సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కత్రా-వైష్ణోదేవి ప్రత్యేక రైలులో అయోధ్యకు వచ్చిన భక్తులకు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్వయంగా స్వాగతం పలికారు.


కత్రా నుండి మొదటి ప్రత్యేక 'ఆస్తా' రైలు అయోధ్యకు చేరుకుంది. జమ్మూతో పాటు ఉధంపూర్ మరియు రియాసి నుండి భారీగా భక్తులను తీసుకువెళుతుంది.

రామమందిరంలో ప్రార్థనలు చేసేందుకు భక్తులతో కలిసి మంత్రి వచ్చారు

పవిత్ర నగరాలైన కత్రా మరియు అయోధ్యలు ప్రధాని మోదీ హయాంలో రైలు ద్వారా అనుసంధానించబడ్డాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

మాతా వైష్ణో దేవి మందిరంతో ప్రధాని మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 14 FEB 2024 5:23PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు అయోధ్యలో ప్రత్యేకంగా కత్రా-వైష్ణోదేవి ప్రత్యేక రైలులో ఈ రోజు ఉదయం ఈ పవిత్ర నగరానికి కొత్తగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి మందిరానికి పూజలు చేయడానికి వచ్చిన భక్తులను స్వాగతించారు.

 

కత్రా నుండి యాత్రికుల మొదటి ప్రత్యేక రైలు ఈ ఉదయం అయోధ్యకు చేరుకుంది. జమ్మూతో పాటు ఉధంపూర్ మరియు రియాసి నుండి భక్తులను భారీగా తీసుకువెళ్లింది. ఈ పవిత్ర ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఉత్తర రైల్వేలు నిర్వహిస్తున్న కత్రా స్టేషన్ నుండి బయలుదేరే ప్రత్యేక ‘ఆస్తా’ రైళ్లలో ఇది మొదటిది.

 

22 జనవరి 2024న రామమందిరాన్ని ప్రారంభించిన తర్వాత అయోధ్యకు తీర్థయాత్రను సులభతరం చేయడానికి, దేశవ్యాప్తంగా 66 స్థానాలను కలుపుతూ, 22 కోచ్‌లతో కూడిన "ఆస్తా స్పెషల్స్" రైళ్లను భారతీయ రైల్వే ప్రకటించింది.

 

ఉధంపూర్, రియాసి మరియు జమ్మూ జిల్లాలకు చెందిన భక్తులు శ్రీ రామ జన్మభూమి మందిర్‌లో ప్రార్థనలు చేయడానికి యాత్రికులతో పాటు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

 

“ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో రామ్ లల్లా వల్ల పవిత్ర నగరాలైన కత్రా-వైష్ణోదేవి మరియు అయోధ్యలను కలపడం సాధ్యమైంది” అని కేంద్ర సహాయ మంత్రి  సైన్స్ & టెక్నాలజీ; ఎం ఓ ఎస్, పీ ఎం ఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్  డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

 

అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనపై యావత్ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తుంటే, మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రంతో ప్రధాని మోదీకి ప్రత్యేక అనుబంధం ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు.

 

2014 సార్వత్రిక ఎన్నికలకు ప్రధానమంత్రి అభ్యర్థిగా పేర్కొనబడిన వెంటనే, శ్రీ నరేంద్ర మోదీ మాతా వైష్ణో దేవి ఆలయంలో పూజలు చేసిన తర్వాత తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.

 

మళ్లీ, 2014 మేలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, కత్రా-వైష్ణో దేవి రైల్వే స్టేషన్‌ ప్రారంభోత్సవం ఆయన హాజరైన మొదటి ప్రధాన కార్యక్రమాల్లో ఒకటి.

 

పీ ఎం మోడీ ఆదేశాల మేరకు కత్రా రైల్వే స్టేషన్‌  సూర్యరశ్మి ఎక్కువగా ఉన్నందున సోలార్-పవర్‌గా మార్చబడిందని  డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు, దేశంలోని అనేక ఇతర రైల్వే స్టేషన్‌లు కూడా ఇదే ఉదాహరణను అనుసరించాయని అన్నారు.

 

లోక్‌సభలో ఉధంపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ,  ప్రధాని మోడీ హయాంలో, కత్రా వైష్ణోదేవికి న్యూఢిల్లీ నుండి ఎక్స్‌ప్రెస్ రోడ్డు కారిడార్ వచ్చింది, ఒక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు బదులుగా రెండు మరియు కత్రాను పునరుజ్జీవనం మరియు ఆధ్యాత్మికం, వారసత్వ స్థలాలు పథకం (తీర్థయాత్ర)లో చేర్చారు. 

 

భక్తులకు అయోధ్యలో మొక్కులు చెల్లించుకుని అయోధ్యలోని రామ్ లల్లా ఆలయం వరకు మాతా వైష్ణో దేవి ఆశీర్వాదాన్ని కూడా తీసుకువెళతారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

***



(Release ID: 2006182) Visitor Counter : 52


Read this release in: English , Urdu , Hindi , Tamil