రైల్వే మంత్రిత్వ శాఖ
2024 జనవరి నాటికి 1297.38 ఎంటీ సరుకులు రవాణా చేసిన భారత రైల్వే
గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 53.92 ఎంటీ పెరిగిన సరుకుల రవాణా
2023 ఏప్రిల్-2024 జనవరి మధ్య కాలంలో సరుకుల రవాణా ద్వారా 140623.4 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించిన రైల్వే
గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 5235.30 కోట్ల మేర పెరిగిన సరుకు రవాణా ఆదాయం
గత ఏడాది జనవరి తో పోల్చి చూస్తే 6.43% వృద్ధి సాధించి 22024 జనవరి లో 142.70 ఎంటీ సరుకులు రవాణా చేసిన రైల్వే
Posted On:
02 FEB 2024 3:51PM by PIB Hyderabad
2023 ఏప్రిల్- 2024 జనవరి మధ్య కాలంలో భారతీయ రైల్వే 1297.38 ఎంటీ సరుకులు రవాణా చేసింది. గత ఏడాది ఇదే కాలంలో రైల్వే ద్వారా 1243.46 ఎంటీ సరుకులు రవాణా అయ్యాయి. గత ఏడాదితో పోల్చి చూస్తే 2023 ఏప్రిల్- 2024 జనవరి మధ్య కాలంలో సరుకు రవాణా 53.42 ఎంటీ పెరిగింది. 2023 ఏప్రిల్-2024 జనవరి మధ్య కాలంలో సరుకుల రవాణా ద్వారా 140623.4 కోట్ల రూపాయల ఆదాయం రైల్వేకు సమకూరింది. గత ఏడాది ఇదే కాలంలో సరుకు రవాణా ద్వారా రైల్వేకు 135388.1 కోట్ల రూపాయల ఆద్యం వచ్చింది. గత ఏడాదితో పోల్చి చూస్తే రైల్వే ఆదాయం దాదాపు 5235.30 కోట్ల రూపాయలు పెరిగింది.
2024 జనవరి నెలలో 142.70 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరిగింది. 2023 జనవరిలో 134.07 మెట్రిక్ టన్నుల సరుకులు రవాణా అయ్యాయి.2024 జనవరి లో గత సంవత్సరంతో పోలిస్తే సరుకుల రవాణా సుమారు 6.43% పెరిగింది. 2023 జనవరి లో సరుకుల రవాణా ద్వారా రూ.14908.82 కోట్ల ఆదాయం వచ్చింది. , 2024 జనవరి లో రూ.15514.82 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం 4.06 శాతం వృద్ధిని కనబరిచింది.
2024 జనవరి లో 71.45 మెట్రిక్ టన్నుల బొగ్గు,17.01 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం, 6.07 మెట్రిక్ టన్నుల పిగ్ ఐరన్ ఉక్కు ఉత్పత్తులు, 7.89 మెట్రిక్ టన్నుల సిమెంట్ ( క్లింకర్ కాకుండా ),5.52 మెట్రిక్ టన్నుల క్లింకర్, 4.53 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు, 5.27 మెట్రిక్ టన్నుల ఎరువులు, 4.31 మెట్రిక్ టన్నుల మినరల్ ఆయిల్, కంటైనర్లలో 10.20 మెట్రిక్ టన్నుల సరుకులు,ఇతర సరుకులు రైల్వే ద్వారా రవాణా అయ్యాయి.
"హంగ్రీ ఫర్ కార్గో" అనే విధానాన్ని అనుసరిస్తున్న రైల్వే శాఖ వ్యాపారాన్ని సులభతరం చేయడానికి, పోటీ ధరలలో సేవలను మెరుగుపరచడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. వినియోగదారుల అవసరాల మేరకు కేంద్రీకృత విధానం ,వ్యాపార అభివృద్ధి యూనిట్ల సహకారంతో చురుకైన విధాన రూపకల్పన ద్వారా రైల్వే శాఖ ప్రగతి పట్టాలపై పరుగులు తీస్తోంది.
***
(Release ID: 2001986)
Visitor Counter : 116