రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత్‌ - ఫ్రెంచ్‌ నౌకదాళాల మధ్య 17వ విడత సమావేశాలు

Posted On: 08 FEB 2024 12:02PM by PIB Hyderabad

భారత నౌకాదళం (ఐఎన్‌) - ఫ్రెంచ్ నౌకాదళం (ఎఫ్‌ఎన్) సిబ్బంది మధ్య 17వ విడత సమావేశాలు ఈ నెల 06, 07 తేదీల్లో న్యూదిల్లీలో జరిగాయి. భారత్‌ తరపున రియర్‌ అడ్మిరల్‌ నిర్భయ్ బాప్నా, ఫ్రాన్స్‌ తరపున రియర్‌ అడ్మిరల్‌ జీన్ మార్క్ డురాండౌ ఈ సమావేశాలకు అధ్యక్షత వహించారు.

సమావేశాల్లో చురుగ్గా చర్చలు జరిపిన రెండు పక్షాలు; కార్యాచరణ, శిక్షణ, ఎస్‌ఎంఈ మార్పిడి వంటి ప్రధాన విషయాలపై మాట్లాడుకున్నాయి. రెండు నౌకాదళాల మధ్య పెరుగుతున్న స్నేహాన్ని ఇరు పక్షాలు గుర్తించాయి, సముద్ర రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి అంగీకరించాయి.

రియర్‌ అడ్మిరల్‌ జీన్ మార్క్ డురాండౌ, ఈ నెల 07న, భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ & వైస్‌ అడ్మిరల్‌ తరుణ్ సోబ్టీతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి సహకారంపై చర్చించారు. అంతకుముందు, 06వ తేదీన, ఐఎఫ్‌ఎస్‌-ఐవోఆర్‌ను కూడా ఆయన సందర్శించారు.

___


(Release ID: 2003933) Visitor Counter : 123