రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
అరుణాచల్ ప్రదేశ్‌లోని జాతీయ రహదారి-913 (ఫ్రాంటియర్ హైవే) యొక్క..
లాడా-సర్లి సెక్షన్ నిర్మాణానికి గాను రూ. 2,248.94 కోట్ల నిధులకు శ్రీ నితిన్ గడ్కరీ ఆమోదం
Posted On:
06 FEB 2024 3:17PM by PIB Hyderabad
అరుణాచల్ ప్రదేశ్‌లోని జాతీయ రహదారి-913 (ఫ్రాంటియర్ హైవే) యొక్క లాడా-సర్లి సెక్షన్ నిర్మాణానికి ఈపీసీ మోడ్‌లో 1, 2, 3, & 6 ప్యాకేజీలలోని 105.59 కి.మీ. నిడివి గల రహదారుల నిర్మాణానికి కావాల్సిన రూ. 2,248.94 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అమోదం తెలిపారు. భద్రతా దళాలకు వేగవంతమైన కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను అందించడానికి అంకితం చేయబడిన ఈ కీలకమైన ప్రాజెక్ట్ ఆర్థిక కార్యకలాపాలను ఉత్తేజపరిచేందుకు, శక్తివంతమైన సరిహద్దు ప్రాంతాల వైపు రివర్స్ మైగ్రేషన్‌ను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందని మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. అదనంగా, ఇది అవసరమైన రహదారి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది, కీలకమైన నదీ పరివాహక ప్రాంతాలను కలుపుతూ మరియు రాష్ట్రంలో అనేక జలవిద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ రహదారి పర్యాటకానికి, ఎగువ అరుణాచల్‌లోని తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు మరియు భవిష్యత్తులో ట్రాఫిక్ పెరుగుదలకు దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నట్టుగా శ్రీ గడ్కరీ తెలిపారు.
***
(Release ID: 2003373)
Visitor Counter : 70