బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ ఏడాది జనవరిలో ఉత్పత్తి ప్రారంభించిన రెండు కొత్త బొగ్గు గనులు


జనవరిలో 14.30 మిలియన్‌ టన్నులకు చేరుకున్న క్యాప్టివ్/వాణిజ్య బొగ్గు గనుల ఉత్పత్తి

బొగ్గు పంపిణీలో 27% వృద్ధి

Posted On: 01 FEB 2024 2:56PM by PIB Hyderabad

మొత్తం 7.5 మిలియన్ టన్నుల పీఆర్‌సీతో, ఈ ఏడాది జనవరిలో రెండు కొత్త బొగ్గు గనులు ఉత్పత్తిని ప్రారంభించాయి. దీనివల్ల, ఉత్పత్తి జరుగుతున్న బొగ్గు గనుల సంఖ్య 51 నుంచి 53కి పెరిగింది. 2023 మార్చి 31 నాటికి, ఉత్పత్తిలో ఉన్న మొత్తం క్యాప్టివ్/వాణిజ్య గనుల సంఖ్య 47గా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మరో ఆరు గనుల్లో ఉత్పత్తి ప్రారంభమైంది, మొత్తం సంఖ్య 53కు చేరింది. ఈ 53 గనుల్లో, 33 గనులు సొంత (క్యాప్టివ్) విద్యుత్ వినియోగం కోసం, 12 గనులు అనియంత్రిత రంగంలో క్యాప్టివ్ వినియోగం కోసం, 8 గనులు వాణిజ్య విక్రయాల కోసం ఉన్నాయి.

2024 జనవరిలో, క్యాప్టివ్ & వాణిజ్య బొగ్గు గనుల నుంచి జరిగిన మొత్తం బొగ్గు ఉత్పత్తి దాదాపు 14.30 మిలియన్‌ టన్నులు. అంతకుముందు సంవత్సరం ఇదే నెలలోని 11.06 మి.ట.తో పోలిస్తే, సంవత్సరంలో 29% వృద్ధి సాధ్యమైంది. మొత్తం బొగ్గు పంపిణీ 12.86 మి.ట. కాగా, 2023 జనవరిలో 10.12 మి.ట. నుంచి 27% పెరిగింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల్లో, 2023 ఏప్రిల్ 01 నుంచి 2024 జనవరి 31 వరకు, క్యాప్టివ్ & వాణిజ్య బొగ్గు బ్లాకుల నుంచి బొగ్గు ఉత్పత్తి & పంపిణీ వరుసగా 112 మి.ట. & 116 మి.ట.కు పెరిగింది. FY 2022-23 అదే కాలంతో పోలిస్తే వరుసగా సంవత్సరంలో దాదాపు 26% & 31% వృద్ధిని సూచిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో క్యాప్టివ్, వాణిజ్య బొగ్గు గనుల నుంచి మొత్తం ఉత్పత్తి 116.55 మి.ట. ఈ నెల మొదటి 2 వారాల్లోనే ఈ గణాంకాలను బొగ్గు ఉత్పత్తి అధిగమిస్తుంది, రికార్డ్‌ నెలకొల్పుతుంది.

ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, దేశంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. బొగ్గు ఉత్పత్తి & పంపిణీని మరింత పెంచడానికి, కొత్త బొగ్గు గనుల్లో సకాలంలో ఉత్పత్తి ప్రారంభం కావడానికి చర్యలు తీసుకుంటోంది.

***


(Release ID: 2001725) Visitor Counter : 169