మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యువ సంగం ( 4 వదశ) లో పాల్గొనడం కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి


భారతదేశ వ్యాప్తంగా 2870 మందికి పైగా యువత యువ సంగం యొక్క వివిధ దశలలో 69 పర్యటనలలో పాల్గొన్నారు

Posted On: 25 JAN 2024 12:05PM by PIB Hyderabad

ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ (ఈ బి ఎస్ బీ) కింద యువ సంగం 4వ దశ నమోదు పోర్టల్‌ను విద్యా మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. యువ సంగం అనేది భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు/యుటిలకు చెందిన యువత మధ్య ఇరు ప్రజల-ప్రజల సంబంధాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన చొరవ. 18-30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత, ప్రధానంగా విద్యార్థులు, ఎన్ ఎస్ ఎస్ / ఎన్ వై కె ఎస్  వాలంటీర్లు, ఉపాధి/స్వయం ఉపాధి పొందే వ్యక్తులు మొదలైనవారు ఈ విశిష్ట చొరవ యొక్క రాబోయే దశలో పాల్గొనడానికి యువ సంగం పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌లు 04 ఫిబ్రవరి 2024 వరకు ఆమోదించబడతాయి.

 

వివరణాత్మక సమాచారం ఈ దిగువ లింక్ లో అందుబాటులో ఉంది: https://ebsb.aicte-india.org/

 

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని 31 అక్టోబర్ 2015న జరిగిన రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా వివిధ ప్రాంతాల ప్రజల మధ్య సుస్థిరమైన మరియు నిర్మాణాత్మకమైన సాంస్కృతిక అనుసంధానం అనే ఆలోచనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లడానికి, ఈ బి ఎస్ బీ 31 అక్టోబర్ 2016న ఈ కార్యక్రమం ప్రారంభించబడింది.

 

ఈ బి ఎస్ బీ క్రింద ప్రారంభించబడిన యువ సంగం, ప్రయోగాత్మక అభ్యాసంపై దృష్టి సారించడం మరియు భారతదేశంలోని ఘనమైన వైవిధ్యం యొక్క విజ్ఞానాన్ని ప్రత్యక్షంగా పొందడం ద్వారా జాతీయ విద్యా విధానం (ఎన్ ఈ పీ) 2020లోని కీలక అంశాలతో అనుసంధానం చేయబడింది. ఇదో వైవిధ్య ఉత్సవం, కొనసాగుతున్న సాంస్కృతిక మారకం, దీనిలో పాల్గొనేవారు జీవితంలోని విభిన్న కోణాలు, సహజ భౌగోళిక రూపాలు, అభివృద్ధి మైలురాళ్లు, ఇటీవలి విజయాలు మరియు యువత అతిధేయ రాష్ట్రంలో పరిచయ అనుభవాన్ని పొందుతారు. యువ సంగం యొక్క 4వ దశ కోసం భారతదేశం అంతటా ఇరవై రెండు ప్రముఖ సంస్థలు గుర్తించబడ్డాయి, ఈ సమయంలో ఈ రాష్ట్రాలు/ యూ టీ ల నుండి పాల్గొనేవారు, వరుసగా రాష్ట్రం/ యూ టీ యొక్క నోడల్ హెచ్ ఈ ఐ నేతృత్వంలో, దాని జత చేయబడిన రాష్ట్రం/ యూ టీ లను సందర్శిస్తారు.

 

యువ సంగం అనేది ఒక రాష్ట్రం/ యూ టీ నుండి మరొక రాష్ట్రానికి క్యాంపస్ మరియు ఆఫ్-క్యాంపస్ విద్యార్థులతో సహా యువత కోసం విద్య-సాంస్కృతిక పర్యటనలను నిర్వహించడంపై దృష్టి సారించే భారత ప్రభుత్వ చొరవ. పర్యటనల సమయంలో, పర్యాతన్ (పర్యాటకం), పరంపర (సంప్రదాయాలు), ప్రగతి (అభివృద్ధి), పరస్పర సంపర్క్ (ప్రజలు-ప్రజల మధ్య అనుసంధానం), మరియు ప్రోద్యోగికి (సాంకేతికత) అనే ఐదు విస్తృత అంశాలలో బహుళ-పార్శ్వాల అనుభూతిని సందర్శించే ప్రతినిధి బృందానికి అందిస్తుంది. వివిధ రాష్ట్రాలు/ యూ టీ లలోని యువత 5-7 రోజుల పాటు (ప్రయాణ దినాలు మినహా) వారికి జత చేసిన రాష్ట్రాన్ని సందర్శిస్తారు, ఈ సమయంలో వారు రాష్ట్రంలోని వివిధ కోణాలతో గాఢమైన అనుభూతిని పొందుతారు మరియు స్థానిక యువతతో పరస్పరం మరియు లోతుగా చర్చించుకునే అవకాశాన్ని పొందుతారు.

 

'సమిష్టి ప్రభుత్వం' విధానాన్ని ఉదహరించే ఈ బి ఎస్ బీ లో ఎం ఓ అంతర్గత వ్యవహారాలు, సంస్కృతి, పర్యాటక, యువ & క్రీడలు, ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌కాస్టింగ్, డిపార్ట్‌మెంట్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్-ఈస్ట్ రీజియన్, మరియు రైల్వేలు  భాగస్వామ్య మంత్రిత్వ శాఖ/డిపార్ట్‌మెంట్/ఏజెన్సీ లు పాల్గొంటాయి. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి వాటాదారుకు ప్రత్యేక పాత్రలు మరియు బాధ్యతలు ఉంటాయి. ప్రతినిధుల ఎంపిక మరియు యువ సంగం పర్యటనల మొత్తం నిర్వహణ ను నోడల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహిస్తాయి. ఇవే చొరవను నిర్వహిస్తాయి. యువ సంగం యొక్క మునుపటి మూడు దశల్లో వరుసగా 16767, 21380 మరియు 29151 నమోదులతో బలమైన భాగస్వామ్యాన్ని సాధించాయి. యువ సంగం కాశీ తమిళ సంగమం (కె టీ ఎస్) నమూనాలో సహకారంతో నిర్వహించబడింది. భారతదేశం నలుమూలల నుండి అద్భుతమైన స్పందన మరియు భాగస్వామ్యాన్ని లభించింది. భారతదేశం అంతటా 2870 కంటే ఎక్కువ మంది యువకులు యువ సంగం యొక్క వివిధ దశలలో 69 పర్యటనలలో పాల్గొన్నారు. జూలై 2023లో ఢిల్లీలో జరిగిన ఎన్ ఈ పీ వేడుకలు మరియు అఖిల భారతీయ శిక్షా సమాగం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకలు, మేరీ మాతి మేరా దేశ్ ప్రచారం మరియు అనేక ఇతర నిర్మాణ కార్యకలాపాలలో యువ సంగం ప్రతినిధులు విస్తృతంగా సహకరించడంతో ఇది దేశంలోని యువతలో స్వచ్ఛంద స్ఫూర్తిని నింపింది. 

 

***


(Release ID: 1999830) Visitor Counter : 163