ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ(డోనార్) ఆధ్వర్యంలో నార్త్ - ఈస్ట్ (ఈశాన్య) సమ్మేళనం


ఈశాన్య ప్రాంత గొప్ప అభివృద్ధి అవకాశాలను, అపరిమితమైన సామర్థ్యాన్ని, సుసంపన్న సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించడానికి ఈశాన్య సమ్మేళనం ఒక అద్భుతమైన అవకాశం: శ్రీ జి కిషన్ రెడ్డి

ఈ ప్రాంత అభ్యున్నతికి, దేశం మొత్తానికి సమ్మిళిత వృద్ధిని పెంపొందించడానికి అంకితమైన నిబద్ధతను ఇది సూచిస్తుంది: ముఖ్యంగా అష్ట లక్ష్మి ప్రాంతీయ అభివృద్ధి కోసం సమర్థవంతమైన పాలన , చొరవలను ప్రశంసిస్తుంది: శ్రీ బి.ఎల్. వర్మ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముందు చూపు నాయకత్వంలో ప్రభుత్వం 'ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్' దార్శనికతతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోంది: శ్రీ కిరణ్ రిజిజు

ద్వారకలో నార్త్ ఈస్టర్న్ కల్చరల్ అండ్ సోషల్ ఇన్ స్టిట్యూట్ కు మంత్రులు శంకుస్థాపన చేసిన మంత్రులు: న్యూఢిల్లీలోని జెఎన్ యు లో బరాక్ హాస్టల్ కు ప్రారంభోత్సవం

Posted On: 05 FEB 2024 1:35PM by PIB Hyderabad

2024 ఫిబ్రవరి 4 న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్  ఇంటర్నేషనల్ సెంటర్ లో ఈశాన్య ప్రాంత సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి , సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్.వర్మ, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి కుమారి ప్రతిమా భౌమిక్, కేంద్ర విదేశీ వ్యవహారాలు , విద్య శాఖల సహాయ మంత్రి శ్రీ  శ్రీ రాజ్ కుమార్ రంజన్ సింగ్ పాల్గొన్నారుఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో ఈశాన్య రాష్ట్రాల్లోని వివిధ కేడర్లకు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు. సమావేశానికి ఢిల్లీలోని వివిధ సంస్థల్లో చదువుతున్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో సహా దాదాపు 1000 మంది హాజరయ్యారు. మహిళా సాధికారతకు కృషి చేసినందుకు పద్మశ్రీ అవార్డు పొందిన శ్రీమతి సంగ్ఖుమి బువాల్చువాక్ హాజరు కావడం సందర్భానికి ఒక ముఖ్యమైన కోణాన్ని జోడించింది.

బాబా సాహెబ్ అంబేద్కర్ కు మంత్రులు నివాళులర్పించడంతో సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ద్వారకలో నార్త్ ఈస్ట్రన్ కల్చరల్ అండ్ సోషల్ ఇన్ స్టిట్యూట్ కు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన మంత్రులు ఢిల్లీలోని జె ఎన్ యు లో బరాక్ హాస్టల్ ను ప్రారంభించారు. రూ.116.38 కోట్లతో ద్వారకలో నిర్మించే నార్త్ ఈస్టర్న్ కల్చరల్ అండ్ సోషల్ ఇన్ స్టిట్యూట్ లో ఆడిటోరియం, ఈశాన్య ప్రాంతానికి సంబంధించిన మెటీరియల్ పై దృష్టి సారించే లైబ్రరీ కమ్ రీడింగ్ రూమ్, ప్రాంతాన్ని ప్రదర్శించే ఆర్ట్ గ్యాలరీ, ఎగ్జిబిషన్ హాల్, రీసెర్చ్ సెంటర్, సేల్ అవుట్ లెట్స్, గెస్ట్ హౌస్ వంటి వివిధ సౌకర్యాలు ఉంటాయి. కేంద్రంలో స్టేట్ హ్యాండ్లూమ్ ప్రదర్శన, ఫుడ్ కోర్టు, ఎగ్జిబిషన్ నిర్వహణకు స్థలం  వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. న్యూఢిల్లీలోని జె ఎన్ యులో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల కోసం రూ.28.675 కోట్ల అంచనా వ్యయంతో, బాలురు, బాలికలకు 214 గదులతో పాటు ఆధునిక సౌకర్యాలతో కూడిన బరాక్ హాస్టల్ నిర్మాణంతో ఎక్కువ మంది ఈశాన్య ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

