ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ బాలిక దినం సందర్భం లో బాలికల అజేయమైన స్ఫూర్తిమరియు కార్యసాధనల కు వందనాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి
Posted On:
24 JAN 2024 9:19AM by PIB Hyderabad
బాలికల లో అజేయమైన స్ఫూర్తి కి మరియు బాలికల కార్యసాధనల కు ‘జాతీయ బాలిక దినం’ సందర్భం లో వందనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆచరించారు. మనం అన్ని రంగాల లో ప్రతి ఒక్క బాలిక చాటుతున్నటువంటి సమృద్ధమైన దక్షత ను కూడా గుర్తించాం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. గడచిన పదేళ్ళ లో మా ప్రభుత్వం ప్రతి ఒక్క బాలిక కు నేర్చుకొనే, ఉన్నతి ని సాధించే మరియు అగ్రస్థానాని కి దూసుకుపోయే అవకాశాలు దక్కే రీతి లో దేశాన్ని తీర్చిదిద్దడం కోసం అనేక ప్రయాసల కు పూనుకొంటున్నది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘‘జాతీయ బాలిక దినం నాడు మనం బాలిక ల అజేయ స్ఫూర్తి కి మరియు కార్యసాధనల కు మనం వందనాన్ని ఆచరించుదాం. అన్ని రంగాల లో ప్రతి ఒక్క బాలిక చాటుతున్నటువంటి సమృద్ధమైన దక్షత ను కూడా మనం గుర్తించుదాం. వారు మార్పు ను తీసుకు వచ్చేటటువంటి వారు గా ఉన్నారు. వారు మన దేశాన్ని మరియు మన సమాజాన్ని మెరుగైంది గా మలచుతున్నారు. గడచిన పదేళ్ళ లో మా ప్రభుత్వం ప్రతి ఒక్క బాలిక కు నేర్చుకొనేందుకు, ఉన్నతి చెందేందుకు మరియు అగ్రస్థానం వైపునకు దూసుకుపోయేందుకు అవకాశాలు లభించేటటువంటి ఒక దేశాన్ని నిర్మించడం కోసం అనేక ప్రయాసల ను సాగిస్తున్నది.’’ అని పేర్కొన్నారు.
**********
DS/ST
(Release ID: 1999050)
Visitor Counter : 138
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam