ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

గువాహటిలో తొలిసారిగా డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ సదస్సు నిర్వహించనున్న ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ


డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ 2024ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

భారతదేశంలో ప్రతిభావంతుల భవిష్యత్తును రూపొందించే వ్యూహాలపై చర్చించడానికి ఈ శిఖరాగ్ర సమావేశం భారతదేశ , ఉత్తమ ప్రకాశవంతమైన మేధావులను ఏకతాటిపైకి తెస్తుంది.

సదస్సుకు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, విద్యావేత్తలతో సహా 1,000 మందికి పైగా హాజరుకానున్న అతిథులు
సదస్సులో ఫ్యూచర్ స్కిల్స్ కు సంబంధించి 20కి పైగా వ్యూహాత్మక భాగస్వామ్యాల ఆవిష్కరణ

Posted On: 14 FEB 2024 3:17PM by PIB Hyderabad

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (ఎన్ఐఇఎల్ఐటి ) ద్వారా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఇఐటీవై) 2024 ఫిబ్రవరి 15న గౌహతిలో మొట్టమొదటి ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్, జల్ శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈ సమ్మిట్ ను యువ భారతీయులు, ఆలోచనాపరులు, పరిశ్రమ నిపుణులు, విధానకర్తలు, విద్యావేత్తలు, టెక్నాలజీ ఔత్సాహికులతో కలిసి ప్రారంభించనున్నారు. అందరూ కలసి భారతదేశం, ప్రపంచం కోసం భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రతిభావంతులను ఉత్తేజపరిచే వ్యూహాలపై చర్చిస్తారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్, సెమీకండక్టర్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి తదుపరి తరం  అత్యాధునిక టెక్నాలజీల్లో యువ భారతీయులకు కొత్త అవకాశాల కల్పన పై ప్రధాన దృష్టితో ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన డిజిటలైజేషన్ ప్రభావం గురించి చర్చించనున్నారు.

నైపుణ్యాలే శ్రేయస్సుకు పాస్ పోర్ట్ అని గుర్తించిన ఈ శిఖరాగ్ర సమావేశం, భారతదేశాన్ని గ్లోబల్ టాలెంట్ హబ్ గా మార్చడానికి , కొత్త టెక్నాలజీల వల్ల వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్ష్యాలకు అనుగుణంగా ఒక రోడ్ మ్యాప్ ను రూపొందించడానికి సిద్ధంగా ఉంది.

దేశవ్యాప్తంగా పరిశ్రమలు, విద్యా సంస్థలతో అనేక భాగస్వామ్యాలను ఏర్పరచడం, పాఠ్యాంశాలు పరిశ్రమ డిమాండ్లు,   ప్రమాణాలకు దగ్గరగా ఉండేలా చూడటం కూడా ఒక కీలక లక్ష్యం. ఈ లక్ష్యానికి అనుగుణంగా ఎన్ఐఇఎల్ఐటి , ఇంటెల్, హెచ్ సిఎల్, మైక్రోసాఫ్ట్, కిండ్రిల్, ఐఐఎం రాయపూర్, ఐఐఐటిఎం గ్వాలియర్, విప్రో తదితర సంస్థల మధ్య 20కి పైగా వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఈ సదస్సులో జరగనున్నాయి.

ఈ సదస్సులో 1000 మందికి పైగా ప్రముఖులు, 30కి పైగా ఇన్నోవేటివ్ ఎగ్జిబిషన్లు పాల్గొననున్నాయి.

ఈ సదస్సులో 1000 మందికి పైగా ప్రముఖులు, 30కి పైగా ఇన్నోవేటివ్ ఎగ్జిబిషన్లు పాల్గొననున్నాయి., సదస్సులో ఎన్ఎండి ఇండియా హెడ్ శ్రీమతి జయ జగదీష్ , శ్రీ రుచిర్ దీక్షిత్, వైస్ ప్రెసిడెంట్ అండ్ కంట్రీ మేనేజర్, సిమెన్స్  ఇడిఎ, శ్రీ లింగరాజు సావ్కర్, ప్రెసిడెంట్, కైండ్రిల్ ఇండియా, శ్రీజ్ఞాని ఎఐ సిఇఒ అండ్ కో ఫౌండర్ శ్రీ గణేశ్ గోపాలన్, ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాష్ చౌదరి , శ్రీ కుంతల్ సేన్ శర్మ, ఆర్థిక సలహాదారు, ఎంఇఐటీవై, డాక్టర్ ఎం.ఎం.త్రిపాఠి, డీజీ, ఎన్ఐఇఎల్ఐటి తదితరులు ప్రసంగిస్తారు.

