వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్థానిక ఈ కామర్స్ ను ప్రోత్సహించడం ద్వారా చేతివృత్తులు, రైతుల ఉత్పత్తులకు తగిన గుర్తింపు, ప్రచారం తీసుకురావడానికి పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ శాఖ(డీపీఐఐటీ) దేశవ్యాప్తంగా 'ఒక జిల్లా ఒక ఉత్పత్తి సంపర్క్' కార్యక్రమాలను నిర్వహిస్తోంది.


కేంద్రం మరియు స్థానిక అమ్మకందారుల మధ్య సహకారాన్ని సులభతరం చేయడానికి, స్వదేశీ పరిశ్రమలను పునరుద్ధరించడానికి 15 రాష్ట్రాల్లో ' 'ఒక జిల్లా ఒక ఉత్పత్తి సంపర్క్'' వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు.

ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడానికి 'ఒక జిల్లా ఒక ఉత్పత్తి సంపర్క్' చొరవను పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ శాఖ(డీపీఐఐటీ) ప్రోత్సహిస్తుంది.

Posted On: 31 JAN 2024 1:42PM by PIB Hyderabad

పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రచార శాఖ (డీపీఐఐటీ)  'ఒక జిల్లా ఒక ఉత్పత్తి సంపర్క్' చొరవ కింద దేశవ్యాప్తంగా ఈవెంట్‌లను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వెలువడుతున్న విజయ గాథలను ప్రదర్శించడంతోపాటు అవగాహన కల్పిస్తాయి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాలకు అనుగుణంగా, ఈ కథనాలు ‘ఆత్మనిర్భరతా’ లేదా స్వావలంబన మరియు స్వదేశీ పరిశ్రమల పునరుద్ధరణకు సంబంధించిన గాథలను ఉదాహరణల ద్వారా వివరిస్తాయి. వర్క్‌షాప్‌లు జిల్లాలు, రాష్ట్రాలు మరియు కేంద్రం మధ్య సహకార ప్రయత్నాలను నొక్కిచెబుతాయి. సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని పెంపొందించడానికి నిబద్ధతను చాటిచెబుతాయి.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, జమ్మూ & కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, నాగాలాండ్, గోవా, మహారాష్ట్ర మరియు మేఘాలయ వంటి 15 రాష్ట్రాలలో ఇప్పటివరకు జరిగిన వర్క్‌షాప్‌లు ఒక జిల్లా ఒక ఉత్పత్తి సంపర్క్ ఈవెంట్లను విజయవంతంగా ప్రదర్శించాయి. ఇంగ్లిష్, హిందీ మరియు ప్రాంతీయ భాషలతో సహా బహుళ భాషలలో స్థానిక మరియు జాతీయ వార్తాపత్రికల ద్వారా విజయ కథనాలు ప్రచారం చేశాయి. ఒక జిల్లా ఒక ఉత్పత్తి సంపర్క్ యొక్క ప్రత్యక్ష ప్రభావం వర్క్‌షాప్‌లలో విక్రేతలతో ప్రత్యక్ష పరస్పర చర్యల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మార్కెట్ అనుసంధానాలలో గుర్తించబడిన ఖాళీలు పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రచార శాఖ(డీపీఐఐటీ)  ద్వారా క్రియాశీలక కార్యక్రమాలను ప్రోత్సహించాయి. ఈ కార్యక్రమాలు ఇ- కామర్స్ ఆన్‌బోర్డింగ్‌కు మద్దతును అందించడం, ఒక జిల్లా ఒక ఉత్పత్తి విధానాలను రూపొందించడానికి రాష్ట్రాలతో సహకరించడం, ప్యాకేజింగ్ వ్యూహాలను మెరుగుపరచడం మరియు దేశీయ మరియు ప్రపంచ స్థాయి ప్రచారాన్ని పెంచడానికి కేంద్ర స్థాయిలో విక్రేతల మధ్య అనుసంధానతను సులభతరం చేయడం వంటి ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.

ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం యొక్క ఒక జిల్లా ఒక ఉత్పత్తి సంపర్క్ చొరవ గురించి చాలా మంది కళాకారులు..  రైతులకు అవగాహన కల్పించారు. ఈ ఈవెంట్‌లకు హాజరైనవారు సాంస్కృతిక ప్రదర్శనలో మునిగిపోతారు, విభిన్న శ్రేణి స్థానిక సమర్పణలను కీర్తిస్తూ చేసే ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా ప్రతి రాష్ట్రం యొక్క ప్రసిద్ధ ఉత్పత్తుల గొప్పతనాన్ని తెలుసుకుంటారు. వర్క్‌షాప్‌లు బహుళ లక్ష్యాలను అందిస్తాయి.  రాష్ట్ర మరియు కేంద్ర పథకాలను చర్చించడానికి, సందేహాలు మరియు సవాళ్లను పరిష్కరించడానికి, ఉత్పత్తులను ప్రదర్శించడానికి మరియు కళాకారులు మరియు రైతులకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాల గురించి అవగాహన పెంచడానికి ఒక వేదికను అందిస్తాయి.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రచార శాఖ (డీపీఐఐటీ) ప్రారంభించిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి సంపర్క్, ప్రభుత్వ అధికారులు, ఒక జిల్లా ఒక ఉత్పత్తి విక్రేతలు, మీడియా ప్రతినిధులు మరియు ముఖ్య వాటాదారులతో సహా వివిధ వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించే ఒక విలక్షణమైన వేదికగా ఉద్భవించింది. ఈ ఈవెంట్‌లు నిజ-సమయ అంతర్దృష్టులకు, సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు స్థానిక పరిశ్రమలు ఎదుర్కొంటున్న అవకాశాలను అన్వేషించడానికి, తక్షణ వృద్ధికి మరియు అభివృద్ధికి దోహదపడటానికి సరైన వేదికను అందిస్తాయి.

రాష్ట్రాల్లోని ప్రతి జిల్లా నుండి ఒక ఉత్పత్తిని ప్రాథమిక ఉత్పత్తిగా కలిగి ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ ఉత్పత్తులను గుర్తించిన జిల్లాలు వాటిని ద్వితీయ లేదా తృతీయ ఉత్పత్తులుగా వర్గీకరించాయి. ఈ ఉత్పత్తులు వ్యవసాయం, తయారీ, చేనేత మరియు టెక్స్‌టైల్స్, హస్తకళ, ఫుడ్ ప్రాసెసింగ్, మెరైన్ మరియు సేవలతో సహా వివిధ రంగాల క్రింద ఉన్నాయి.

ఒక జిల్లా ఒక ఉత్పత్తి సంపర్క్ అభివృద్ధి చెందుతూనే ఉన్నందున..  వర్క్‌షాప్‌లు విజయగాథలను కీర్తిస్తూ ప్రచారం చేయడం మాత్రమే కాకుండా సవాళ్లను పరిష్కరించడంలో మరియు దేశవ్యాప్తంగా ఒకజిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమాల కోసం మరింత సమగ్రమైన మరియు అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థకు మార్గం సుగమం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

***


(Release ID: 2001017) Visitor Counter : 147