ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఎంఇఐటివై సైబర్ సురక్షిత్ భారత్ చొరవ కింద చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అధికారుల కోసం 42వ డీప్ డైవ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎన్ఇజిడి
Posted On:
06 FEB 2024 1:51PM by PIB Hyderabad
సైబర్ నేరాల గురించి అవగాహనను కల్పించి, ప్రభుత్వ విభాగాలలోని చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (ప్రధాన సమాచార భద్రత) అధికారులు (సిఐఎస్ ఒలు), ముందు వరుసలో ఉండే ఐటి అధికారులుసామర్ధ్యాలను నిర్మించేందుకు, పెరుగుతున్న సైబర్ నేరాల ముప్పును ఎదుర్కొనడానికి తగిన భద్రతా చర్యలను నిర్ధారించడానికి, రసంస్థలు తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను రక్షించుకోవడానికి, సైబర్ దాడులను ఎదుర్కొనడంలో భవిష్యత్ సంసిద్ధతను కలిగి ఉండేందుకు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ (ఎంఇఐటివై) అయిన సైబర్ సురక్ష భారత్ చొరవను చేపట్టింది.
సామర్ధ్య నిర్మాణ పథకం కింద జాతీయ ఇ- గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఇజిడి) కింద 42వ సిఐఎస్ ఒ డీప్- డైవ్ (లోతైన) శిక్షణా కార్యక్రమాన్ని ఫిబ్రవరి 5-9, 2024 వరకు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో నిర్వహిస్తోంది. ఇందులో ఆంధ్ర ప్రదేశ్, బీహార్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమ ప్రారంభ సెషన్‌కు విశిష్ట అతిథులుగా ఎంఇఐటివై అదనపు కార్యదర్శి శ్రీ భువనేశ్వర్ కుమార్, డిజి- ఐఐపిఎ శ్రీ ఎస్ ఎన్ త్రిపాఠి, ఎంఇఐటివై, ఎన్ఇజిడి & ఐఐపిఎ నుంచి సీనియర్ అధికారులు హాజరయ్యారు. సైబర్ దాడులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ భద్రత ప్రాముఖ్యతను నొక్కి చెపుతూ, డిజిటల్ యుగంలో సిఐఎస్ ఒల ప్రముఖ పాత్రను పట్టి చూపారు. సిఐఎస్ ఒలు రెండు దశలలో ముప్పును తగ్గించడం, ఘటనలు జరిగినప్పుడు తక్షణ స్పందనలో కీలక పాత్రను పోషించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆయన సిఐఎస్ఒలు అందరికీ సిఇఆర్‌టి -ఐఎన్ మార్గదర్శకాల ప్రాముఖ్యతను పట్టి చూపారు.
ఈ కార్యక్రమ లక్ష్యం అవగాహనను పెంచడం, సామర్ధ్యాలను నిర్మించడం, బలమైన సైబర్ పర్యావరణ వ్యవస్థను సృష్టించేందుకు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ విభాగాలను సాధికారం చేయడం. సైబర్ రక్షణ, భద్రతపై పాల్గొనేవారికి అవగాహన కల్పించడం, దిశానిర్దేశం చేయడం, తద్వారా పౌరులకు వివిధ ప్రభుత్వ సేవలను సమగ్రంగా అందించడానికి సులభతరం చేయడం కోసం ఈ కార్యక్రమం యత్నిస్తోంది. ఈ కార్యక్రమం ప్రభుత్వ విభాగాలు, వారి సైబర్ పరిశుభ్రత, భద్రత, రక్షణను చూసుకోవడానికి వీలుగా సైబర్ భద్రత గురించి సమగ్ర సమాచారాన్ని, పరిజ్ఞానాన్ని అందిస్తుంది.
జూన్ 2018 నుంచి ఫిబ్రవరి 2024 వరకు ఎన్ ఇజిడి 1,574 కంటే ఎక్కువమంది సిఐఎస్ఒలు, ముందు వరుస ఐటి అధికారుల కోసం 42 బ్యాచ్‌ల సిఐఎస్ ఒ డీప్- డైవ్ శిక్షణా కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించింది.
***
(Release ID: 2003377)
Visitor Counter : 107