పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఫిబ్రవరి 9 మరియు10 తేదీల్లో న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద లైఫ్ థీమ్ పై హరిత జాతీయ ప్రదర్శన మరియు కార్యక్రమాలు జరగనున్నాయి
పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మద్దతుతో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, భారతదేశం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
Posted On:
31 JAN 2024 1:06PM by PIB Hyderabad
2024 ఫిబ్రవరి 9 మరియు 10వ తేదీల్లో ఢిల్లీలోని ఇండియా గేట్‌లో లైఫ్ (లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్) థీమ్‌లపై పర్యావరణ అనుకూల కార్యకలాపాల జాతీయ ప్రదర్శన మరియు కార్యక్రమం నిర్వహించబడుతోంది. లైఫ్ (LiFE) ప్రజల దైనందిన జీవితంలో సరళమైన మరియు సమర్థవంతమైన పర్యావరణ అనుకూలమైన చర్యలను చేపట్టేవిధంగా ప్రేరేపించడానికి భారతదేశం నేతృత్వంలోని ప్రపంచ వ్యాప్త ఉద్యమం. పర్యావరణ స్పృహతో కూడిన జీవనశైలి పట్ల వ్యక్తిగత మరియు సామూహిక చర్యకు దారితీసే ప్రవర్తనా మార్పును యువతలో ఎలా ప్రేరేపించగలదో ఈవెంట్ హైలైట్ చేస్తుంది.
విద్యుత్ మరియు నీటిని ఆదా చేయడం, వ్యర్థాలను తగ్గించడం, సుస్థిరమైన ఆహార వ్యవస్థలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు నో చెప్పడం, సమీప ప్రయాణాలకు సైకిళ్లను ఉపయోగించడం, వృధాగా ప్రవహిస్తున్న ట్యాప్‌లను ఆఫ్ చేయడం, స్థానికంగా లభించే ఆహారపదార్థాలు తీసుకోవడం, సహజ లేదా సేంద్రియ ఉత్పత్తులను ఉపయోగించడం, చెట్లను నాటడం, వ్యర్థాలను తగ్గించడం మరియు ఇంట్లో తడి మరియు పొడి చెత్తను వేరు చేయడం వంటి లైఫ్ ఇతివృత్తాలు (LiFE) పర్యావరణ అనుకూలచర్యలకు కొన్ని ఉదాహరణలు.
ఈవెంట్ కార్యకలాపాలలో సైకిల్ ర్యాలీ ఉంటుంది, ఇది పర్యావరణ అనుకూలమైన మరియు ఆరోగ్యకరమైన రవాణా మార్గాల సౌలభ్యం మరియు ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఇండియా గేట్ చుట్టూ సుందరమైన మార్గంలో ర్యాలీ సాగనుంది. పాల్గొనేవారికి సైకిళ్ళు అందించబడతాయి; పాల్గొనేవారు తమ సొంత సైకిళ్లను కూడా తీసుకురావచ్చు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత మరియు పర్యావరణ బాధ్యతాయుత ప్రవర్తనపై ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో ఆలోచనలను రేకెత్తించే వీధి నాటకాలను ప్రదర్శించే శక్తివంతమైన సాంస్కృతిక ప్రదర్శన ఉంటుంది.
కళాత్మక నైపుణ్యం ఉన్నవారి కోసం, అదే ప్రాంగణం లో ముఖ చిత్రలేఖనం పెయింటింగ్ మరియు పోస్టర్ మేకింగ్ పోటీ నిర్వహించబడుతుంది, పాల్గొనేవారికి వారి పర్యావరణ సందేశాలను వర్ణ భరితంగా సృజనాత్మకంగా వ్యక్తీకరణను అందిస్తుంది. వివిధ లైఫ్ థీమ్‌లను ఎలా ప్రాక్టీస్ చేయవచ్చో వివరంగా చూపించే ప్రదర్శన నమూనాలు కూడా ఉంటాయి. 'ఎకో-ఫ్యాషన్ షో', స్థిరమైన మరియు పర్యావరణ స్పృహతో కూడిన దుస్తులపై రన్‌వే ఈవెంట్, ఫ్యాషన్ స్టైలిష్ మరియు పర్యావరణ అనుకూలమైనదిగా ఉందగలదని చూపిస్తుంది.
సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో మన దేశం యొక్క గొప్ప సంస్కృతి యొక్క శక్తివంతమైన వస్త్రాల సౌందర్యం లో సందర్శకులుమునిగిపోతారు, ప్రకృతి మరియు సమాజం ఎలా సామరస్యపూర్వకంగా సహజీవనం చేయగలదో మరియు అభివృద్ధి చెందుతాయో తెలుసుకుంటారు.
రోజు వారీగా కార్యకలాపాలు క్రింది విధంగా ఉన్నాయి:
ఫిబ్రవరి 9
సైకిల్ ర్యాలీ
సాంస్కృతిక కార్యక్రమాలు
నుక్కడ్ నాటకం/వీధి నాటకాలు
'ఎకో-ఫ్యాషన్' షో
ఫిబ్రవరి 10
ఆన్-ది-స్పాట్ ఫేస్ పెయింటింగ్ పోటీ
అక్కడికక్కడే పోస్టర్ మేకింగ్ పోటీ
పర్యావరణ అనుకూల ప్రవర్తన యొక్క ప్రదర్శన నమూనాలు
ఫోటోగ్రఫీ ప్రదర్శన
కార్యకలాపాలు, పోటీ మరియు ప్రవేశ నియమాల వివరాల కోసం దయచేసి https://forms.gle/xo3kdmKAtJL1a4PB8 లింక్ ని సందర్శించండి. సంస్థలు/పాఠశాలలు తమ విద్యార్థులను పోటీల్లో పాల్గొనేలా చేయాలనే ఆసక్తి ఉన్నవారు కూడా ఈ ఫారమ్‌ను ఉపయోగించవచ్చు. ఈవెంట్ అందరికీ ఆహ్వానం పలుకుతుంది మరియు ప్రవేశం ఉచితం.
భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన పర్యావరణ సమాచారం, అవగాహన, సామర్థ్య పెంపు మరియు జీవనోపాధి కార్యక్రమం కింద రిసోర్స్ పార్టనర్ అయిన వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ( డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్) ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
***
(Release ID: 2001015)
Visitor Counter : 299