రజలు మరియు మహిళల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఠాకూర్ జీ.. విద్యావ్యవస్థనూ అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమైన కృషి చేశారని ఆయన అన్నారు. కర్పూరీ ఠాకూర్‌ను భారతరత్నతో సత్కరించడం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ ఆయన కృషిని వెలుగులోకి తెచ్చారని శ్రీ షా అన్నారు.
***
(रिलीज़ आईडी: 2007011)
आगंतुक पटल : 120