జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముగిసిన 'వాటర్ విజన్ @ 2047- ముందడుగు ' అనే అంశంపై జరిగిన రెండు రోజుల అఖిల భారత కార్యదర్శుల సదస్సు


'వాటర్ విజన్ @ 2047' జలవనరుల శాఖ ప్రణాళిక అమలు చేయడానికి కార్యదర్శుల కార్యాచరణ బృందం ఏర్పాటు

Posted On: 25 JAN 2024 12:08PM by PIB Hyderabad

దేశంలో జల భద్రతను పటిష్టం చేయడానికి  అమలు చేయాల్సిన చర్యలు చర్చించడానికి  రెండు రోజుల పాటు చెన్నై (తమిళనాడు) మహాబలిపురంలో 'వాటర్ విజన్ @ 2047- ముందడుగు ' అనే అంశంపై జరిగిన అఖిల భారత కార్యదర్శుల సదస్సు నిన్న  ముగిసింది. సదస్సులో  32-రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు , 30 మంది కార్యదర్శులు, 300 మందికి పైగా ప్రతినిధులు  పాల్గొన్నారు, 2023 జనవరి 5, 6 తేదీల్లో మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన "నీటిపై మొదటి అఖిల భారత వార్షిక రాష్ట్ర మంత్రుల సదస్సు" ఆమోదించిన  22 సిఫార్సులు అమలు చేయడానికి అమలు  జరుగుతున్న చర్యలు, అమలు చేస్తున్న విధానాలను  సదస్సులో చర్చించారు. 

 త్రాగునీరు, జల వనరులకు  సుస్థిరతకు ప్రాధాన్యత ఇవ్వడం, వాతావరణ స్థితిస్థాపకత పెంపొందించడం, డిమాండ్, సరఫరా , పెద్ద , చిన్న స్థాయిలో నీటి నిల్వను పెంచడం, జలవనరుల నిర్వహణ కోసం  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, ప్రతి స్థాయిలో నీటి సంరక్షణ కార్యక్రమాలు అమలు  చేయడం, నదుల అనుసంధానాన్ని ప్రోత్సహించడం, నదుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ , తగిన వరద నిర్వహణ చర్యలు చేపట్టడం, ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు అమలు చేయడం లాంటి అంశాలపై భోపాల్ లో జరిగిన "నీటిపై మొదటి అఖిల భారత వార్షిక రాష్ట్ర మంత్రుల సదస్సు" సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సులు కార్యరూపం దాల్చడానికి అమలు చేయాల్సిన చర్యలను మహాబలిపురం సదస్సు చర్చించింది. 

సదస్సులో  నీటి నిర్వహణ రంగంలో ఐదు అంశాలపై విడివిడిగా సమావేశాలు జరిగాయి. . సదస్సు మొదటి రోజున పర్యావరణ స్థితిస్థాపకత, నదుల పరిరక్షణ అనే అంశంపై  చర్చలు   జరిగాయి. కేంద్ర  జల శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన మంత్రుల స్థాయి  సమావేశం జరిగింది. ప్రజలు,  పర్యావరణ  శ్రేయస్సు కోసం జలవనరులను పరిరక్షించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈ అంశంలో పరస్పర  సహకారం, ఆవిష్కరణల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు.   దేశంలో నీటి భద్రత లక్ష్యాల సాధన కోసం రాష్ట్రాల సహకారంతో కేంద్రం చర్యలు అమలు చేస్తుందని   శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. 

సదస్సులో రెండో రోజు 'నీటి వినియోగ సామర్థ్యం', 'నీటి నిల్వ, నిర్వహణ', 'ప్రజల భాగస్వామ్యం అనే అంశాలపై మూడు సమావేశాలు నిర్వహించారు. 

సదస్సులో చర్చించిన ముఖ్య అంశాలు, ఆమోదించిన తీర్మానాలను జాతీయ జల మిషన్ ఎండీ శ్రీమతి అర్చనా వర్మ వివరించారు. కింది అంశాలపై ప్రధానంగా చర్చ జరిగిందని ఆమె తెలిపారు.  

పర్యావరణ  స్థితిస్థాపకత, నదుల సంరక్షణ 
*వాతావరణ మార్పుల వల్ల  తరచుగా వరదలు, కరువులు వంటి తీవ్రమైన సంఘటనలు ఏర్పడతాయి

*వాతావరణ స్థితిస్థాపక మౌలిక సదుపాయాల అవసరం - నిల్వలు, నదుల అనుసంధానం, అవక్షేప నిర్వహణ

*ఫ్లడ్ ప్లెయిన్ జోనింగ్, ముందస్తు హెచ్చరిక వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల ఆవశ్యకత 

* నదుల సంరక్షణ కోసం  నీటి ప్రవాహం, నీటి నాణ్యత పరిరక్షణ ఆవశ్యకత

* స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వాతావరణ అంచనా,నీటి వనరుల పై ప్రభావాన్ని అంచనా వేయడానికి  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం. 

