రక్షణ మంత్రిత్వ శాఖ
గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో జరిగిన సముద్ర ఘటనకు స్పందించిన అక్కడ మోహరించిన భారతీయ నావికాదళ మిషన్ వేదిక
Posted On:
18 JAN 2024 2:40PM by PIB Hyderabad
సముద్ర దొంగలకు వ్యతిరేకంగా గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో మోహరించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం, 17 జనవరి 2024న రాత్రి 11.11 గంటలకు డ్రోన్ దాడి అనంతరం మార్షల్ ఐలాండ్ జెండా కలిగిన ఎంవి జెన్‌కో పికార్డీ విపత్తు కాల్‌కు తక్షణం స్పందించింది.
గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో సముద్ర చౌర్యానికి వ్యతిరేకంగా పాట్రోలింగ్ చేస్తున్న ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఈ విపత్తు కాల్‌ను అందుకున్న వెంటనే సుమారు అర్థరాత్రి 12.30 గంటల (18 జనవరి 24)కు సహాయం అందించేందుకు నౌకలను మధ్యలో నిలిపివేసింది. దాదాపు 22 సిబ్బంది (9మంది భారతీయులు)తో వెడుతున్న ఎంవి జెన్‌కో పికార్డీ లో ఈ ఘటన కారణంగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించినట్టు నివేదించలేదు, మంటలు కూడా అదుపులో ఉన్నాయి.
ఐఎన్ఎస్ విశాఖపట్నానికి చెందిన భారతీయ నావికాదళ ఇఒడి నిపుణులు దెబ్బతిన్న ప్రాంతాలను తనిఖీ చేసేందుకు 18 జనవరి 24 తెల్లవారు జామున పికార్డో నౌకపైకి వెళ్ళారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అది ప్రయాణానికి సురక్షితంగా ఉందని ఇఒడి నిపుణులు పేర్కొన్నారు. ఇప్పుడు ఆ నౌక తదుపరి రేవులో నిలిచేందుకు వెడుతోంది.
***
(Release ID: 1997631)
Visitor Counter : 152