సమ్మేళనాన్ని ఉద్దేశించి కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ, ఈశాన్య ప్రాంతం లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్న అవకాశాలను, అపరిమితమైన సామర్థ్యాన్ని, ప్రాంత గొప్ప సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించడానికి సమ్మేళనం ఒక అద్భుతమైన అవకాశం అని అన్నారు. పదేళ్లలో భారత ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ప్రాంతంలోని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ప్రజల ఆరోగ్య అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి అత్యాధునిక కేన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. దీని వల్ల వారు చికిత్స కోసం దూర ప్రయాణాల ఇబ్బందిని తప్పించుకుని అత్యున్నత సౌకర్యాలను పొందవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పనలో గణనీయమైన పెట్టుబడులతో సహా గత దశాబ్దంలో సాధించిన విజయాలను ఆయన వివరించారు. ఇందులో విద్యా సంస్థల నుండి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, క్రీడా మౌలిక సదుపాయాలుకలదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్ట్త్రైపాక్షిక హైవే ప్రాజెక్ట్ వంటి అంతర్జాతీయ కనెక్టివిటీ ప్రాజెక్టుల వరకు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి, ఇవి ప్రాంతీయ సహకారానికి ప్రతీక.

ఈశాన్య సమ్మేళన్ లో కేంద్ర సహాయ మంత్రి శ్రీ బి.ఎల్.వర్మ ప్రసంగిస్తూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  దేశ అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాల కీలక పాత్రను గుర్తించడమే కాకుండా వాటి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారని,   సమగ్ర జాతీయ అభివృద్ధికి వేదికను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రాంతం ఉద్ధరణకుమొత్తం దేశానికి సమ్మిళిత వృద్ధిని పెంపొందించడానికి ఇది అంకితమైన నిబద్ధతను సూచిస్తుందని, ముఖ్యంగా అష్ట లక్ష్మి ప్రాంతీయ అభివృద్ధి కోసం సమర్థవంతమైన పాలనచొరవలను చాటుతోందని అన్నారు.

కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు తన ప్రసంగంలోఎన్ఇ విద్యార్థుల కోసం జె ఎన్ యు లో బరాక్ హాస్టల్  ప్రారంభించడం న్యూఢిల్లీలోని ద్వారకాలో నార్త్ ఈస్టర్న్ కల్చర్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూట్ కు శంకుస్థాపన సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు, ప్ర ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ముందు చూపు నాయకత్వంలో ప్రభుత్వం 'ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్ ' విజన్ తో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. క్షేత్రస్థాయిలో పథకాల పురోగతిని పర్యవేక్షించడానికి మంత్రిమండలి ప్రతి నెల ప్రాంతంలో పర్యటిస్తుంది. శాంతికి, ఈశాన్య అభివృద్ధికి మధ్య ఉన్న కీలక సంబంధాన్ని నొక్కిచెప్పిన ఆయన ఇందులో యువత కీలక పాత్ర అవసరాన్ని వివరించారు. ప్రజల నేతృత్వంలోని అభివృద్ధి ద్వారా మాత్రమే ప్రాంతంలో నిజమైన పురోగతి సాధ్యమని స్పష్టం చేశారు. ప్రాంతంలో సుస్థిర శాంతి కీలక అవసరాన్ని నొక్కి చెప్పారు.

ఈశాన్య ప్రాంతాలకు రోడ్ మ్యాప్ ,అభివృద్ధికి సంబంధించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను ప్రదర్శించే ప్రత్యేక వీడియోలను సమ్మేళన్ లో ప్రదర్శించారు. కార్యక్రమంలో గత దశాబ్దంలో ఈశాన్య ప్రాంతంలో సాధించిన క్రింది విజయాలను ప్రముఖంగా తెలిపే వీడియోలను కూడా ప్రదర్శించారు.