జలవనరుల నిర్వహణ 

*జలవనరుల నియంత్రణ అథారిటీని ప్రతి రాష్ట్రం ఏర్పాటు చేయాలి.

* జాతీయ జలవిధానం తరహాలో రాష్ట్ర జలవిధానం రూపొందించాలి.
*దేశంలోని ప్రతి నదీ పరీవాహక ప్రాంతానికి నదీ పరీవాహక ప్రణాళిక అభివృద్ధి;
* ఎన్ డబ్ల్యూఐసీతో కలిసి స్టేట్ వాటర్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఏర్పాటు;
* హేతుబద్ధీకరించిన నీటి టారిఫ్ యంత్రాంగాన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేయాలి.
*శుద్ధి చేసిన వ్యర్థ జలాల సురక్షిత పునర్వినియోగానికి వ్యవస్థను రాష్ట్రాలు అభివృద్ధి చేయాలి 

నీటి వినియోగ సామర్థ్యం
* కొత్త ప్రాజెక్టుల అభివృద్ధితో పాటు  ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి చర్యలు అమలు చేయాలి.

* మైక్రో ఇరిగేషన్ ను ఉపయోగించడానికి , ఐపిసి-ఐపియు అంతరాన్ని తగ్గించడానికి చర్యలు అమలు చేయాలి 

*వాటర్ అకౌంటింగ్, బెంచ్మార్కింగ్ కార్యక్రమాలపై ప్రతి  రాష్ట్రం ప్రణాళిక సిద్ధం  చేయాలి 
* వివిధ కార్యక్రమాల ద్వారా మైనర్, మేజర్ ఇరిగేషన్ మధ్య సమన్వయం సాధించడానికి కృషి జరగాలి 
* పైప్ ఇరిగేషన్ నెట్ వర్క్ తో పాటు ఆధునీకరణకు ప్రాధాన్యమివ్వాలి.
*పంట నమూనా మార్పును అవలంబించడానికి రైతులను ప్రోత్సహించాలి 
* కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సిఎడిడబ్ల్యుఎమ్ కింద  సంస్కరణలు అమలు చేయాలి 
నీటి నిల్వ  నిర్వహణ
* నీటి నిల్వ సామర్ధ్యాన్ని ఎక్కువ చేయడానికి పెద్ద  చిన్న స్టోరేజీ ప్రాజెక్టుల నిర్మాణం 

*క్రమం తప్పకుండా పూడిక తీత, నిర్వహణ  చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలి 

*అవక్షేప నిర్వహణ కొరకు పరీవాహక ప్రాంత నిర్వహణ 

*బఫర్ స్టోరేజీ ట్యాంకులు, మంచు కోత, భూమి పునరుద్ధరణ, బంజరు భూముల వినియోగం కోసం  చర్యలు

*భూగర్భ జలాల కృత్రిమ రీచార్జ్ ను పెద్ద ఎత్తున చేపట్టాలి.

ప్రజల భాగస్వామ్యం

*నీటి వినియోగ సంఘాల ద్వారా రైతులకు సాధికారత కల్పించడం, నీటి నిర్వహణలో వారిని భాగస్వామ్యం చేయడానికి చర్యలు అమలు చేయాలి. 

*పి.ఆర్.ఐ.ల ద్వారా ప్రధాన స్రవంతి కమ్యూనిటీ సమీకరణ ప్రయత్నాలు

*ప్రతి దశలోనూ భాగస్వాముల భాగస్వామ్యం, సామర్థ్య పెంపు 

*కొత్త ఆలోచన, యువశక్తి కోసం యువత పాత్ర పొంపొందించాలి  

*క్షేత్ర  స్థాయి ప్రణాళికా విధానాన్ని అవలంబించాలి.

సదస్సులో పాల్గొన్న వారి నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. నిరంతర చర్చలు, సమావేశాల  ద్వారా జల  విజన్  @2047 ప్రణాలికను  ముందుకు తీసుకెళ్లేందుకు దృష్టి సారించే అంశాలపై కార్యదర్శులతో కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
 అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర శాఖలు , మంత్రిత్వ శాఖలు ఒకే వేదికపైకి తీసుకురావడానికి వీలు కల్పించిన ఈ సదస్సును నిర్వహించడానికి సహకరించిన తమిళనాడు ప్రభుత్వానికి శ్రీమతి వర్మ  కృతజ్ఞతలు తెలియజేశారు.

***


(Release ID: 1999526) Visitor Counter : 218