రైల్వే మంత్రిత్వ శాఖ
జాతీయ పోలీసు స్మారకంలో ఆర్‌పిఎఫ్ నెలరోజుల పాటు నిర్వహించే కార్యక్రమ ప్రారంభోత్సవం
పోలీసు అమరవీరులకు కృతజ్ఞతలు, గౌరవం తెలపడం కోసం, వారి కుటుంబ సభ్యులను సత్కరించడం కోసం ప్రతివారాంతంలో ఒక గొప్ప వేడుకను నిర్వహిస్తున్న ఎన్‌పిఎం
ఫిబ్రవరిలోని అన్ని వారాంతాలలో ఎన్‌పిఎంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్న ఆర్‌పిఎప్
Posted On:
04 FEB 2024 2:42PM by PIB Hyderabad
జాతీయ భద్రతను నిర్వర్తిస్తూ తమ ప్రాణాలను త్యాగం చేసిన సిపిఒలు/ సిఎపిఎఫ్‌లు/ రాష్ట్ర పోలీసు సిబ్బందిని గౌరవించే జాతీయ కృషిలో భాగమే ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్ (ఎన్‌పిఎం- జాతీయ పోలీసు స్మారకం). సరిహద్దులలోనూ, లోతట్టు ప్రాంతాలలో తీవ్రవాదం, ఉగ్రవాదం, నేరాలపై పోరాడే సమయంలోనూ, శాంత్రి భద్రతలు, జాతీయ ఆస్తులను కాపాడడం, విపత్తుల నివారణ తదితరాలను నిర్వహించే మన పోలీసులకు ఒక ఘన నివాళిగా ఈ స్మారకం నిలుస్తుంది.
ఎన్‌పిఎం ప్రతివారాంతంలో పోలీసు అమరవీరులకు కృతజ్ఞతలు తెలుపుతూ, గౌరవ సూచకంగా ఒక గొప్ప వేడుకను నిర్వహించి, వారి కుటుంబ సభ్యులను సత్కరిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఒక నెలరోజుల పాటు నిర్వహించే బాధ్యతను ఒక కేంద్ర పోలీసు దళానికి రొటేషన్ పద్ధతిలో అప్పగిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 2024న రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (రక్షణ దళం) నిర్వహిస్తోంది.
రైల్వే మంత్రిత్వ శాఖ సాయుధ దళమైన ఆర్‌పిఎప్ ప్రాణాలను కాపాడే, అవసరంలో ఉన్నవారికి సహాయపడుతూ మిషన్లతో పాటు, మానవ అక్రమ రవాణా, మత్తుపదార్ధాల స్మగ్లింగ్‌పై పోరాడుతుంది. 2023వ సంవత్సరంలో ఈ దళం 3719 ప్రాణాలను కాపాడి, 11794మంది పిల్లలను, ఆపదలో ఉన్న 3492 వయోజనులను రక్షించి, 1084మంది బాధితులను అక్రమ మానవ రవాణాదారుల కబంధ హస్తాల నుంచి కాపాడి, 257మంది మానవ అక్రరవాణాదారులను, 922 మత్తుపదార్దాలను అక్రమంగా రవాణా చేసేవారిని అరెస్టు చేసింది. సేవా హి సంకల్ప్ అన్న లక్ష్యంతో దళం పని చేస్తుంది.
రైల్వే ఆస్తుల భద్రతకు ఏకైక బాధ్యులుగా ఉన్న ఈ దళం ఇప్పుడు రైల్వే ప్రయాణికుల రక్షణకు కట్టుబడి ఉన్నదానిగా పరివర్తన చెందింది. ఆర్‌పిఎఫ్ అచంచలమైన అంకిత భావాన్ని గుర్తిస్తూ, ఆర్‌పిఎఫ్ సిబ్బంది శౌర్యానికి 3 రాష్ట్రపతి పోలీసు పతకాలు, 19 పోలీసు మెడల్స్ ఫర్ గ్యాలంట్రీ, విశిష్ట సేవలకు 94 రాష్ట్రపతి పతకాలు, ప్రశస్తమైన సేవలకు 942 పతకాలను ఇచ్చి గౌరవించారు.
నెలరోజుల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని గనంగా ప్రారంభిస్తూ, న్యూఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారకం వద్ద ఫిబ్రవరి 3,2024న పోలీసు స్మారకం వద్ద పుష్ప గుచ్ఛాన్ని ఉంచడం, బ్యాండ్ ప్రదర్శన, రిట్రట్ వంటి వివిధ కార్యకలాపాలతో ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఆగ్నేయ రైల్వే ఐజి కమ్ పిసిఎస్‌సి/ ఆర్‌పిఎఫ్ శ్రీ సంజయ్ కుమార్ మిశ్రా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సవాళ్ళతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటూ అసాధారణమైన ధైర్యానికి, పరాక్రమానికి ప్రతికలుగా అమరవీరులు ఉంటారు. భారతీయ రైల్వేలను, అందులోని ప్రయాణీకులను కాపాడేందుకు విధిలో భాగంగా తీవ్రవాదులపై, జాతి వ్యతిరేక శక్తులపై, నేరగాళ్ళతో పోరాటం చేసే సమయంలో తమ జీవితాలను త్యాగం చేసే సిబ్బంది, అధికారులతో కూడిన గొప్ప వారసత్వం ఆర్‌పిఎఫ్‌కు ఉంది. దాదాపు 1000కి పైగా ఆర్‌పిఎఫ్/ ఆర్‌పిఎస్ఎఫ్ సిబ్బంది తమ విధుల నిర్వహణలో అత్యున్నత త్యాగం చేశారు.
వారు చేసిన త్యాగాలకు గుర్తింపుగా, దేశంలోని నలుమూలలకు చెందిన అమరవీరుల కుటుంబాలను ఆహ్వానిస్తారు. దళ సిబ్బంది కుటుంబాలతో పాటుగా, వారు కూడా జాతీయ పోలీసు స్మారకం వద్ద అమరవీరులకు పుష్పాంజలి ఘటించి, ఆవరణలోని మ్యూజియంను సందర్శించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిధి అమరవీరుల కుటుంబాలను సత్కరించారు. అనంతరం ఆకట్టుకునే బ్యాండ్ ప్రదర్శన జరిగింది.
ఫిబ్రవరి 2024లో ప్రతి శనివారం, ఆదివారం ఎన్‌పిఎంలో ఆర్‌పిఎఫ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని కొనసాగించనుంది.
***
(Release ID: 2002453)
Visitor Counter : 100