రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023 ఏప్రిల్-డిసెంబర్‌ కాలంలో అత్యధిక మూలధన వ్యయ రికార్డ్‌ సాధించిన రైల్వేలు


2023 డిసెంబర్ వరకు, మొత్తం క్యాపెక్స్‌లో 75% వినియోగం

అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023లో పెట్టుబడుల వినియోగం దాదాపు 33% ఎక్కువ

Posted On: 29 JAN 2024 11:23AM by PIB Hyderabad

2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో (2023 ఏప్రిల్-డిసెంబర్‌ కాలంలో‌), భారతీయ రైల్వేలు సుమారు 75% మూలధన వ్యయం (క్యాపెక్స్‌) చేశాయి. ఇది అత్యధిక వినియోగ స్థాయి. 2023 ఏప్రిల్-డిసెంబర్‌ కాలంలో (9 నెలల్లో) రైల్వేలు రూ.1,95,929.97 కోట్లు ఖర్చు చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేల కోసం కేటాయించిన మొత్తం పెట్టుబడుల్లో (రూ.2.62 లక్షల కోట్లు) ఇది దాదాపు 75%.

2022లోని ఇదే కాలంలో రైల్వేలు రూ.1,46,248.73 కోట్లు ఖర్చు చేశాయి. ఆ సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం క్యాపెక్స్ వినియోగం దాదాపు 33% పెరిగింది.

కొత్త రైలు మార్గాలు నిర్మించడం, రెండు వరుసల ఏర్పాటు, గేజ్ మార్పిడి, ప్రయాణీకుల సౌకర్యాలు మెరుగుపరచడం వంటి వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోకి ఈ పెట్టుబడులు వెళ్లాయి. రైల్వేలో ప్రయాణికుల భద్రత అత్యంత కీలకం. కాబట్టి, ప్రయాణీకుల భద్రతను పెంచే పనుల కోసం ఎక్కువ మొత్తాన్ని వెచ్చించారు.


***


(Release ID: 2000319) Visitor Counter : 128