ప్రధాన మంత్రి కార్యాలయం

దుబయి లోనిజెబెల్ అలీ లో భారత్ మార్ట్ కు వర్చువల్ పద్ధతి లో శంకుస్థాపన చేయడమైంది

Posted On: 14 FEB 2024 3:48PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు దుబయి ఉపాధ్యక్షుడు, ప్రధాని మరియు పాలకుడు అయిన శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్తూమ్ లు దుబయి లోని జెబెల్ అలీ స్వేచ్ఛా వ్యాపార మండలం లో డిపి వరల్డ్ ద్వారా నిర్మాణం జరుగనున్న భారత్ మార్ట్ కు 2024 ఫిబ్రవరి 14 వ తేదీ నాడు వర్చువల్ పద్ధతి లో శంకుస్థాపన చేశారు.

 

 

జెబెల్ అలీ నౌకాశ్రయం యొక్క వ్యూహాత్మక స్థానాన్ని మరియు లాజిస్టిక్స్ పరమైన బలాన్ని అనువు గా ఉపయోగించుకొని భారతదేశం-యుఎఇ ద్వైపాక్షిక వ్యాపారాన్ని భారత్ మార్ట్ మరింత ముందుకు తీసుకుపోగలదన్న విశ్వాసాన్ని ఇరువురు నేత లు వ్యక్తం చేశారు. భారతదేశం లోని సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా (ఎమ్ఎస్ఎమ్ఇ) రంగాల కు చెందిన ఎగుమతులు గల్ఫ్ లో, పశ్చిమ ఆసియాలో, ఆఫ్రికా లో మరియు యూరేశియా లో అంతర్జాతీయ కొనుగోలుదారుల వద్ద కు చేరేటట్టు భారత్ మార్ట్ ప్రభావవంతం అయిన వేదిక ను అందుబాటు లోకి తేవడం ద్వారా ఎగుమతుల ను ప్రోత్సహించడం లో ఒక ముఖ్య పాత్ర ను పోషించగల సత్తా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

***

 



(Release ID: 2005991) Visitor Counter : 67