రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కర్తవ్య పథ్ లో మహిళ కేంద్ర బిందువుగా జరగనున్న 75వ రిపబ్లిక్ డే పరేడ్: ' వికసిత్ భారత్', 'భారత్ - లోక్ తంత్ర కీ మాతృక' ప్రధాన ఇతివృత్తాలు: రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమానే


తొలిసారిగా భారతీయ సంగీత వాయిద్యాలతో పరేడ్ ను ప్రారంభించనున్న 100 మంది మహిళా కళాకారులు: దేశ సుసంపన్న సాంస్కృతిక వైవిధ్యం, ఐక్యత , పురోగతిని ప్రదర్శించనున్న16 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, తొమ్మిది మంత్రిత్వ శాఖలు / సంస్థల శకటాలు

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్: భారతీయ సహచరులతో చేరనున్న కవాతు, బ్యాండ్ బృందాలు , ఫ్రాన్స్ విమానాలు

పరేడ్ కు జన్ భాగీదారీని నిర్ధారించడానికి దేశవ్యాప్తంగా 13,000 మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం
దేశం నలుమూలల నుంచి దాదాపు 1,900 చీరలు, తెరలను ప్రదర్శించే l 'అనంత్ సూత్ర - ది ఎండ్ లెస్ థ్రెడ్' మరో ఆకర్షణ

Posted On: 19 JAN 2024 6:06PM by PIB Hyderabad

'వికసిత్ భారత్', 'భారత్ - లోక్ తంత్ర  కీ మాతృక' ఇతివృత్తాలతో 2024 జనవరి 26న కర్తవ్య పథ్ లో జరిగే 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్ మహిళా కేంద్రీకృతంగా ఉంటుంది. రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమానే శుక్రవారం నాడు (జనవరి 19, 2024) న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో పరేడ్ లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుందని, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు (యుటిలు) , కేంద్ర మంత్రిత్వ శాఖలు / సంస్థల శకటాలలో ఎక్కువ భాగం దేశ సుసంపన్న  సాంస్కృతిక వైవిధ్యం, ఐక్యత, పురోగతిని ప్రదర్శిస్తాయని చెప్పారు. 'భారతదేశం నిజంగా ప్రజాస్వామ్యానికి తల్లి' అనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అభిప్రాయాలకు అనుగుణంగా ఇతివృత్తాలను ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు.

తొలిసారిగా 100 మంది మహిళా కళాకారులు భారతీయ సంగీత వాయిద్యాలతో పరేడ్ లో పాల్గొంటారు. మహిళా కళాకారులు సంఖ్, నాదేశ్వరం, నాగాడ వంటి సంగీతాన్ని వినిపిస్తూ పరేడ్ వెంట సాగుతారు.

కర్తవ్య పధ్ లో జరిగే ఈ పరేడ్ లో తొలిసారిగా త్రివిధ దళాల మహిళా బృందం కవాతు లో పాల్గొంటుంది. సి ఎ పి ఎఫ్ బృందాల్లో కూడా మహిళా సిబ్బంది ఉంటారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ లో మహిళలకు ఉత్తమ ప్రాతినిధ్యం ఉంటుందని రక్షణ శాఖ కార్యదర్శి తెలిపారు.

ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే పరేడ్ సుమారు 90 నిమిషాల పాటు కొనసాగనుంది. కర్తవ్య పథ్ వద్ద సీటింగ్ సామర్ధ్యం  77,000 కాగా, అందులో 42,000 సాధారణ ప్రజల కోసం కేటాయించారు.

ముఖ్య అతిథి

ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ కు ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని శ్రీ గిరిధర్ అరమానే తెలిపారు. ఫ్రాన్స్ కు చెందిన 95 మంది సభ్యుల కవాతు బృందం, 33 మంది సభ్యుల బ్యాండ్ బృందం కూడా పరేడ్ లో పాల్గొంటుంది. భారత వైమానిక దళానికి చెందిన విమానాలతో పాటు, ఒక మల్టీ రోల్ ట్యాంకర్ ట్రాన్స్ పోర్ట్ (ఎం ఆర్ టి టి) విమానం, ఫ్రెంచ్ వైమానిక దళానికి చెందిన రెండు రాఫెల్ విమానాలు ఫ్లై-పాస్ట్ లో పాల్గొంటాయి.

