ఆర్థిక మంత్రిత్వ శాఖ
పిఎఫ్ఆర్‌డిఎ - ట్రేస్ (ట్రాకింగ్ రిపోర్టింగ్ అనలిటిక్స్ & కంప్లయన్స్ ఇ- ప్లాట్‌ఫారమ్) రూపకల్పన, అభివృద్ధి అమలు, నిర్వహణ కోసం సిస్టం ఇంటిగ్రేటర్ (ఎస్ఐ) ఎంపిక కోసం బిడ్‌లను ఆహ్వానిస్తున్న పిఎఫ్ ఆర్‌డిఎ
మధ్యవర్తుల ద్వారా నియంత్రణ, పర్యవేక్షక సమ్మతి నివేదికలను సమర్పించడానికి ఒక సమగ్ర సాధనంగా పని చేస్తున్న పిఎఫ్ఆర్‌డిఎ - ట్రేస్
Posted On:
31 JAN 2024 12:07PM by PIB Hyderabad
టెక్నాలజీ ఆర్కిటెక్చర్ (టిఎఆర్‌సిహెచ్)ప్రాజెక్టులో భాగంగా పిఎఫ్ఆర్‌డిఎ - ట్రేస్ ఆర్ ఎఫ్ పి(TRACE RFP)కోసం టెండరింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు భవిష్య బిడ్డర్లను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్ ఆర్ డిఎ) ఆహ్వానిస్తోంది.
పిఎఫ్ఆర్‌డిఎ - ట్రేస్ ఆర్ ఎఫ్ పి అన్నది మధ్యవర్తులచే నియంత్రణ, పర్యవేక్షక సమ్మతి నివేదికలను సమర్పించడం, పిఎఫ్ ఆర్‌డిఎతో నివేదికలు, డేటాను పంచుకోవడం, విధులను పర్యవేక్షించడం, సమర్పణలను సమీక్షించడానికి, ట్రాక్ చేయడానికి పిఎఫ్ ఆర్‌డిఎ విభాగాలకు పని సాగడాన్ని సులభతరం చేయడం, పరిశీలనలు, విశేషాంశాల కమ్యూనికేషన్‌నను ప్రారంభించడం, చేర్చడం కోసం సమ్రగ సాధనంగా పని చేస్తూ, మధ్యవర్తులు సమర్పించిన నివేదికలు, డేటా ధ్రువీకరణ ప్రక్రియను పొందుపరుస్తుంది.
పిఎఫ్ఆర్‌డిఎ - ట్రేస్ ఆర్ ఎఫ్ పి అన్నది టిఎఆర్‌సిహెచ్ ప్రాజెక్టు రెండవ దశ. పిఎఫ్ఆర్‌డిఎ ఈ మాడ్యూల్ కోసం ప్రత్యేకంగా సిస్టం ఇంటిగ్రేటర్ (ఎస్ఐ) విక్రేతను ఎంచుకుంటోంది. సిస్టం ఇంటిగ్రేటర్ ఇప్పటికే ఉన్న ప్రక్రియలను అధ్యయనం చేయడం, మెరుగైన పని ప్రవాహాన్ని ప్రతిపాదించడంకోసం, నమూనా, అభివృద్ధి, అనుకూలీకరణ, అమలు,నిర్వహణ సేవలను, పిఎఫ్ ఆర్‌డిఎ ట్రేస్ కు అందించడానికి బాధ్యత వహిస్తుంది. విజయవంతమైన బిడ్డర్ పిఎఫ్ ఆర్‌డిఎ డిజిటల్ పరివర్తన ప్రయాణంలో కీలకమైన పాత్ర పోషిస్తారు.
ఆసక్తి ఉన్న టెక్నాలజీ సంస్థలు పిఎఫ్ ఆర్ డిఎ - ట్రేస్ ఆర్ఎఫ్‌పి టెండర్ పత్రం కోసం పిఎఫ్ఆర్‌డిఎ వెబ్‌సైట్ ( https://www.pfrda.org.in) లేదా సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ (https://eprocure.gov.in/epublish/app) ద్వారా పొందవచ్చు.
బిడ్ ను సమర్పించేందుకు ఆఖరు తేదీ 11 మార్చి, 2024, మధ్యాహ్నం 3.00గంటల వరకు.
మరింత సమాచారం, స్పష్టీకరణల కోసం, ఆసక్తి గల బిడ్డర్లు టెండర్ పత్రంలో ఇచ్చిన నిర్దేశిత కమ్యూనికేషన్ ఛానెళ్ళ ద్వారా పిఎఫ్ఆర్‌డిఎను సంప్రదించవచ్చు.
***
(Release ID: 2000871)
Visitor Counter : 110