ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అండ్ అనాలసిస్ నిరంతర నిర్వహణ కోసం అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన డిఓఎన్‌ఈఆర్ మంత్రిత్వ శాఖ, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ మరియు ఐఐఎం షిల్లాంగ్
प्रविष्टि तिथि:
14 FEB 2024 3:43PM by PIB Hyderabad
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ డీపెనింగ్ ఎంగేజ్‌మెంట్ ఆపరేషన్‌ను కొనసాగించడం కోసం ఎన్‌ఈసీ షిల్లాంగ్, ఐఐఎం షిల్లాంగ్ మరియు ఎండిఒఎన్‌ఈఆర్ మధ్య 13-02-2024న ఎన్‌ఈసీ సెక్రటేరియట్, షిల్లాంగ్ మరియు ఎండిఒఎన్‌ఈఆర్‌లో ఐఐఎం షిల్లాంగ్‌తో వెబ్‌లింక్ ద్వారా ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఎండిఒఎన్‌ఈఆర్ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ మరియు ఎన్‌ఈసీ ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో శ్రీ అంగ్షుమాన్ డే, జాయింట్ సెక్రటరీ ఎండిఒఎన్‌ఈఆర్ ,ఎన్‌ఈసీ సెక్రటరీ శ్రీ మోసెస్ కె చలై మరియు ఐఐఎం షిల్లాంగ్ డైరెక్టర్ ప్రొఫెసర్. డి.పి. గోయల్ ఈ ఎమ్ఒయుపై సంతకాలు చేశారు.


డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్, ఐఐఎం షిల్లాంగ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (ఎండిఒఎన్‌ఈఆర్) మరియు నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం ద్వారా 15 అక్టోబర్ 2016న రూపొందించబడింది. ఈశాన్య భారత రాష్ట్రాలకు మరియు ప్రాజెక్ట్‌లను సరిగ్గా ప్లాన్ చేయడానికి మరియు అమలు చేయడానికి అమలు చేసే ఏజెన్సీలకు సహాయం చేయడానికి, ఈ ప్రాంతంలోని ఉత్తమ అభ్యాసాల భాండాగారంగా ఆవిష్కరణలు మరియు విధులను ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంగా ఐఐఎం షిల్లాంగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డిపి గోయల్ మాట్లాడుతూ దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం యొక్క గొప్ప వారసత్వం మరియు అభివృద్ధి పట్ల ఆయన విజన్‌ను ప్రతిబింబిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇటీవలి సంవత్సరాలలో డాక్టర్ కలాం సెంటర్ చేసిన కీలక కార్యక్రమాలను ఆయన హైలైట్ చేశారు. ఎమ్ఒయు పొడిగింపు మూడు ముఖ్యమైన ఏజెన్సీల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి పట్ల నిబద్ధతను బలోపేతం చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
ఎన్‌ఈసీ సెక్రటరీ శ్రీ మోసెస్ చలై మాట్లాడుతూ ప్రకారం కేంద్రం ఎలా ఉద్భవించిందో వివరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మార్గదర్శకాలను చైతన్యవంతంగా ఉంచేందుకు ఈ ప్రాంత ఆకాంక్ష మేరకు కేంద్రం ఉద్దేశపూర్వకంగా పని చేయాలని ఆయన కోరారు. ఎన్‌ఇసి ద్వారా డోనర్ మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేసిన డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ భవనం నిర్మాణాన్ని పూర్తి చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం యొక్క అధికారిక ప్రారంభోత్సవం కోసం అతను ఎండిఒఎన్‌ఈఆర్‌ను కోరారు.
ఎండిఒఎన్‌ఈఆర్ సెక్రటరీ శ్రీ చంచల్ కుమార్ ఈ ప్రాంతం యొక్క ముఖ్యమైన థింక్ ట్యాంక్‌గా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నందుకు కేంద్రానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఐఐఎం షిల్లాంగ్ నుండి డాక్టర్ కలాం సెంటర్ ద్వారా నార్త్ ఈస్ట్ డెవలప్‌మెంట్ ఫెలోలను ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు. ఇది పరిపాలనలో మరియు ఈ ప్రాంతంలో సుపరిపాలన తీసుకురావడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందన్నారు. కేంద్రాన్ని అభివృద్ధి చేయడంలో ఎండిఒఎన్‌ఈఆర్ నుండి సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఐఐఎం షిల్లాంగ్‌లోని గవర్నర్ల బోర్డు సభ్యుడు శ్రీ అతుల్ కులకర్ణి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ ప్రాంతం యొక్క ఆకాంక్షలను నెరవేర్చడంలో డాక్టర్ కలాం సెంటర్ యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఇది వ్యవస్థాపకత, విద్య, విధాన అభివృద్ధి లేదా శిక్షణ, మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పాలన అందించడంలో సులభతరం చేస్తుందని చెప్పారు.
