ప్రధాన మంత్రి కార్యాలయం
జనవరి 25 వ తేదీ నాడు బులంద్‌శహర్ ను మరియు జయ్‌పుర్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
జయ్‌పుర్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్మేక్రోన్ కు స్వాగతం పలకనున్న ప్రధాన మంత్రి
పంతొమ్మిది వేల ఒక వంద కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన అభివృద్ధి పథకాల కు బులంద్‌శహర్ లో ప్రారంభం మరియు శంకుస్థాపన లు జరపనున్న ప్రధాన మంత్రి
రైలు, రహదారి, చమురు మరియు గ్యాస్, ఇంకా పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణం లకు సంబంధించిన అనేక ప్రాజెక్టుల కు ప్రారంభోత్సవం తో పాటు వాటిని దేశ ప్రజలకు అంకితం ఇవ్వడం జరుగుతుంది
పిఎమ్-గతిశక్తి లో భాగం గా, గ్రేటర్ నోయెడా లోఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్‌శిప్ ను దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రధానమంత్రి
Posted On:
24 JAN 2024 5:17PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 25 వ తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌శహర్ ను మరియు రాజస్థాన్ లో జయ్‌పుర్ ను సందర్శించనున్నారు. 19,100 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి బులంద్‌శహర్ లో మధ్యాహ్నం పూట దాదాపు గా ఒక గంట నలభై అయిదు నిమిషాల వేళ కు ప్రారంభించడం తో పాటు వాటి ని దేశ ప్రజల కు అంకితం ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు లు రేల్ వే, రహదారి, చమురు మరియు గ్యాస్, ఇంకా పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణం ల వంటి అనేక ముఖ్య రంగాల కు సంబంధించినవి.
సాయంత్రం పూట సుమారు 5:30 గంటల వేళ కు ప్రధాన మంత్రి జయ్‌పుర్ కు చేరుకొని, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్ కు స్వాగతం పలకనున్నారు. ప్రెసిడెంట్ శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్ తో కలసి ప్రధాన మంత్రి జంతర్ మంతర్, హవా మహల్ మరియు అల్బర్ట్ హాల్ లు సహా నగరం లోని సాంస్కృతిక మరియు చరిత్రాత్మక ప్రాముఖ్యం కలిగినటువంటి వివిధ ప్రదేశాల ను సందర్శిస్తారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌శహర్ లో జరగనున్న కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ (డిఎఫ్‌సి) లో న్యూ ఖుర్జా-న్యూ రేవాడి మధ్య 173 కిలో మీటర్ ల పొడవైనటువంటి విద్యుదీకరణ జరిగిన డబల్ లైన్ ను దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఈ సందర్భం లో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా రెండు స్టేశన్ ల నుండి సరకుల రైళ్ళ కు ఆయన జెండా ను చూపెడతారు. ఈ డిఎఫ్‌సి సెక్శన్ వెస్టర్న్ డిఎఫ్‌సి మరియు ఈస్టర్న్ డిఎఫ్ సి ల మధ్య కీలకమైన కనెక్టివిటీ ని ఏర్పరచే కారణం గా ముఖ్యమైంది అని చెప్పాలి. దీనికి తోడు ఈ సెక్శన్ రూపకల్పన లో ఇంజినీరింగ్ తాలూకు అసాధారణమైన ఘనత కు గాను పేరు తెచ్చుకొన్నది. దీని పరిధి లో ఒక కిలో మీటర్ మేరకు ‘హై రైజ్ ఎలక్ట్రిఫికేశన్ తో కూడిన డబల్ లైన్ రైల్ టనల్’ భాగం గా ఉంది. ప్రపంచం లో ఇటువంటి రైలు మార్గం ఇదే మొట్టమొదటిది. ఈ సొరంగాన్ని రెండు అంతస్తుల కంటేనర్ ట్రైన్ లను ఎటువంటి అంతరాయం ఎదురవకుండా నడిపేందుకు గాను ప్రత్యేకం గా రూపొందించడం జరిగింది. ఈ క్రొత్త డిఎఫ్‌సి సెక్శన్, డిఎఫ్‌సి ట్రాక్ మీద సరకు ల రైళ్ళ ను స్థలం మార్పు ద్వారా ప్రయాణికుల రైళ్ళ నిర్వహణ ను మెరుగుపరచడం లో సాయపడనుంది.
ప్రధాన మంత్రి మథుర-పల్‌వల్ సెక్శను ను మరియు చిపియానా బుజుర్గ్ - దాద్ రీ సెక్శను ను కలుపుతూ ఏర్పాటైన నాలుగు దోవ ల మార్గాన్ని కూడా దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఈ క్రొత్త మార్గాలు దక్షిణ పశ్చిమ మరియు తూర్పు భారతదేశ ప్రాంతాల తో పాటు గా దేశ రాజధాని కి రేల్ వే కనెక్టివిటీ ని మెరుగు పరచనున్నాయి.
ప్రధాన మంత్రి అనేక రహదారి అభివృద్ధి పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఈ పథకాల లో అలీగఢ్ నుండి భద్‌వాస్ వరకు నాలుగు దోవ ల పనుల ప్యాకేజీ-1 ప్రాజెక్టు (జాతీయ రాజమార్గం [ఎన్‌హెచ్-34] కు చెందిన అలీగఢ్-కాన్‌పుర్ సెక్శన్ లో ఒక భాగం) చేరి ఉంది. శామ్ లీ మీదుగా (ఎన్‌హెచ్-709ఎ ) మేరఠ్ నుండి కర్‌నాల్ సరిహద్దు వరకు విస్తరణ పనులను చేపట్టడం; ఇంకా, ఎన్‌హెచ్ 709 ఎడి ప్యాకేజీ -2 లో భాగం గా ఉన్నటువంటి శామ్‌లీ-ముజప్ఫర్‌నగర్ సెక్శను ను నాలుగు దోవ ల మార్గం గా మార్చడం జరుగుతుంది. ఈ రహదారి పథకాల ను 5000 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో అభివృద్ధి పరచ డమైంది. ఈ రహదారి పథకాలు ఆ ప్రాంతం లో కనెక్టివిటీ ని మెరుగు పరచి, మరి ఆ ప్రాంతం లో ఆర్థిక అభివృద్ధి కి సహాయకారి కాగలవు.
ఇండియన్ ఆయిల్ కు చెందిన టుండ్‌లా- గవారియా గొట్టపు మార్గాన్ని కూడా ఇదే కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. సుమారు 700 కోట్ల రూపాయల ఖర్చు తో సిద్ధమైన 255 కి.మీ. పొడవైన ఈ గొట్టపు మార్గం పథకాన్ని అనుకున్న కాలాని కంటే ఎంతో ముందే పూర్తి అయింది. ఈ ప్రాజెక్టు టుండ్‌లా నుండి బరౌనీ - కాన్ పుర్ గొట్టపుమార్గం లోని గవారియా టి-పాయింట్ వరకు పెట్రోలియమ్ ఉత్పత్తుల రవాణా లో సాయపడుతుంది. దీనితో పాటు మథుర మరియు టుండ్‌లా లో పంపింగ్ సదుపాయాల ను, అలాగే టుండ్‌లా, లఖ్‌నవూ మరియు కాన్‌పుర్ లో డెలివరీ సదుపాయాల ను సమకూర్చనుంది.