ప్రత్యేక అతిథులు

ఈ ఏడాది పరేడ్ కు 13 వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. ప్రభుత్వ జన్ భాగీదారీ దార్శనికతకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలు జాతీయ ఉత్సవంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించడమే లక్ష్యమని రక్షణ శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఈ అతిథులు దేశానికి గర్వకారణమని ప్రధానిని ఉటంకిస్తూ ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక అతిథులలో వివిధ రంగాలలో ఉత్తమ పనితీరు కనబరిచినవారు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ , పట్టణ), పిఎం ఉజ్వల యోజన, పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (పిఎం స్వనిధి), పిఎం కృషి సించాయి యోజన, పిఎం ఫసల్ బీమా యోజన, పిఎం విశ్వకర్మ యోజన, పిఎం అను సూచిత్ జాతి అభ్యుదయ యోజన, పీఎం మత్స్య సంపద యోజన, స్టాండప్ ఇండియా స్కీమ్, ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ స్కీమ్, రాష్ట్రీయ గోకుల్ మిషన్. వంటి ప్రభుత్వ వివిధ పథకాలను సద్వినియోగం చేసుకున్న వారు , వైబ్రెంట్ గ్రామాల సర్పంచులు, స్వచ్ఛ భారత్ అభియాన్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అండ్ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ మహిళా కార్మికులు, ఇస్రో మహిళా అంతరిక్ష శాస్త్రవేత్తలు, యోగా టీచర్లు (ఆయుష్మాన్ భారత్), అంతర్జాతీయ క్రీడా పోటీల విజేతలు, పారా ఒలింపిక్ పతక విజేతలు, ఉత్తమ స్వయం సహాయక బృందాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, పి ఎం పమన్ కీ బాత్ కార్యక్రమం సూచన కర్తలు, ప్రాజెక్ట్ వీర్ గాథ 3.0 కు చెందిన 'సూపర్-100' , నేషనల్ స్కూల్ బ్యాండ్ కాంపిటీషన్ విజేతలు కూడా పరేడ్ కు హాజరవుతారు. ఈ ప్రత్యేక అతిథులకు కర్తవ్యపధ్ లో ప్రముఖ ఆసనాలు ఏర్పాటు చేస్తున్నారు. 

వారి కష్టతరమైన జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని, దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ప్రత్యేక అతిథుల జాబితాలో వైబ్రెంట్ గ్రామాలను చేర్చడం పై  ప్రత్యేక దృష్టి సారించినట్లు శ్రీ గిరిధర్ అరమానే పేర్కొన్నారు.

అలంకృత శకటాలు

పరేడ్ సందర్భంగా 16 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు, 9 మంత్రిత్వ శాఖలు/ విభాగాల మొత్తం 25 ఆలంకృత శకటాలు పరేడ్ లో పాల్గొంటాయి. ఈ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో-  అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, మణిపూర్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్,  రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, లడఖ్, తమిళనాడు, గుజరాత్, మేఘాలయ, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. మంత్రిత్వ శాఖలు/ సంస్థలలో-  హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, షిప్పింగ్ ,  జలమార్గాల మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్), భారత ఎన్నికల కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సిపిడబ్ల్యుడి) ఉన్నాయి.

ప్రతి సంవత్సరం మాదిరిగానే కళలు, సంస్కృతి, చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, వాస్తుశిల్పం, కొరియోగ్రఫీ తదితర రంగాలకు చెందిన ప్రముఖులతో కూడిన నిపుణుల కమిటీ శకటాలను ఎంపిక చేసింది. పరేడ్ లో తమ శకటాలను చేర్చకపోవడంపై కొన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల అభ్యంతరాలను  పరిష్కరించడానికి, రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేకమైన మూడు సంవత్సరాల రోల్-ఓవర్ ప్రణాళికను రూపొందించిందని, ఇది మూడు సంవత్సరాల వ్యవధిలో రొటేషన్ ప్రాతిపదికన అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల  సమాన భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తుందని రక్షణ కార్యదర్శి తెలియజేశారు.

అనంత్ సూత్ర

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కర్తవ్య పధ్ లో 'అనంత సూత్ర - ఎండ్ లెస్  థ్రెడ్' వస్త్ర వ్యవస్థ ను ప్రదర్శించనుంది. ఎన్ క్లోజర్లలో కూర్చున్న ప్రేక్షకుల వెనుక దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఫ్యాషన్ ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన కాలాతీత బహుమతి అయిన ఈ చీరకు అనంత్ సూత్ర దృశ్యపరంగా అద్భుతమైన నివాళి. ఈ ప్రత్యేక ప్రదర్శనలో  దేశంలోని ప్రతి మూల నుండి దాదాపు 1,900 చీరలు వస్త్రాలను ప్రదర్శిస్తారు, దీనిని కర్తవ్య పధ్ వెంబడి  చెక్క ఫ్రేమ్ లతో ఎత్తులో అమర్చారు. ఇందులో క్యూఆర్ కోడ్ లు ఉంటాయి, వీటిని స్కాన్ చేసి ఇందులో ఉపయోగించే నేత, ఎంబ్రాయిడరీ కళలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

స్మారక నాణెం , స్టాంప్

ఈ సంవత్సరం దేశం తన 75 వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున, రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వేడుకల సందర్భంగా స్మారక నాణెం, స్మారక స్టాంపును విడుదల చేస్తుంది.