ఈ సదస్సులో ఈ క్రింది అంశాలపై నాలుగు ప్యానెల్  చర్చలు జరుగుతాయి:

1.సెమీకాన్ ఇండియా # ఫ్యూచర్ స్కిల్స్

ప్యానలిస్టులు: శాస్త్ర విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎస్.వైద్యసుబ్రమణ్యం, బ్యాంకాక్ యూనివర్సిటీ బి యు సి ఆర్ ఇ ఒ సి సి ఎస్ డైరెక్టర్ డాక్టర్ కరెల్ స్టెర్క్స్, రష్యా ఆప్టిమైజింగ్ టెక్నాలజీస్ సిఇఒ అలెగ్జాండర్,  డ్రోజ్డోవ్, సీమెన్స్ ఈడీఏ కంట్రీ హెడ్ రుచిర్ దీక్షిత్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ శివరామ కృష్ణ వంజారి.

మోడరేటర్: సుమిత్ గోస్వామి, సీనియర్ డైరెక్టర్ ఇంజినీరింగ్, క్వాల్కమ్.

2. ఇండియా ఎఐ # ఫ్యూచర్ స్కిల్స్

ప్యానలిస్టులు: శ్రీ అమితాబ్ నాగ్, సిఇఒ, భాషిని డిజిటల్ ఇండియా, శ్రీ గణేష్ మహాబాల, డైరెక్టర్ - స్ట్రాటజిక్ బిజినెస్, దక్షిణాసియా, ఎన్ వి ఐ డి ఐ ,  శ్రీమతి శివశంకర్, కార్పొరేట్ విపి అండ్ హెడ్ ఎడ్టెక్ బిజినెస్, హెచ్ సి ఎల్ టెక్నాలజీస్, యునెస్కో సోషల్ అండ్ హ్యూమన్ సైన్సెస్ డైరెక్టర్, చీఫ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ డాక్టర్ మరియాగ్రాజియా స్క్విసియారిని, యాక్సెంచర్ మేనేజింగ్ డైరెక్టర్ అనూజ్ జైన్ , శ్రీరామ్ రాఘవన్, వైస్ ప్రెసిడెంట్, ఐ బిఎం రీసెర్చ్ ఏఐ.

మోడరేటర్: శ్రీమతి శ్వేతా ఖురానా, సీనియర్ డైరెక్టర్ ఎపిజె - ప్రభుత్వ భాగస్వామ్యాలు,  చొరవలు, గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ గ్రూప్, ఇంటెల్

3. సైబర్ సెక్యూరిటీ అండ్ ఎమర్జింగ్ #ఫ్యూచర్ స్కిల్స్

ప్యానలిస్టులు: శ్రీ హసిత్ జి త్రివేది, సిటిఒ- డిజిటల్ టెక్నాలజీస్ అండ్ గ్లోబల్ హెడ్ - ఏఐ, టెక్ మహీంద్రా, డాక్టర్ మణి మధుకర్, ప్రోగ్రామ్ లీడ్, ఐబీఎం స్కిల్స్ బిల్డింగ్, రాహుల్ దత్తా, మైక్రోసాఫ్ట్ ఇండియా మార్కెటింగ్ కంట్రీ డైరెక్టర్, ప్రొఫెసర్ రాజీవ్ అహుజా, డైరెక్టర్, ఐఐటీ రోపర్/గౌహతి, శ్రీ అమితవ గుహ ఠాకూర్తా, లీడర్, సిస్టమ్స్ ఇంజనీరింగ్, సిస్కో,, మనీశ్ కుమార్, రియల్ ఎక్స్ అండ్ గ్రీక్స్ ఫౌండర్ అండ్ సి ఇ ఒ

మోడరేటర్ :వినాయక్ గాడ్సే, సిఇఒ, డిఎస్ సిఐ

4. డిజిటల్ # ఫ్యూచర్ స్కిల్స్  - గ్లోబల్ వర్క్ ఫోర్స్ కోసం భారతదేశ  ప్రతిభ

ప్యానలిస్టులు : తైవాన్ లోని ఫౌండేషన్ ఫర్ కామర్స్ అండ్ కల్చర్ ఇంటర్ చేంజ్ (ఎఫ్ సి సిఐ) అధ్యక్షుడు డాక్టర్ డెన్నిస్ హు, అరవింద్ శెట్టి, విపి గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్, కైండ్రిల్, డాక్టర్ సి వి ఎస్ కిరణ్, వైస్ ప్రెసిడెంట్, ఆర్ అండ్ డి అండ్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్, స్కైరూట్ ఏరోస్పేస్, విక్రమ్ షా, సి టి ఒ, ఇంటర్న్శల, శ్రీ అభిషేక్ శర్మ, యూనిక్యూస్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు,

మోడరేటర్: అనురాగ్ మజుందార్, ది లాజికల్ ఇండియా కో ఫౌండర్

డిజిటల్ భవిష్యత్తు సవాళ్లు, అవకాశాలకు సిద్ధంగా ఉన్న నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని పెంపొందించడానికి సంస్థ స్థిరమైన నిబద్ధత కలిగి ఉందని ఎన్ఐఇఎల్ఐటి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంఎం త్రిపాఠి తెలిపారు.

***



(Release ID: 2006178) Visitor Counter : 110