ప్రధాన మంత్రి గ్రేటర్ నోయడా లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్ శిప్ (ఐఐటిజిఎన్) ని కూడా దేశ ప్రజల కు అంకితం చేస్తారు. పిఎమ్ -గతిశక్తి లో భాగం గా మౌలిక సదుపాయాల సంధానం సంబంధి ప్రాజెక్టుల ఏకీకృత ప్రణాళిక మరియు సమన్వయ భరిత అమలు సంబంధి మంత్రి దార్శనికత కు అనుగుణం గా అభివృద్ధి పరచడమైంది. 1,714 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించిన ఈ ప్రాజెక్టు 747 ఎకరాల లో విస్తరించి ఉండి మరి దక్షిణం లో ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వే ఇంకా తూర్పు న దిల్లీ - హావ్ డా బ్రాడ్ గేజ్ రేల్ వే లైను తో పాటు ఈస్టర్న్ ఎండ్ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ ల కూడలి కి దగ్గర లో నెలకొని ఉంది. ఐఐటిజిఎన్ వ్యూహాత్మక స్థానం లో సాటి లేనటువంటి కనెక్టివిటీ కి పూచీ పడుతుంది. ఎలాగంటే మల్టి - మాడల్ కనెక్టివిటీ కోసం ఇతర మౌలిక సదుపాయాలు ప్రాజెక్టు కు చుట్టుప్రక్కల లభ్యం అవుతున్నాయి. వాటిలో గా నోయడా-గ్రేటర్ నోయెడా ఎక్స్‌ప్రెస్ వే (5 కి.మీ.); యమునా ఎక్స్‌ప్రెస్ వే (10 కి.మీ.); విస్తరించిన దిల్లీ విమానాశ్రయం (60 కి.మీ.) చేరి ఉన్నాయి; వీటిలో ఇంకా జేవర్ విమానాశ్రయం (40 కిమీ) ; అజాయబ్ పుర్ రేల్ వే స్టేశన్ (అర కిలో మీటర్ ) మరియు న్యూ దాద్ రీ డిఎఫ్‌సిసి స్టేశన్ (10 కి.మీ.) కూడా భాగం గా ఉన్నాయి. ఈ ప్రాజక్టు ఆ ప్రాంతం లో పారిశ్రామిక వృద్ధి కి, ఆర్థిక సమృద్ధి కి మరియు నిరంతర అభివృద్ధి కి ప్రోత్సాహాన్ని ఇచ్చే దిశ లో ఒక మహత్త్వపూర్ణమైన చర్య అని చెప్పాలి.
మథుర మురుగు శుద్ధి పథకం తాలూకు పునర్ నవీకరణ ప్రాజెక్టు ను కూడా ఇదే కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. సుమారు 460 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మాణం జరిగిన స్యూయిజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు (ఎస్‌టిపి) కూడా ఈ పునర్ నవీకరణ ప్రాజెక్టు లో కలిసి ఉంది. అంతేకాదు, మసానీ లో 30 ఎమ్ఎల్‌డి సామర్థ్యం కలిగిన ఎస్‌టిపి నిర్మాణం, ట్రాన్స్ యమున లో ఇప్పటికే ఉన్న 30 ఎమ్‌ఎల్‌డి ప్లాంటు పునరావాసం మరియు మసానీ లో 6.8 ఎమ్ఎల్‌డి సామర్థ్యం కలిగిన ఎస్‌టిపి యొక్క పునరావాసం, ఇంకా 20 ఎమ్ఎల్‌డి సామర్థ్యం కలిగిన (టర్శరీ ట్రీట్‌మెంట్ ఎండ్ రివర్స్ ఆస్మోసిస్ ప్లాంటు యొక్క) నిర్మాణం సైతం భాగం గా ఉన్నాయి. ప్రధాన మంత్రి మురాదాబాద్ (రామ్‌గంగ) మురుగు శుద్ధి వ్యవస్థ ను మరియు ఎస్‌టిపి పనుల (ఒకటో దశ) ను కూడా ప్రారంభించనున్నారు. సుమారు 330 కోట్ల రూపాయల వ్యయం తో రూపకల్పన జరిగిన ఈ ప్రాజెక్టు లో 58 ఎమ్ఎల్‌డి సామర్థ్యం కలిగిన ఎస్‌టిపి, దాదాపు గా 264 కి.మీ. తో కూడిన సీవరేజి నెట్ వర్క్ తో పాటు మురాదాబాద్ లో రామ్‌గంగ నది కి సంబంధించి కాలుష్యం తగ్గింపునకై ఉద్దేశించి నటువంటి తొమ్మిది స్యూయిజ్ పంపింగ్ స్టేశన్ లు భాగం గా ఉన్నాయి.
**
(Release ID: 1999263)
Visitor Counter : 109
Read this release in:
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam