పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

2023లో, మహిళలకు 294 కమర్షియల్ పైలట్ లైసెన్స్‌లు జారీ చేయబడ్డాయి. మొత్తం జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్సుల్లో ఇవి 18 శాతం.


2022తో పోలిస్తే 2023లో మహిళలకు 22% ఎక్కువ కమర్షియల్ పైలట్ లైన్సులు జారీ చేయబడ్డాయి

Posted On: 05 FEB 2024 2:43PM by PIB Hyderabad

భారతదేశంలో మహిళా పైలట్ల నమోదులో గణనీయమైన పెరుగుదల నమోదువుతోంది. 2023 సంవత్సరంలో 1622 కమర్షియల్ పైలట్ లైసెన్సులు జారీ చేయగా.. అందులో 294 లైసెన్సులు మహిళలకు జారీచేబడ్డాయి. మొత్తం జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్సుల్లో  ఇవి 18 శాతం.

  2022లో మహిళలకు 240 కమర్షియల్ పైలట్ లైసెన్సులు జారీచేయగా వాటితో  పోలిస్తే 2023 మహిళలకు 294 కమర్షియల్ పైటల్ లైసెన్సులు జారీ చేశారు. మహిళలకు జారీ చేసిన కమర్షియల్  పైలట్ లైసెన్సుల  సంఖ్య 22 శాతం పెరిగింది.

ప్రస్తుతం, వివిధ భారతీయ షెడ్యూల్డ్ మరియు నాన్- షెడ్యూల్డ్ ఆపరేటర్లతో పని చేస్తున్న మొత్తం వైమానిక సిబ్బందిలో  మహిళా పైలట్ల సంఖ్య మొత్తం విమాన సిబ్బంది బలంలో సుమారుగా 14 శాతంగా ఉంది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు దాని అనుబంధ సంస్థలు దేశంలో మహిళలు మరియు పురుషులు ఇద్దరికీ పైలట్ల సంఖ్యను పెంచడానికి చర్యలు చేపట్టాయి. వీటిలో మొదటి దశలో బెలగావి, జల్గావ్, కలబురగి, ఖజురహో మరియు లిలాబరి అనే ఐదు విమానాశ్రయాలలో తొమ్మిది కొత్త ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్ టీ ఓ) కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అవార్డు లెటర్‌లను జారీ చేయడం మరియు రెండవ దశలో భావ్‌నగర్, హుబ్బల్లి, కడప, కిషన్‌గఢ్ మరియు సేలం అనే ఐదు విమానాశ్రయాలలో మరో ఆరు ఎఫ్ టీఓలు ఉన్నాయి. .

అదనంగా, విమెన్ ఇన్ ఏవియేషన్ ఇంటర్నేషనల్ (డబ్ల్యూఏఐ) - ఇండియా చాప్టర్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, పరిశ్రమ మరియు ప్రముఖ మహిళా విమానయాన నిపుణుల సహకారంతో దేశవ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన పాఠశాల బాలికలపై ప్రత్యేక దృష్టి సారించింది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ డాక్టర్ వి.కె. సింగ్ (రిటైర్డ్) ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.


 

***



(Release ID: 2002959) Visitor Counter : 36