రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

వాయుశక్తి-2024 విన్యాసాలు

Posted On: 02 FEB 2024 3:12PM by PIB Hyderabad

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌), ఈ నెల 17న, జైసల్మేర్ సమీపంలోని పోఖ్రాన్ వద్ద వాయుశక్తి-24 విన్యాసాలు నిర్వహించనుంది. గత విన్యాసాలు 2019 ఫిబ్రవరి 16న జరిగాయి. ఎప్పటిలాగే, వాయుశక్తి విన్యాసాలను పగటి సమయంతో పాటు రాత్రి సమయంలోనూ చేపడతారు. వైమానిక దళం వీరత్వం, రక్షణ సామర్థ్యాలను అవి ప్రపంచానికి చాటి చెబుతాయి. భారత సైన్యం కూడా ఈ విన్యాసాల్లో పాల్గొంటుంది.

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్, ప్రచండ్‌, ధ్రువ్‌ సహా 121 విమానాలు ఈ సంవత్సరం వాయుశక్తిలో పాల్గొంటాయి. రాఫెల్, మిరాజ్-2000, సుఖోయ్-30, జాగ్వార్, హాక్, సి-130జే, చినూక్, అపాచీ, ఎంఐ-17 కూడా ఈ జాబితాలో ఉన్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఆయుధ వ్యవస్థలు ఆకాశ్‌, సమర్‌ కూడా విన్యాసాల్లో పాలుపంచుకుంటాయి, చొరబాటు విమానాన్ని కనిపెట్టి కూల్చివేయగల సత్తాను అవి ప్రదర్శిస్తాయి. సంప్రదాయ ఆయుధాలను కూడా ఖచ్చితత్వంతో, సరైన సమయంలో, విధ్వంసక ప్రభావంతో ప్రయోగించగల ఐఏఎఫ్‌ సామర్థ్యాన్ని వాయశక్తి చాటుతుంది. గరుడలతో కూడిన ఐఏఎఫ్‌ రవాణా, హెలికాప్టర్లు, భారత సైన్యంతో కలిసి ప్రత్యేక విన్యాసాలు ప్రదర్శిస్తాయి.

 

*** (Release ID: 2001984) Visitor Counter : 191