ఆర్థిక మంత్రిత్వ శాఖ
జాతీయ పింఛను వ్యవస్థ కోసం ఒకటే నమోదు అవసరమయ్యే పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పిఒపి) ను నోటిఫై చేసిన పిఎఫ్ ఆర్‌డిఎ
Posted On:
17 JAN 2024 5:49PM by PIB Hyderabad
లావాదేవీలను సులభతరం చేయడం, డిజిటల్ పద్ధతిని ఎక్కువగా ఉపయోగించేలా చేయడం అన్న లక్ష్యాలతో నమోదు ప్రక్రియను సులువు చేస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్‌డిఎ - పింఛను నిధి నియంత్రణ & అభివృద్ధి ప్రాధికరణ సంస్థ) పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పిఒపి - ఉపస్థితి స్థానం) నియమాలు 2023ను జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ తో, బ్యాంకులు, బ్యాంకులు కాని సంస్థలు కూడా ఎన్‌పిఎస్ చందాదారులను చేర్చుకొని పిఒపిలుగా వ్యవహరించవచ్చు. ఇప్పుడు, వారు గతంలోలా బహుళ నమోదుకు బదులు ఎన్‌పిఎస్‌కు ఒకటే రిజిస్ట్రేషన్ అవసరం అవుతుంది. దానికారణంగా, వారు విస్త్రతమైన డిజిటల్ ఉనికి కలిగిన ఒకటే శాఖ ద్వారా కార్యకలాపాలు నిర్వహించవచ్చు. దరఖాస్తులను పరిష్కరించేందుకు సమయాన్ని 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు.
పైన పేర్కొన్న సరళీకరణ అనువర్తన వ్యయం & వ్యాపారాన్ని సులభతరం చేయడానికి నియమాలను సమీక్షించాలన్న కేంద్ర బడ్జెట్ 2023-24లో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఉంది.
https://www.pfrda.org.in//MyAuth/Admin/showimg.cshtml?ID=2861
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
(Release ID: 1997149)
Visitor Counter : 93