సహకార మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సిఆర్ సిఎస్) కార్యాలయం నూతన భవనాన్ని ప్రారంభించిన కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
సహకార సంఘాల సెంట్రల్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పమైన 'సహకర్ సే సమృద్ధి'ని బలోపేతం చేస్తుంది.
మోదీ ప్రభుత్వంలో కొత్త చట్టాలు, కొత్త కార్యాలయాలు, కొత్త పారదర్శక వ్యవస్థతో సహకార రంగంలో కొత్త శకం ప్రారంభమైంది.
సి ఆర్ సి ఎస్ సహకార రంగంలో పారదర్శకత, ఆధునికతను తీసుకువస్తుంది.
అభివృద్ధి చెందిన భారతదేశం అనే మోదీ దార్శనికతను సహకార మంత్రిత్వ శాఖ నెరవేరుస్తుంది.
మోదీ ప్రభుత్వ 5 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంలో సహకార రంగం కీలక భాగస్వామి కానుంది.
మెరుగైన పని సంస్కృతి కోసం కార్యాలయాల ఆధునీకరణ , సజావుగా ఏర్పాటు అవసరం.
సహకార మంత్రిత్వ శాఖ గత 30 నెలల్లో 60 ప్రధాన నిర్ణయాలు తీసుకుంది, ఇది రాబోయే రోజుల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది
పి ఎ సి ఎస్ ల ద్వారా డ్రోన్ దీదీ పొలాలను డ్రోన్లతో పిచికారీ చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆధునికతతో అనుసంధానమైందన్న నమ్మకం ప్రజల్లో కలుగుతుంది.
प्रविष्टि तिथि:
17 JAN 2024 7:44PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సి ఆర్ సి ఎస్) కార్యాలయ భవనాన్ని కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్.వర్మ, సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ జ్ఞానేష్ కుమార్, నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్ బిసిసి) మేనేజింగ్ డైరెక్టర్ , దేశవ్యాప్తంగా ఉన్న మల్టీ స్టేట్ కోఆపరేటివ్ ఫెడరేషన్, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు , బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

కేంద్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ కార్యాలయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పమైన 'సహకర్ సే సమృద్ధి'ని బలోపేతం చేస్తుందని శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వంలో కొత్త చట్టాలు, కొత్త కార్యాలయాలు, కొత్త పారదర్శక వ్యవస్థతో సహకార రంగంలో కొత్త శకం ప్రారంభమైందని అన్నారు. మోదీ సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన రెండేళ్ల లోనే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల చట్టంలోని 98వ సవరణ ప్రకారం అన్ని మార్పులు చేశామన్నారు. సహకార సంఘాల నిర్వహణలో వివిధ రకాల అవకతవకలను తొలగించడానికి 2023 లో ఒక చట్టాన్ని తీసుకురావడం ద్వారా పారదర్శక సహకారం కోసం మోడీ ప్రభుత్వం బలమైన బ్లూప్రింట్ ను రూపొందించిందని ఆయన అన్నారు. ఇప్పటికే సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్యాలయాన్ని కంప్యూటరీకరణ చేశామని, నేడు సి ఆర్ సి ఎస్ కు కూడా కొత్త కార్యాలయం వచ్చిందని తెలిపారు. సుమారు రూ.175 కోట్ల వ్యయంతో సుమారు 1550 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సి ఆర్ సి ఎస్ కార్యాలయాన్ని నిర్మించారు. మెరుగైన పని సంస్కృతి కోసం కార్యాలయాల ఆధునీకరణ, సజావుగా ఏర్పాటు అవసరం ఉందన్నారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల పాలనకు సంబంధించి గత రెండేళ్లలో తీసుకున్న చర్యలతో కొత్త శకానికి నాంది పలుకుతున్నామని శ్రీ షా తెలిపారు. జూలై 06, 2021 నుండి ఇప్పటి వరకు గత రెండేళ్ల ప్రయాణంలో, సహకార మంత్రిత్వ శాఖలోని అధికారులందరూ చాలా తక్కువ సమయంలో ఈ పనిని చేశారని ఆయన అన్నారు.
దేశంలో దాదాపు 125 ఏళ్ల సహకార ఉద్యమం కాలక్రమేణా బలహీనపడడం, , చట్టాలు అసంబద్ధంగా మారడం, పై నుంచి కింది వరకు సహకార రంగం ముందుకు సాగ లేకపోవడం వల్లనే ప్రధాని నరేంద్ర మోదీ సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం లోని స్పష్టమైన ఉద్దేశమని కేంద్ర సహకార మంత్రి అన్నారు. అందుకే స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే సహకారోద్యమం అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేదని అర్థమైందని . దేశంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై సహకారం చూపాల్సిన సమిష్టి ప్రభావం కనిపించ లేదని శ్రీ షా అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలలుగన్న 5 ట్రిలియన్ల అమెరికా డాలర్ల ఆర్థిక వ్యవస్థలో సహకార సంఘాల ప్రధాన భాగస్వామ్యాన్ని నిర్ధారించడం ద్వారా, మనం దానిని 21 వ శతాబ్దంలోకి తీసుకువెళతామని ఆయన అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే మోదీ దార్శనికతను సహకార మంత్రిత్వ శాఖ నెరవేరుస్తుందని ఆయన అన్నారు.

మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించిన పరిపాలన, కమ్యూనికేషన్, పారదర్శకతలో ఎలాంటి సమస్య ఉండదని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ రోజు 'కలెక్టివ్ ప్రాస్పెరిటీ: ది లెగసీ ఆఫ్ ఇండియన్ కోఆపరేటివ్స్' అనే పుస్తకాన్ని కూడా విడుదల చేసినట్లు తెలిపారు. ఈ పుస్తకం భారతీయ భాషల్లోకి అనువదించబడిన తరువాత, దాని స్ఫూర్తిని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఎసిఎస్) , అన్ని చిన్న యూనిట్లకు వ్యాప్తి చేయడానికి మనం కృషి చేయాలని సహకార మంత్రి అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సహకార రంగంలో తీసుకువచ్చిన అన్ని సంస్కరణల్లో అన్ని రాష్ట్రాలు రాజకీయాలకు అతీతంగా, సహకార మంత్రిత్వ శాఖకు మద్దతిచ్చాయని, ఇలాంటి సమయంలో సహకార రంగంలో కొత్త విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తం సహకార రంగంలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీ షా అన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో, సహకార మంత్రిత్వ శాఖ గత 30 నెలల్లో 60 చొరవ లను. చేపట్టిందని, గత 9 సంవత్సరాల్లో మోదీ సహకార రంగం కోసం మనకు భారీ పాత్రను నిర్దేశించారని కేంద్ర సహకార శాఖ మంత్రి తెలిపారు. మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీల పరిధిలోని ప్రతి సంస్థ వినియోగదారులు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, పేద వర్గాలకు చెందినవారేనని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో దేశంలోని కోట్లాది మంది పేద ప్రజల జీవితాలను మోదీ అన్ని సౌకర్యాలను కల్పించడం ద్వారా అత్యంత సరళతరం చేశారని కొనియాడారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఈ కోట్ల మంది పేదలు దేశాభివృద్ధికి దోహదపడేలా శక్తి ఒక్క సహకారానికి మాత్రమే ఉందన్నారు.
