ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భవన్‌లు మరియు రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాల క్యాంటీన్లలో ఆహార భద్రతను నిర్ధారించే దిశగా అడుగులు వేస్తున్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
Posted On:
16 FEB 2024 10:55AM by PIB Hyderabad
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తన ఆహార భద్రత శిక్షణ ద్వారా దేశవ్యాప్తంగా ఆహార భద్రత పర్యావరణ వ్యవస్థను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా అన్ని రాష్ట్ర/యూటీ భవన్‌లు మరియు జాతీయ రాజధానిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల క్యాంటీన్లలో ఆహార నిర్వహణదారులకు శిక్షణను మరియు సర్టిఫికేషన్ (ఎఫ్ఓఎస్‌టిఓసి) ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.
ఫుడ్ రెగ్యులేటర్ ఇప్పటివరకు బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర మరియు సిక్కింలతో సహా నాలుగు రాష్ట్ర భవన్‌లలో శిక్షణా సెషన్‌లను నిర్వహించింది. ఇందులో ఈ భవన్‌ల ఆహార నిర్వాహకులందరికీ అవసరమైన శిక్షణ ఇవ్వబడింది. అదనంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఒపిటి) నార్త్ బ్లాక్‌లో కూడా శిక్షణ నిర్వహించబడింది. ఈ శిక్షణా కార్యక్రమాలు రాష్ట్రం/యూటీ భవన్‌లు మరియు ప్రభుత్వ కార్యాలయ భవనాల క్యాంటీన్‌లలో ఆహార భద్రత ప్రమాణాలను పెంపొందించే లక్ష్యంతో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మణిపూర్ భవన్‌లలో శిక్షణా సమావేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంకా, ప్రభుత్వ కార్యాలయాల్లోని అన్ని క్యాంటీన్లలో ఎఫ్‌ఓఎస్‌టిఎసి కార్యక్రమం కింద శిక్షణ నిర్వహిస్తారు.
ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా జూన్ 7, 2023న గౌరవనీయులైన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి చేసిన “వచ్చే 3 సంవత్సరాలలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ద్వారా 25 లక్షల మంది ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు శిక్షణ” ప్రకటనకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంది. భారతదేశ పౌరులకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహార వాతావరణాన్ని పెంపొందించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు.
నేపథ్యం:
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం అయిన ఎఫ్‌ఒఎస్‌టిఎసి ఆహార వ్యాపారంలో నిమగ్నమైన ఫుడ్ హ్యాండ్లర్‌లకు శిక్షణ ఇవ్వడానికి రూపొందించబడింది. రాష్ట్ర/యుటి భవన్‌లు మరియు ప్రభుత్వ కార్యాలయాల క్యాంటీన్‌లలో శిక్షణా కార్యక్రమాలు ఆహార భద్రత నియమాలు మరియు నిబంధనలు, వ్యక్తిగత పరిశుభ్రత, అలర్జీ నిర్వహణ, ఆహార నిర్వహణ మరియు నియంత్రణ, డాక్యుమెంటేషన్ మరియు రికార్డులు, లేబులింగ్, శిక్షణా పద్ధతులు మరియు అభివృద్ధి చెందుతున్న ట్రెండ్‌లతో సహా అనేక రకాల అంశాలను ఇది కవర్ చేస్తుంది. ఆహార రంగంలో నిరంతర అభ్యాసం మరియు అభివృద్ధి సంస్కృతిని పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి భారతదేశం అంతటా గుర్తింపు పొందిన ఫుడ్ సేఫ్టీ సూపర్‌వైజర్ (ఎఫ్‌ఎస్‌ఎస్) సర్టిఫికేట్ అందజేయబడుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 3,58,224 మంది ఆహార నిర్వాహకులు ఎఫ్‌ఒఎస్‌టిఎసి కార్యక్రమం కింద శిక్షణ పొందారు.
అన్ని రాష్ట్ర/యుటి భవన్‌లు మరియు ప్రభుత్వ కార్యాలయాల క్యాంటీన్‌లలో ఎఫ్‌ఒఎస్‌టిఎసి శిక్షణను విస్తరించాలనే నిర్ణయం విస్తృత ప్రేక్షకులను చేరుకోవడంలో సహాయపడుతుంది మరియు ఆహార భద్రతా ప్రమాణాలను నిర్వహించడానికి అవసరమైన పరిజ్ఞానం మరియు నైపుణ్యాలతో ఆహార సరఫరా గొలుసులో పాల్గొన్న వ్యక్తులకు సాధికారత కల్పిస్తుంది.
***
(Release ID: 2006544)
Visitor Counter : 141