శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

జాతీయ జియోస్పేషియల్ పాలసీ భౌగోళిక ప్రాదేశిక సమాచార సంబంధిత సేవల అందుబాటు ద్వారా చేరిక మరియు పురోగతికి ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది.

Posted On: 13 FEB 2024 2:24PM by PIB Hyderabad

సమ్మిళిత అభివృద్ధి పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తూ, ప్రభుత్వం నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022 (ఎన్ జీ పీ)ని అమలు చేస్తోంది మరియు ప్రాదేశిక సమాచార  ప్రాప్యత మరియు వినియోగాన్ని గణనీయంగా విస్తరించి, పౌరుల సేవలను వేగంగా మెరుగుపరుస్తుంది మరియు దేశంలోని మారుమూల ప్రాంతాలకు దాని చేరువను పెంచుతుంది.

 

2022లో ప్రారంభించబడిన ఎన్‌జిపిని అమలు చేయడానికి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్‌టి) జియోస్పేషియల్ డేటా యాక్సెస్‌ను సరళీకృతం చేయడానికి గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ను ఏకీకృతం చేసింది. డీ ఎస్ టి జియోస్పేషియల్ డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్‌ను నిరంతరం బలోపేతం చేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్‌ను నొక్కిచెబుతూ, ఇది స్థానిక కంపెనీలకు వారి ప్రపంచ పోటీతత్వాన్ని పెంపొందించడానికి వారి స్వంత జియోస్పేషియల్ డేటాను రూపొందించడానికి మరియు ఉపయోగించుకోవడానికి అధికారం కల్పిస్తోంది. ఇది ఓపెన్ స్టాండర్డ్స్, ఓపెన్ డేటా మరియు ప్లాట్‌ఫారమ్‌లను ప్రోత్సహిస్తుంది.

 

“గౌరవ పీ ఎం యూ ఎన్ వరల్డ్ జియోస్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్‌లో సమ్మిళితత పురోగతిలో జియోస్పేషియల్ టెక్నాలజీల పాత్రను హైలైట్ చేసారు. ఎన్ జీ పీ ద్వారా జియోస్పేషియల్ డేటా యాక్సెస్ యొక్క సరళీకరణ ఈ దిశలో ఒక ప్రధాన అడుగు. ప్రజలకు దాని ప్రయోజనాలను చేరవేసేందుకు ప్రాదేశిక డేటాను ఉపయోగించే విధానాన్ని ఇది మార్చివేసింది" అని డిఎస్‌టి సెక్రటరీ ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ అన్నారు.

 

సమాచార లభ్యతను సరళీకృతం చేసే విధానం ప్రకటించిన తర్వాత, శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, పాలనా ఫ్రేమ్‌వర్క్ ఏకీకృతం చేయబడింది. భారతదేశంలోని జియోస్పేషియల్ డేటా మరియు మ్యాప్స్‌పై ముందస్తు ఆమోదం, భద్రతా అనుమతి, లైసెన్స్, ఇతర పరిమితుల అవసరం తొలగించబడింది. ముందుగా ఉన్న అనుమతి వ్యవస్థ స్వీయ-ధృవీకరణ ద్వారా భర్తీ చేయబడింది, అందుబాటు సులభతరం చేయబడింది.

 

సమాచార అవస్థాపనను బలోపేతం చేయడానికి మరియు సంస్థలు మరియు రంగాలలో మెరుగైన ప్రాదేశిక సమాచార లభ్యత మరియు అందుబాటును మెరుగుపరచడానికి దేశ వ్యాప్తంగా నిరంతరాయంగా పనిచేసే రిఫరెన్స్ స్టేషన్స్ నెట్‌వర్క్‌ను సర్వే ఆఫ్ ఇండియా ప్రారంభించింది. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్, హర్యానా మరియు కర్ణాటక రాష్ట్రాలను కవర్ చేసే  స్వమిత్వ పథకం కింద డ్రోన్ ఫ్లయింగ్ ద్వారా   ఎస్ ఓ ఐ 2.8 లక్షలకు పైగా గ్రామాలను సర్వే చేసి మ్యాప్ చేసింది.

 

వ్యక్తులు, కంపెనీలు మరియు ప్రభుత్వ ఏజెన్సీలు ఇప్పుడు పొందిన జియోస్పేషియల్ డేటాను ప్రాసెస్ చేయవచ్చు, అప్లికేషన్‌లను రూపొందించవచ్చు మరియు దానిపై పరిష్కారాలను అభివృద్ధి చేయవచ్చు అలాగే అటువంటి డేటా ఉత్పత్తులు, అప్లికేషన్‌లు మరియు పరిష్కారాలను ఉపయోగించవచ్చు.  ఓపెన్ స్టాండర్డ్స్, ఓపెన్ డేటా మరియు ప్లాట్‌ఫారమ్‌ల ప్రచారం ద్వారా, ఎన్ జీ పీ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించింది. ఇది ప్రైవేట్ సంస్థల క్రియాశీల భాగస్వామ్యంతో దేశంలో అభివృద్ధి చెందుతున్న జియోస్పేషియల్ పరిశ్రమను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

 

పౌర-కేంద్రీకృత విధానం స్థానిక కంపెనీలకు వారి స్వంత జియోస్పేషియల్ డేటాను రూపొందించడానికి మరియు ఉపయోగించుకోవడానికి, ఆవిష్కరణలను ప్రారంభించడం మరియు ఇంక్యుబేషన్ సెంటర్లు, పరిశ్రమ యాక్సిలరేటర్లు అలాగే జియోస్పేషియల్ టెక్నాలజీ పార్క్‌లను ఏర్పాటు చేయడం ద్వారా సాంకేతిక ఆవిష్కరణలు మరియు స్వీకరణను ప్రోత్సహిస్తుంది. ఆవిష్కరణల కోసం  జియోస్పేషియల్ స్పేస్‌ రంగంలో   భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చడానికి ఇది సిద్ధంగా ఉంది. ఎన్ జీ పీ కొత్త ఆవిష్కరణలు మరియు ప్రాదేశిక డేటా యాక్సెస్‌ను పెంచే స్వేచ్ఛపై దృష్టి సారించి, ప్రధానమంత్రి కల వికసిత్ భారత్ కోసం జాతీయ అభివృద్ధి, ఆర్థిక శ్రేయస్సు మరియు అభివృద్ధి చెందుతున్న సమాచార ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి కీలకమైన సాధనంగా మారింది. 

 

<><><>



(Release ID: 2005743) Visitor Counter : 78