 

  • విద్యకు రూ.21,151 కోట్ల పెట్టుబడి, 843 పాఠశాలల ఏర్పాటు, 25,64,628 మంది ఉపాధ్యాయులకు నైపుణ్యం పెంపు, ప్రాథమిక విద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలక విజయాలుగా పేర్కొన్నారు.
  • ఎయిమ్స్ అస్సాం, ఐఐఎంసీ మిజోరం, మణిపూర్ లోని భారతదేశపు మొట్టమొదటి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం వంటి సంస్థల ద్వారా ఉన్నత విద్య లో పురోగతిని ప్రదర్శించారు.
  •  రూ.31,794 కోట్లు ఖర్చు చేయడం, తొలి ఎయిమ్స్ ప్రారంభోత్సవం, 19 స్టేట్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ లకు ఆమోదం, 387 ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్ సౌకర్యాల అనుసంధానం వంటివి ఆరోగ్య సంరక్షణ విజయాలలో ఉన్నాయి.
  •  సిక్కింలో సేంద్రియ వ్యవసాయం కోసం 1.55 లక్షల హెక్టార్లను ఉపయోగించడం, పీఎంకేఎస్ వై కింద రూ.1,432 కోట్ల ఆమోదం, వాన్ ధన్ వికాస్ యోజనను ప్రారంభించడం వంటివి వ్యవసాయ మైలురాళ్లలో ఉన్నాయి.
  • యూత్/స్పోర్ట్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సాధించిన విజయాల్లో నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ, 203 స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, 207 మంది క్రీడాకారుల గుర్తింపు ఉన్నాయి.
  • కొత్త ఉపాధి కల్పన ప్రయత్నాల ఫలితంగా 3,49,291 ఉద్యోగాలు లభించాయి. రూ .100 కోట్లతో ఈశాన్య వెంచర్ ఫండ్ ప్రారంభించబడింది.
  •  విద్యుత్, ఇంధనం, పెట్రోలియం సహజ వాయువు రంగాల విజయాలలో విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం రూ.37,092 కోట్లు మంజూరు, 77.41 లక్షల గృహాలకు విద్యుదీకరణ, ఈశాన్య గ్యాస్ గ్రిడ్ ప్రాజెక్టు ఉన్నాయి.
  •  సుపరిపాలన పురోగతిలో ప్రధాన మంత్రి పర్యటనలు, "nesetu.mdoner.gov.in" పోర్టల్ ప్రారంభం, 'ఫీల్డ్ టెక్నికల్ సపోర్ట్ యూనిట్ల' మోహరింపు ఉన్నాయి.
  •  స్వదేశీ దర్శన్, ప్రసాద్ పథకాలకు రూ.1502.48 కోట్లు మంజూరు చేయడం, 'డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ 2020' ప్రారంభించడం వంటివి పర్యాటక కార్యక్రమాల్లో ఉన్నాయి.
  •  యాక్ట్ ఈస్ట్ ప్రాజెక్టులు కలదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్ట్త్రైపాక్షిక హైవే ప్రాజెక్ట్ వంటి అంతర్జాతీయ కనెక్టివిటీపై దృష్టి పెట్టాయి. ఇవి వాణిజ్యం , పర్యాటకాన్ని పెంచుతాయి.
  • 2023 లో ప్రారంభించిన అగర్తలా-అఖౌరా రైల్వే లింక్ , భారతదేశం-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ మరింత ప్రాంతీయ సహకారాన్ని సూచిస్తాయి.
  • 2023 లో ప్రారంభించిన అగర్తలా-అఖౌరా రైల్వే లింక్ మరియు భారతదేశం-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ మరింత ప్రాంతీయ సహకారాన్ని సూచిస్తాయి.

హస్తకళలు, చేనేత, వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు, స్టార్టప్ లను ప్రదర్శించే ఎగ్జిబిషన్ ను మంత్రులు సందర్శించి అక్కడి కళాకారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ముచ్చటించారు.

చివరిలో విభిన్న సంప్రదాయ నృత్యాలతో సాగిన సాంస్కృతిక ప్రదర్శన  కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుందిఈశాన్య రాష్ట్రాల అసమాన సామర్థ్యాన్ని వెలికితీసేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కార్యక్రమాలు సమష్టిగా ప్రతిబింబిం చాయి. పేర్కొన్న విజయాలు కేవలం మైలురాళ్లు మాత్రమే కాదు, ప్రాంతానికి ఉజ్వలమైనమరింత సుసంపన్నమైన భవిష్యత్తు దిశగా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.

****


(Release ID: 2002642) Visitor Counter : 104