ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశాని కి, యునైటెడ్ అరబ్ఎమిరేట్స్  కు మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒడంబడిక పై సంతకాలు చేసేందుకుమరియు ఆ ఒడంబడిక ను ధ్రువపరచడానికి ఆమోదాన్ని తెలిపిన మంత్రిమండలి

प्रविष्टि तिथि: 01 FEB 2024 11:39AM by PIB Hyderabad

భారత గణతంత్ర ప్రభుత్వాని కి మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వాని కి మధ్య ఒక ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి మరియు ఆ యొక్క ఒప్పందాన్ని ధ్రువ పరచడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి తన ఆమోదాన్ని తెలియ జేసింది

 

ఈ ఒడంబడిక ఇన్‌వెస్టర్ లలో, ప్రత్యేకించి పెద్ద ఇన్‌వెస్టర్ లలో విశ్వాసాన్ని మెరుగు పరచడం ద్వారా విదేశీ పెట్టుబడుల అవకాశాల తో పాటు గా ఓవర్‌సీస్ డైరెక్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్ (ఒడిఐ) అవకాశాల ను కూడా అధికం చేయగలదని, అంతేకాక దీని ద్వారా ఉద్యోగ కల్పన పై సకారాత్మక ప్రభావం ప్రసరించవచ్చని ఆశించడమైంది.

 

ఆత్మనిర్భర్ భారత్ ను ఆవిష్కరించాలి అనేటటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం లో భాగం గా భారతదేశం లో పెట్టుబడులు అధికం కావడాని కి బాట ను పరచడం తో పాటుగా దేశీయంగా తయారీ ని ప్రోత్సహించడం, దిగుమతుల పై ఆధారపడడాన్ని తగ్గించడం, ఎగుమతుల ను వృద్ధి చెందింప చేయడం మొదలైన మార్గాల లో ఈ ఆమోదం సహాయకారి కాగలదన్న అంచనా ఉంది.

 

***


(रिलीज़ आईडी: 2001118) आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali-TR , Punjabi , Gujarati , Malayalam