ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీరామ భక్తిగీతాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
21 JAN 2024 9:20AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ మూడు శ్రీరామ భక్తి గీతాలను ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:
‘‘రామ్‌లాలా పవిత్ర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో ఉప్పొంగుతున్న భావోద్వేగం అత్యద్భుతాలు చేయగలదు.’’ అలాగే ‘‘రామ్‌లాలా రాకకు సంబంధించి ప్రతిచోటా భక్తులలో పెల్లుబుకుతున్న భక్తిభావన పలు రూపాల్లో వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా నేను విన్న ఈ భక్తిగీతం ఎంతో దివ్యానుభూతినిస్తోంది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా ‘‘శ్రీరామ ప్రభువుపై భార్గవి వెంకట్రామ్ తన శ్రావ్యమైన స్వరంతో ఆలపించిన తమిళ భక్తిగీతం మనను పారవశ్యంలో ముంచుతుందంటే అతిశయోక్తి కాదు’’ అని ప్రధానమంత్రి కొనియాడారు.
***
DS/RT
(Release ID: 1998308)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam