రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ ఇ- మార్కెట్ ప్లేస్ (జిఇఎం)పై రూ. 1లక్షల కోట్ల మైలురాయిని దాటిన రక్షణ మంత్రిత్వ సేకరణ
రక్షణలో ఆత్మనిర్భరతను ప్రోత్సహిస్తూ ఆర్డర్లలో దాదాపు 50% సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎంఎస్ఇలు)కు కేటాయింపు
Posted On:
15 FEB 2024 5:48PM by PIB Hyderabad
2016లో ప్రారంభించినప్పటి నుంచీ ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ ద్వారాసేకరణలో రూ. 1 లక్ష కోట్ల స్థూల వాణిజ్య విలువ (జిఎంవి) దాటిన ఏకైక మంత్రిత్వ శాఖగా రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఒడి) అవతరించి ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13.2.2024 నాటికి జిఇఎంపై దాదాపు ఎంఒడి రూ. 46,000 కోట్ల విలువైన ఆర్డర్లను ఇచ్చింది. ఆర్ధిక సంవత్సరం 2022-23లో రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన ఆర్డర్ల విలువ రూ. 28,732.90 కోట్లు కాగా, ఆర్ధిక సంవత్సరం 2021-22లో అది రూ. 15,091 కోట్లుగా ఉంది. గత సంవత్సరం నుంచి అరవై శాతం గణనీయ పెరుగుదల అన్నది రక్షణ మంత్రిత్వ శాఖ సేకరణ కార్యకలాపాల చేపట్టడానికి జిఇఎం వేదికను ఉపయోగించు కునేందుకు చేస్తున్న నిరంతర కృషి, నిబద్ధతకు తార్కాణంగా నిలుస్తుంది.
దేశవ్యాప్తంగా 19,800 మందికి పైగా రక్షణ కొనుగోలుదారులు జిఇఎంపై 5.47 లక్షల కోట్లకు పైగా ఆర్డర్లు చేశారు. ఇందులో దాదాపు 50% ఆర్డర్లను సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు (ఎంఎస్ఇలు) కేటాయించడం జరిగింది. ఇది ప్రభుత్వ సేకరణ మార్కెట్లో సామాజిక చేరికను పెంచడం, ఆత్మనిర్భరత దిశగా భారతదేశ ఆర్ధిక వృద్ధిని పెంచడం వంటి ప్రధాన విలువలకు అనుగుణంగా ఉంది.
ప్రధాన మంత్రి ద్వారా భారతదేశంలో పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ కోసం ఉద్దేశించిన ఆన్‌లైన్ వేదిక జిఇఎం. ఈ చొరవను ఆగస్టు 9, 2016లో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొనుగోలుదారులు, అమ్మకందారులున్యాయంగా, పోటీపద్ధతిలో సేకరణ కార్యకలాపాలను కొనసాగించేందుకు సమ్మిళిత, సమర్ధవంతమైన పారదర్శక వేదికగా సృష్టించింది.
ఈ మైలు రాయి రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ దళాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ పరిశ్రమ, పరిశోధనా సంస్థల సమన్వయపూరిత కృషిని ప్రతిబింబిస్తుంది. ఇది జిఇఎం వేదిక విజయాన్ని జరుపుకోవడమే కాక జాతీయ రక్షణ సామర్ధ్యాలను పెంపొందించడానికి, భారతదేశ సంపన్నమైన భవిష్యత్తును సాధించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ అంకితభావాన్ని పునరుద్ఘాటిస్తుంది.
***
(Release ID: 2006499)
Visitor Counter : 106