ఎంఓయూ పొడిగింపుతో, డాక్టర్ కలాం సెంటర్ మరింత పటిష్టంగా మరియు నిబద్ధతతో పని చేస్తుంది.
డాక్టర్ కలాం సెంటర్ 1. శిక్షణ మరియు అభివృద్ధి 2. పరిశోధన మరియు కన్సల్టెన్సీ 3. పాలసీ అడ్వకేసీ 5. నాలెడ్జ్ డిస్మినేషన్ మరియు 5. సివిక్ ఎంగేజ్‌మెంట్ కింది లక్ష్యాలతో సహా అనేక కీలక రంగాల క్రింద పని చేస్తుంది:
- జాతీయ వృద్ధికి ముఖ్యమైన సహకారిగా ఎన్‌ఈఆర్‌ని ఉంచడానికి ఉత్తమ నిర్వహణ పద్ధతులు, నిర్వహణ ఫ్రేమ్‌వర్క్, ఔట్‌లుక్ మరియు వ్యాపార నమూనాలను అందించే ఆలోచనలను ఉపయోగించడం ద్వారా నార్త్ ఈస్టర్న్ రీజియన్ (ఎన్‌ఈఆర్) కోసం 'థింక్ ట్యాంక్'గా అవతరించడం.
- ఎన్‌ఈఆర్‌లో వనరుల వినియోగం సమర్థవంతంగా మరియు స్థిరంగా కొనసాగడానికి ఇన్‌పుట్‌లను అందించడం.
- ఎన్‌ఈఆర్ యొక్క సామాజిక-ఆర్థిక అభివృద్ధి యొక్క వేగాన్ని వేగవంతం చేసే లక్ష్యంలో ఎండిఒఎన్‌ఈఆర్ యొక్క విధానాలు మరియు కార్యక్రమాల అమలుపై ఫ్రేమ్‌వర్క్‌ను అందించడం మరియు ఎన్‌ఈఆర్‌లోని ఇతర సంస్థలతో సంప్రదించి ఈ ప్రాంత అభివృద్ధికి దీర్ఘకాలిక దృష్టిని అభివృద్ధి చేయడంలో ఎండిఒఎన్‌ఈఆర్/ఎన్‌ఈసీకి సహాయం చేయడం.
- కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు మరియు కార్యక్రమాల అమలులో పాలుపంచుకునే అధికారుల పాఠ్యాంశాలు, కోర్సు రూపకల్పన మరియు సామర్థ్యాన్ని పెంపొందించడంలో సంస్థలకు సహాయం చేయడం ద్వారా ఈ ప్రాంతంలో మానవ వనరుల అభివృద్ధిని ప్రోత్సహించడం.
- ఎన్‌ఈఆర్ అభివృద్ధికి సంబంధించిన వివిధ సబ్జెక్ట్ రంగాలలో అత్యుత్తమ ఇతర సంస్థలతో నెట్‌వర్క్ చేయడం మరియు సహకార పరిశోధన, విశ్లేషణ మరియు కన్సల్టెన్సీ మొదలైన వాటి కోసం ఒక సంస్థాగత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం.
- ఎండిఒఎన్‌ఈఆర్,ఎన్‌ఈసీ మరియు రాష్ట్రాలతో సంయుక్తంగా లేదా వ్యక్తిగతంగా ఎన్‌ఈఆర్ అభివృద్ధి ఎజెండాపై పరిశోధన మరియు విశ్లేషణ చేపట్టడం మరియు దాని ప్రభావవంతమైన అమలు కోసం ఎన్‌ఈఆర్ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు/పథకాలలో అంతరాలను గుర్తించడం.
- అవసరమైన రంగాలలో ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకత ద్వారా ఎన్‌ఈఆర్‌లో ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడంలో తోడ్పాటు అందించడం.
- మార్కెట్ మేధస్సును సేకరించడం ద్వారా ఎన్‌ఈఆర్ నుండి స్థిరమైన ఎగుమతి వృద్ధికి అవసరమైన జోక్యాలను గుర్తించడం.
- ఎన్‌ఈఆర్‌లో దత్తత తీసుకోవడానికి అన్ని రంగాలలో కొత్త ఆలోచనలు మరియు జ్ఞానాన్ని రూపొందించడంలో సహాయం చేయడం.
- డాక్టర్ కలాం సెంటర్ మరియు ఎన్‌ఈసీలోని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రిసోర్స్ సెంటర్ ప్రయత్నాల ద్వారా పరస్పరం పూర్తి చేయడం మరియు బలోపేతం చేసే మార్గాలపై పని చేస్తుంది.
ఈ ప్రాంతం యొక్క నిజమైన వృద్ధి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి ఈశాన్య మండలి, రాష్ట్రాలు మరియు ఈశాన్య ప్రాంతంలోని ప్రముఖ సంస్థలతో పాటు జాతీయ స్థాయి సంస్థల సహకారంతో కేంద్రం పనిచేయాలని భావిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2006189)
आगंतुक पटल : 160