నేడు గుజరాత్ లో 36 లక్షల కుటుంబాలు పశుసంవర్ధక వ్యాపారంలో నిమగ్నం కావడం, వాటి వార్షిక టర్నోవర్ రూ.60 వేల కోట్లు కావడం ‘సహకార‘ అద్భుతమని శ్రీ అమిత్ షా అన్నారు. మానవీయ కోణం లో అన్ని ఏర్పాట్లు చేసుకునే సత్తా సహకార రంగానికి ఉందన్నారు. సహకార రంగంలో గత రెండేళ్లలో ఎన్నో అపూర్వమైన పనులు జరిగాయని శ్రీ షా పేర్కొన్నారు. సహారా గ్రూప్ లో చిక్కుకున్న తమ సొమ్ము తిరిగి రాదని ప్రజలు భయపడే వారని, కానీ సహారా గ్రూప్ లోని సహకార సంఘాల లో రిజిస్టర్ చేసుకున్న 1.5 కోట్ల మంది ఇన్వెస్టర్ల లో రిజిస్టర్ ఇప్పటివరకు 2.5 లక్షల మందికి రూ.241 కోట్లు తిరిగి వచ్చాయని శ్రీ అమిత్ షా చెప్పారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల కోసం రూపొందించిన కొత్త చట్టాలను అందరూ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు. సహకార రంగమే పునరుద్ధరణ కోరుకుంటోందనడానికి , సంస్కరణలను స్వాగతిస్తున్నదనడానికి ఇదే ఇదొక పెద్ద ఉదాహరణ అని ఆయన అన్నారు. సహకార రంగం విశ్వసనీయత కోల్పోతే విస్తరణ ఉండదని, అస్తిత్వ సంక్షోభం కూడా ఏర్పడుతుందని ఆయన అన్నారు.
ఇఫ్కో ప్రయోగాత్మకంగా నానో డీఏపీ, నానో యూరియా లిక్విడ్ ను తయారు చేసిందని, అతి తక్కువ సమయంలోనే రైతులకు అందించిందని కేంద్ర సహకార శాఖ మంత్రి తెలిపారు. మన ఉత్పత్తులకు భూసంరక్షణ చాలా ముఖ్యం కాబట్టి ఈ సమయంలో దీని అవసరం చాలా ఉందని ఆయన అన్నారు. దేశంలోని పలు గ్రామాల్లో డ్రోన్ల ద్వారా ఇఫ్కో లిక్విడ్ యూరియాను పిచికారీ చేయడంపై పెద్ద ఎత్తున ఆసక్తి కనిపిస్తోందన్నారు. నేడు డ్రోన్లు ఆధునిక వ్యవసాయానికి కొత్త చిహ్నంగా మారాయని ఆయన అన్నారు. నేడు పి ఎ సి ఎస్ ల ద్వారా డ్రోన్ దీదీ పొలాలను స్ప్రే చేయడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆధునికతతో అనుసంధానమైందన్న విశ్వాసం ప్రజల్లో కలుగుతుందన్నారు.

దేశంలోని ప్రతి రంగంలోనూ సహకారం పురోగతి సాధించిందని శ్రీ అమిత్ షా అన్నారు. దేశంలో కొత్తగా రెండు లక్షల పి ఎ సి ఎస్ లను నమోదు చేయాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో 12 వేలకు పైగా రిజిస్టర్ అయ్యాయని, 2 లక్షల మల్టీడిసిప్లినరీ పి ఎ సి ఎస్ లను ముందుగానే నమోదు చేస్తామన్నారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు బ్యాంకులుగా మారడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. 2020లో 10 మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు రిజిస్టర్ అయ్యాయని, 2023లో కొత్తగా 102 మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు రిజిస్టర్ అయ్యాయని, రిజిస్ట్రేషన్లు 10 రెట్లు పెరిగాయని తెలిపారు. ఈ మార్పు ను మనం వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, మరిన్ని బ్యాంకులు బహుళ రాష్ట్ర సహకార సంఘాలుగా, పరపతి సంఘాలు బ్యాంకులుగా మారే దిశలో ముందుకు సాగాలని శ్రీ అమిత్ షా అన్నారు.
***
(रिलीज़ आईडी: 1997148)
आगंतुक पटल : 236