నేషనల్ స్కూల్ బ్యాండ్ పోటీలు

2024 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాల పిల్లలలో దేశభక్తి, ఐక్యత ,దేశం పట్ల గర్వ భావనను రేకెత్తించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో అఖిల భారత స్థాయిలో జాతీయ స్కూల్ బ్యాండ్ పోటీని నిర్వహించింది, ఈ పోటీల్లో 30 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 12,857 మంది విద్యార్థులతో కూడిన చె 486 స్కూల్ బ్యాండ్లు పాల్గొన్నాయి. నేషనల్ స్కూల్ బ్యాండ్ కాంపిటీషన్  స్థాయిలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:-

లెవల్ 1 : రాష్ట్ర స్థాయి (స్టేట్ లెవల్) - రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా నిర్వహించారు.

లెవల్ 2: జోనల్ స్థాయి - రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను 04 జోన్లుగా విభజించారు.

లెవెల్ 3: జాతీయ స్థాయి (ఫైనల్)- న్యూఢిల్లీలోని నేషనల్ స్టేడియంలో నిర్వహిస్తారు.

ఇప్పటికే మొదటి రెండు స్థాయిల పోటీలు నిర్వహించామని, 2024 జనవరి 21, 22 తేదీల్లో న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఫైనల్ లెవల్ ఈవెంట్ ను నిర్వహిస్తామని తెలిపారు. 15 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంపికైన 16 బ్యాండ్లు ఈ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. ఈ ఫైనలిస్ట్ జట్లకు బహుమతులు ఇస్తారు.   విజేతలు పరేడ్ ను వీక్షిస్తారు.

వందేభారతం 3.0

రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ 2024లో భాగంగా మూడో ఎడిషన్ వందేభారతం నృత్య పోటీలను నిర్వహించారు. మహిళా కళాకారుల బృందాలు కర్తవ్య పధ్ లో ప్రదర్శన నిర్వహిస్తాయి. సుమారు 200 మంది మహిళా కళాకారులు వేదిక ముందు ప్రదర్శన ఇవ్వనున్నారు.

వీర్ గాథ 3.0

రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్-2024లో భాగంగా సాయుధ దళాల ధైర్యసాహసాలు, త్యాగాల గురించి చిన్నారుల్లో అవగాహన కల్పించేందుకు ప్రాజెక్ట్ వీర్ గాథ మూడో ఎడిషన్ ను నిర్వహించారు. 2023 జూలై 13 నుంచి సెప్టెంబర్ 30 వరకు రక్షణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. దేశవ్యాప్తంగా 2.42 లక్షల పాఠశాలలకు చెందిన 1.36 కోట్ల మంది విద్యార్థులు వీర్ గాథా 3.0లో పాల్గొన్నారు. 'సూపర్ -100' పేరుతో మొత్తం 100 మంది పాఠశాల విద్యార్థులను విజేతలుగా ప్రకటించి 2024 జనవరి 25న న్యూఢిల్లీలో రక్షణ మంత్రి సన్మానించనున్నారు. రిపబ్లిక్ డే పరేడ్ లో వీరు కూడా పాల్గొంటారు.

భారత్ పర్వ్

'జన్ భాగీదారీ' థీమ్ ను ప్రతిబింబిస్తూ, పర్యాటక మంత్రిత్వ శాఖ 2024 జనవరి 23 నుంచి 31 వరకు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 'భారత్ పర్వ్' నిర్వహించనుంది. ఇందులో రిపబ్లిక్ డే శకటాలు, మిలటరీ బ్యాండ్లను , సాంస్కృతిక కార్యక్రమాలు, క్రాఫ్ట్స్ బజార్, ఫుడ్ కోర్టులు, పాన్ ఇండియా వంటకాలను ప్రదర్శిస్తారు. .

