ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
'సుఫలామ్ 2024లో కీలక దశ లో ఉన్న ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు ‘
Posted On:
16 FEB 2024 11:49AM by PIB Hyderabad
ఫుడ్ ప్రాసెసింగ్ డొమైన్ లోని స్టార్టప్ లను స్థాపిత ఆహార వ్యాపారాలుగా మార్చడానికి ఫుడ్ ప్రాసెసింగ్ లోని వివిధ అంశాలలో ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు , అధునాతన సాంకేతికతలు కీలక చోదకాలు అనే సందేశంతో స్టార్టప్ ఫోరం ఫర్ ఆస్పైరింగ్ లీడర్స్ అండ్ మెంటర్స్ (సుఫలామ్) 2024 ముగిసింది.
2024, ఫిబ్రవరి-13,14 తేదీలలో న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పశుపతి కుమార్ పరాస్ ప్రారంభించారు. వ్యవసాయ, రైతు సంక్షేమం, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి అనితాప్రవీణ్, కుండ్లిలోని నిఫ్టెమ్ డైరెక్టర్ డాక్టర్ హరీందర్ ఒబెరాయ్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ మిన్హాజ్ ఆలం ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. స్టార్టప్ లు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ఎంఎస్ఎంఇ లు, ఆర్థిక సంస్థలు, వెంచర్ క్యాపిటలిస్టులు, విద్యావేత్తలతో సహా 250 మందికి పైగా వాటాదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మూడు నాలెడ్జ్ సెషన్లు, రెండు పిచింగ్ సెషన్లు, రెండు ప్యానెల్ డిస్కషన్లు, నెట్వర్కింగ్ సెషన్లు, ఒక ఎగ్జిబిషన్ ఉన్నాయి. స్టార్టప్ - అవలోకనం, ప్రయోజనాలపై నాలెడ్జ్ సెషన్ లో, స్టార్టప్ ఇండియా పాత్ర, స్టార్టప్ ఇండియా కింద మార్గదర్శకత్వం , ఆవిష్కరణల కోసం వివిధ కార్యక్రమాలు , భారతదేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ ను పెంపొందించడానికి ఈ చొరవ ఎలా సహాయపడుతుందనే దాని గురించి వివరించారు. ఫుడ్ రెగ్యులేషన్స్ పై జరిగిన మరో నాలెడ్జ్ సెషన్ లో, ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ , ఇ ఐ సి నిబంధనలకు అనుగుణంగా వివిధ ఆహార ఉత్పత్తుల దేశీయ, దిగుమతి, ఎగుమతిలో వివిధ నిబంధనలు, ధృవీకరణలు, షరతులు గురించి స్పష్టమైన అవగాహన కల్పించారు. తాజా , ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడానికి అపెడా కింద వివిధ పథకాల గురించి కొత్త అంతర్దృష్టులు, స్టార్టప్ లకు బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ మోడలింగ్ వ్యాపారం, ప్రతి అంశంలో వయబిలిటీ సుస్థిరతను చూపించే వ్యాపార ప్రణాళికను రూపొందించడం గురించి, ఏ వ్యాపారంలో నైనా ఆర్థిక ప్రణాళికలో ఉచిత నగదు ప్రవాహం ప్రాముఖ్యత , సరైన నగదు ప్రవాహ నిర్వహణ గురించి స్టార్టప్ లకు వివిధ చిట్కాలు అందించారు.
ఆహార వ్యవస్థలను మార్చడంపై ప్యానెల్ చర్చ ముడి పదార్థాల వైవిధ్యం, ఆల్గే , చిరుధాన్యాలు వంటి వాతావరణ-స్థితిస్థాపక ఎంపికలు,వ్యవస్థాపకతలో సృజనాత్మకతపై దృష్టి సారించింది. ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా, సరఫరా గొలుసులను ఆప్టిమైజ్ చేయడానికి ప్రాసెసింగ్ యంత్రాలు, ముడి పదార్థాలు, వినూత్న అగ్రి-టెక్ పరిష్కారాల రూపకల్పన గురించి ప్రముఖంగా వివరించారు. ముడి పదార్థాల సోర్సింగ్ లో జోక్యం, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు , స్థిరమైన ప్యాకేజింగ్ లో అవకాశాలను అన్వేషించడం, స్థిరమైన ఆవిష్కరణల కోసం సహకారం గురించి కూడా చర్చించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కోసం స్టార్టప్ కాన్ క్లేవ్ పై సెషన్ లో ఫుడ్ ఇన్నోవేషన్ హబ్ గా భారతదేశ సామర్థ్యం, పరిశ్రమలు, స్టార్టప్ లు, సంస్థల మధ్య సమన్వయం అవసరాన్ని ప్రముఖంగా చర్చించారు. వినియోగదారుల ప్రాధాన్యతలు , నిబంధనల ప్రమాణాలకు అనుగుణంగా స్థిరమైన ప్యాకేజింగ్ ప్రాముఖ్యతపై కీలక చర్చలు కేంద్రీకృతమయ్యాయి. నాణ్యమైన ముడి పదార్థాలను సోర్సింగ్ చేయడం, రైతులకు సహకరించడం, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు, సరసమైన పోషకాహార ఆధారిత ఉత్పత్తుల్లోకి ప్రవేశించడంలో స్టార్టప్ లు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. సుస్థిర ఆవిష్కరణల కోసం, ముఖ్యంగా క్రెడిట్ ఇన్నోవేషన్, పరిశ్రమల మధ్య భాగస్వామ్యం ద్వారా అన్ని రంగాల్లో సహకారానికి పెద్దపీట వేస్తూ సెషన్ ముగిసింది.
రెండు రోజులలో జరిగిన ఈ రెండు సమావేశాల్లో ఎంపిక చేసిన పన్నెండు స్టార్టప్ లు తమ ఆలోచనలను ఫుడ్ టెక్నాలజిస్టులు, ఎస్ బి ఐ , హెచ్ డీఎఫ్ సి బ్యాంక్ కు చెందిన టాప్ బ్యాంకింగ్ అధికారులు, వీసీలు, నిఫ్టెమ్ ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ తో కూడిన ప్యానెల్ కు వినిపించాయి. ప్రొడక్ట్ రిఫైన్ మెంట్, మార్కెట్ లింకేజీ, ఇన్వెస్టర్ కనెక్ట్ లో ఆరు స్టార్టప్ లకు మెంటరింగ్ సపోర్ట్ ఇచ్చారు. ప్యానలిస్టులు ఈ చొరవను స్వాగతించారు ఆశాజనకమైన చిన్న వెంచర్లకు సహాయం , మార్గదర్శకత్వం కోసం భవిష్యత్తు ప్రయత్నాలలో మద్దతును అందించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 26 స్టార్టప్ లు, తొమ్మిది పిఎంఎఫ్ఎంఇ లబ్ధిదారులు, మూడు ప్రభుత్వ ఏజెన్సీలు సహా మొత్తం 38 ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులు, పథకాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు. స్టార్టప్ లు, పరిశ్రమల మధ్య వేర్వేరు నెట్ వర్కింగ్ సెషన్లు జరిగాయి, ఇందులో స్టార్టప్ లకు హ్యాండ్ హోల్డింగ్ టెక్నికల్ మద్దతు పై ప్రధానంగా చర్చలు జరిగాయి.
సుఫలామ్ 2024 పరివర్తనాత్మక చర్చలకు, ఆవిష్కరణ-ఆధారిత వృద్ధి దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ గమనాన్ని రూపొందించ డానికి, స్టార్టప్ ల మధ్య, స్టార్టప్ లు, పరిశ్రమలు, విద్యావేత్తల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది,
***
(Release ID: 2006719)
Visitor Counter : 116