సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వృద్ధ మహిళల సాధికారత

Posted On: 06 FEB 2024 2:33PM by PIB Hyderabad

అటల్ వయో అభ్యుదయ్ యోజన (అవ్యయ్‌) పథకంలో భాగంగా, వృద్ధుల సంరక్షణ కోసం 'ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌ ఫర్‌ సీనియర్ సిటిజన్స్'ను (ఐపీఎస్‌ఆర్‌సీ) కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత విభాగం అమలు చేస్తోంది. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్స్ హోమ్‌లు (వృద్ధాశ్రమాలు), నిరంతర సంరక్షణ గృహాలు వంటి వాటి నిర్వహణ కోసం ప్రభుత్వేతర/స్వచ్ఛంద సంస్థలకు గ్రాంట్ అందుతుంది. వృద్ధాప్యంలో గౌరవప్రదంగా జీవించేలా అన్ని లింగాలకు చెందిన నిరుపేద వృద్ధులకు ఆశ్రయం, పోషకాహారం, వైద్య సంరక్షణ, వినోదం వంటి సౌకర్యాలను అక్కడ ఉచితంగా అందిస్తారు. ఈ పథకం కింద, ముఖ్యంగా వృద్ధ మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించే 'సీనియర్ సిటిజన్స్ హోమ్స్‌' కూడా కేంద్ర గ్రాంట్ అందుతుంది. ప్రస్తుతం ఐపీఎస్‌ఆర్‌సీ కింద మొత్తం 604 సీనియర్ సిటిజన్స్ హోమ్స్‌కు కేంద్ర సాయం అందుతోంది, వాటిలో 25 వృద్ధ మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్ హోమ్స్‌.

వృద్ధుల కోసం రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను కూడా కేంద్ర విభాగం అమలు చేస్తోంది. ఈ ప్రణాళిక కింద, ఈ కింది వాటి అమలు కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు గ్రాంట్ అందిస్తోంది:

  1. వృద్ధుల కోసం శిక్షణ పొందిన సంరక్షకులను తయారు చేయడం
  2. వృద్ధులకు కంటి శుక్లం శస్త్రచికిత్సల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం
  3. వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేకించి నిస్సహాయుల సంక్షేమం గురించి అవగాహన కల్పించడం

కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతిమా భౌమిక్ ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు. 

 

***


(Release ID: 2003368) Visitor Counter : 106