పరాక్రమ్ దివస్

నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై 2024 జనవరి 23న ఎర్రకోట వద్ద పరాక్రమ్ దివస్ ను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో 3-డి ప్రొజెక్షన్ మ్యాపింగ్ / లైట్ అండ్ సౌండ్ షో, నాటకాలు / నృత్య ప్రదర్శనతో ప్రొజెక్షన్ మ్యాపింగ్ వంటి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

 ఇ- ఇన్విటేషన్

ఈ ఏడాది కూడా ప్రత్యేక పోర్టల్  www.e-invitation.mod.gov.in ద్వారా పలువురు ప్రముఖులకు ఎలక్ట్రానిక్ విధానంలో ఆహ్వానాలు అందాయి. ఇది మొత్తం ప్రక్రియను మరింత సురక్షితంగా ,  కాగిత రహితంగా నిర్ధారించింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు ఈ జాతీయ కార్యక్రమానికి హాజరు కావడానికి వీలు కల్పించింది.

ఇ -టికెట్

గరిష్టంగా జన్ భాగీదారీని నిర్ధారించడానికి, ప్రజలకు సీట్ల సంఖ్యను పెంచారు. అందుకు అనుగుణంగా www.aamantran.mod.gov.in నుంచి బుక్ చేసుకునేలా టికెట్ల సంఖ్యను పెంచారు. రిపబ్లిక్ డే పరేడ్ ,బీటింగ్ రిట్రీట్ వేడుక, 2024 కోసం టిక్కెట్ల సంఖ్య, రేట్ల  వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:-

2024 జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్ కోసం

 రూ.20/- = 4,320 టికెట్లు

రూ.100/- = 37,680 టికెట్లు

2024, జనవరి 29న బీటింగ్ రిట్రీట్ వేడుక కోసం

 రూ.100/- = 1,200 టికెట్లు

రిపబ్లిక్ డే పరేడ్, బీటింగ్ రిట్రీట్ వేడుకల టికెట్లను గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న ఎంసేవా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

పార్క్ అండ్ రైడ్ ,  మెట్రో సౌకర్యం

రిపబ్లిక్ డే పరేడ్ ను వీక్షించేందుకు ప్రజలకు ఉచితంగా పార్క్ అండ్ రైడ్, మెట్రో సదుపాయం కల్పిస్తామన్నారు. 2024 జనవరి 26వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మెట్రో అందుబాటులోకి రానుంది. అతిథులు, టికెట్ ఉన్నవారు తమ ఆహ్వానం/టికెట్ ను చూపించి  మెట్రో సదుపాయాన్ని ఉచితంగా పొందవచ్చు. జెఎల్ఎన్ స్టేడియం, పాలికా బజార్ పార్కింగ్ ప్రాంతం నుండి అతిథులు ,  టికెట్ ఉన్నవారు ఉచితంగా పార్క్ అండ్ రైడ్ బస్సు సదుపాయాన్ని పొందవచ్చు.

పిఎం ఎట్ హోమ్ ఫంక్షన్

ఆనవాయితీ ప్రకారం, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జనవరి 24న న్యూఢిల్లీలోని తన నివాసంలో రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించిన ఎన్సిసి క్యాడెట్లు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ క్యాడెట్లు, శకటాల ఆర్టిస్టులు, ట్రైబల్ గెస్ట్ లు మొదలైనవారితో సమావేశం కానున్నారు.

ప్రధాన మంత్రి ఎన్ సి సి  ర్యాలీ

ఢిల్లీ కంటోన్మెంట్ లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్ లో ప్రధాన మంత్రి ఎన్ సి సి ర్యాలీ  జరగనుంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జనవరి 27న ఎన్ సిసి నిర్వహించే వివిధ కార్యకలాపాలను సమీక్షించ నున్నారు.

బీటింగ్ రిట్రీట్

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా 2024 జనవరి 29న విజయ్ చౌక్ లో జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో అన్ని భారతీయ బాణీలను వాద్య పరికరాల ద్వారా వినిపిస్తారు.  రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి శ్రీ జగ్దీప్ ధన్కర్, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు , సాధారణ ప్రజలతో కూడిన విశిష్ట ప్రేక్షకుల ముందు భారత సైన్యం, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్. ఫోర్స్ , సిఎపిఎఫ్ బ్యాండ్ బృందాలు ఈ భారతీయ సంగీత బాణీలను వాయించ నున్నాయి.

రిపబ్లిక్ డే సందర్భంగా ఒక ఆన్ లైన్ పోటీ కూడా నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రజలు సైనికుల త్యాగాలు, దేశభక్తిని చాటి చెబుతూ భారతీయ బాణీలను పాడి లేదా / ప్లే చేసి వాటిని మైగవ్ లో అప్లోడ్ చేయవచ్చు అని రక్షణ కార్యదర్శి పేర్కొన్నారు. ఇందులో టాప్ ఎంట్రీలకు రివార్డులు ఇస్తారు.

***



(Release ID: 1998160) Visitor Counter : 172