సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అయోధ్యలో సకాలంలో స్పందించి వైద్య సౌకర్యం అందించి ప్రాణం రక్షించిన క్యూబ్- భీష్మ్
Posted On:
22 JAN 2024 3:46PM by PIB Hyderabad
అయోధ్యలో అత్యవర పరిస్థితిలో వైద్య సౌకర్యం అందించడానికి ప్రాజెక్ట్ ఆరోగ్య మైత్రి కింది ఏర్పాటు చేసిన క్యూబ్- భీష్మ్ సకాలంలో స్పందించి వైద్య సౌకర్యం నిండు ప్రాణాన్ని రక్షించింది. అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన క్యూబ్- భీష్మ్ తక్షణ స్పందనతో 65 సంవత్సరాల శ్రీ శ్రీ రామకృష్ణ శ్రీవాస్తవ అనే భక్తుడు ప్రాణాలు రక్షించింది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శ్రీ శ్రీవాస్తవ గుండెపోటుకు గురై అపస్మారక స్థితికి వెళ్లిపోయారు.
సమాచారం అందిన వెంటనే క్యూబ్- భీష్మ్ లో భాగంగా ఏర్పాటైన ఐఏఎఫ్ రాపిడ్ రెస్పాన్స్ టీం రంగంలోకి దిగి చికిత్స కోసం శ్రీ వాస్తవను తరలించింది. గుండెపోటు వచ్చిన వ్యక్తికి గంట లోపు తగిన చికిత్స అందించాల్సి ఉంటుంది. శ్రీ శ్రీవాత్సవ విషయంలో ఇదే జరిగింది. తక్షణం తరలించి తగిన చికిత్స అందించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. శ్రీ శ్రీవాస్తవ ను పరిశీలించిన వైద్యులు అతనికి ప్రమాదకరమైన స్థాయిలో అధిక రక్తపోటు (210/170 mmHg) ఉన్నట్లు గుర్తించారు. వైద్య బృందం అవసరమైన చికిత్స అందించింది. చికిత్సతో ఆయన కోలుకున్నారు.
అధునాతన సౌకర్యాలు కలిగిన ఆస్పత్రిలో మాత్రమే అందించడానికి అవకాశం ఉన్న వైద్య సేవలను క్యూబ్- భీష్మ్ వైద్యులు అయోధ్యలో అందించి ప్రణాలు రక్షించారు. వైద్య భాషలో " గోల్డెన్ అవర్' గా పరిగణించే వ్యాధిలో తగిన చికిత్స అందడంతో శ్రీ శ్రీవాత్సవ కోలుకున్నారు. తదుపరి చికిత్స కోసం అతనిని సివిల్ ఆసుపత్రికి సురక్షితంగా తరలించారు.
ఈ సంఘటన అత్యవసర పరిస్థితుల్లో తక్షణ, అధిక-నాణ్యతతో కూడిన వైద్య సంరక్షణ అందించడంలో, ప్రత్యేకించి సమయం తక్కువగా ఉన్న సందర్భాలలో క్యూబ్- భీష్మ్ వంటి మొబైల్ హాస్పిటల్ ఆవశ్యకత తెలియజేస్తుంది.
క్లిష్టమైన పరిస్థితుల్లో తక్షణ, సమర్ధ వైద్య సౌకర్యం అందించడం లక్ష్యంగా ప్రాజెక్ట్ ఆరోగ్య మైత్రి పనిచేస్తోంది.
***
(Release ID: 1998685)